వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీపి కబురు: రిలయెన్స్ జియో టారిఫ్‌లు ఇలా.., ఏ ప్లాన్ ఎలా?

రిలయెన్స్ జియో తాజా ప్రకటన పైన సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. జియో ఉచిత సేవలకు గుడ్ బై చెప్పి టారిఫ్ వార్‌లోకి రావడంపై సంస్థ పాజిటివ్‌గా స్పందించింది.

|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయెన్స్ జియో తాజా ప్రకటన పైన సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. జియో ఉచిత సేవలకు గుడ్ బై చెప్పి టారిఫ్ వార్‌లోకి రావడంపై సంస్థ పాజిటివ్‌గా స్పందించింది.

ఇక ఉచితం కాదు: జియో వినియోగదారులకు షాకింగ్ న్యూస్!ఇక ఉచితం కాదు: జియో వినియోగదారులకు షాకింగ్ న్యూస్!

ఏప్రిల్ 1వ తేదీ నుంచి టారిఫ్‌లు ప్రకటించడంతో టెలికాం ఇండస్ట్రికీ ఊరట లభించినట్లయిందని పేర్కొంది. ఉచిత సేవల స్థానంలో సేవలకు ధరలను ప్రతిపాదించడం పరిశ్రమకు మంచి వార్త అని తెలిపింది.

వాయిస్ కాల్స్ ఉచితం

వాయిస్ కాల్స్ ఉచితం

ఏప్రిల్ 1వ తేదీ నుంచి టారిఫ్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. జియో నెట్ వర్క్ నుంచి వాయిస్ కాల్స్‌ను ఉచితంగానే కొనసాగిస్తామని చెప్పారు.

పైకి కనబడని ఛార్జీలు ఉండవు

పైకి కనబడని ఛార్జీలు ఉండవు

ఎటువంటి రోమింగ్ చార్జీలు, పైకి కనిపించని ఛార్జీలు ఉండవని చెప్పారు. అత్యంత సరసమైన ధరకే డేటా అందిస్తామన్నారు. ఇన్నాళ్లు బెస్ట్ అనిపించుకున్నామని, ఇక ముందు అలాగే అనిపించుకుంటామన్నారు.

వెల్ కం ఆఫర్..

వెల్ కం ఆఫర్..

రిలయెన్స్ జియో.. వెల్‌కమ్‌ ఆఫర్‌తో పాటు న్యూఇయర్‌ ఆఫర్‌ను గత కొన్ని నెలలుగా ఉచితంగా ఇచ్చింది. ఈ ఉచిత సర్వీసులు మార్చి 31తో ముగియనున్నాయి. జియో టారిఫ్ ఆఫర్లు ఇలా..

ప్రైమ్‌ ప్లాన్‌

ప్రైమ్‌ ప్లాన్‌

వెల్‌కం, న్యూ ఇయర్‌ ఆఫర్‌ల సందర్భంగా లభించిన అన్ లిమిటెడ్‌ సర్వీసులను ఈ ప్లాన్‌ ద్వారా కొనసాగించుకోవచ్చు. ప్రైమ్‌ ప్లాన్‌లో సభ్యత్వానికి రూ. 99 చెల్లించి నమోదు చేసుకోవాలి. మార్చి 31లోపు నమోదు చేసుకున్న వారికి రూ.99కే ప్రాథమిక సభ్యత్వం. వీరు ఏడాది పాటు ఆఫర్లు పొందుతారు.

ప్రైమ్... ఏడాదిపాటు

ప్రైమ్... ఏడాదిపాటు

ప్రైమ్ ప్లాన్‌లో సభ్యత్యం ఒక ఏడాది పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత అంటే 2018 మార్చి 31 తర్వాత.. ప్రతి నెలా రూ. 303 చెల్లించవలసి ఉంటుంది. రోజుకు ఒక జీబీ డేటా వినియోగించుకోవచ్చు. అన్ని నెట్ వర్క్‌లకు ఉచిత కాల్స్ చేయవచ్చు.

ప్రీ లేదా పోస్ట్ పెయిడ్

ప్రీ లేదా పోస్ట్ పెయిడ్

ప్రైమ్‌ మెంబర్‌షిప్ తీసుకోకుంటే ప్రీపెయిడ్‌, పోస్ట్ పెయిడ్‌ విధానాలు కూడా అమలులో ఉంటాయి. ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. డేటాను వినియోగించుకోవచ్చు.

మెంబర్ షిప్ ఇలా..

మెంబర్ షిప్ ఇలా..

జియో స్టోర్స్‌ లేదా జియో వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేర్లను నమోదు చేసుకోవాలి. యాప్‌ ద్వారా కూడా సదుపాయం కల్పిస్తారు. కాగా, జియో కారణంగా ఎయిర్ టెల్‌, ఐడియాలు కూడా తమ టారిఫ్‌లను తగ్గించాయి. రానున్న రోజుల్లో డేటా వినియోగం ఎక్కువ కావడంతో పాటు బ్యాండ్‌విడ్త్‌ వేగం కూడా పెరగనుందంటున్నారు.

జియో దెబ్బ

జియో దెబ్బ

జియోపై ముఖేష్ అంబానీ ప్రకటనతో ఎయిర్ టెల్‌ షేర్లు నాలుగు శాతం పడిపోయింది. ఐడియా షేర్లు కూడా నష్టపోయాయి. బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ 4.02శాతం తగ్గి రూ.360.55కు పడిపోగా, రోజు మొత్తం మీద 4.27శాతం నష్టంతో రూ.359.60 కనిష్ఠ స్థాయిని తాకింది. ఐడియా సెల్యులార్‌ 0.37శాతం తగ్గి రూ.108.30 పడిపోయింది.

English summary
Cellular operators' association COAI today expressed relief that newcomer Reliance Jio has announced "price points" for data services post April 1, which although "aggressive" will not bleed the industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X