హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి.. మరో 14 మందికి అస్వస్థత

|
Google Oneindia TeluguNews

వ్యాక్సినేషన్ రెండు నెలల చిన్నారి ఉసురు తీసింది. మరో 14 మంది చిన్నారులను తీవ్ర అస్వస్థతకు గురి చేసింది. తాజాగా నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ వేసిన చిన్నారులకు అస్వస్థతకు గురయ్యారు. ఒక చిన్నారి నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, 14 మంది తీవ్ర అస్వస్థతతో నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు . వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది .వ్యాక్సినేషన్ వికటించి చిన్నారి మరణించడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

<strong>బతుకైనా చావైనా నీతోనే ... భర్త మరణించిన కొద్దిసేపటికే భార్య మృతి</strong>బతుకైనా చావైనా నీతోనే ... భర్త మరణించిన కొద్దిసేపటికే భార్య మృతి

నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌ నుండి సుమారు 15 మంది చిన్నారులు వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. అంతకుముందు ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. నెలన్నర, రెండు మాసాల చిన్నారులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత చిన్నారులు నొప్పికి గురికాకుండా ఉండేందుకు ఇచ్చే మందులు ఏమైనా వికటించాయా అనే కోణంలో కూడ వైద్యులు ఆరా తీస్తున్నారు.

infected vaccsination causes the baby death .. 14 more people are ill

బుధవారం రాత్రి నుండి చిన్నారులు వరుసగా అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రికి వస్తుండగా అస్వస్థతకు గురైన చిన్నారులను నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ ‌నుండి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులకు వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. అసలు అస్వస్థతకు కారణాలేవీ ఇంకాతెలియరాలేదు. మరో వైపు చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుల పై మండి పడుతున్నారు.

అయితే వ్యాక్సిన్ వల్ల చిన్నారులు అస్వస్థతకు గురి కాలేదని నీలోఫర్ ఆసుపత్రి చిన్న పిల్లల విభాగం హెచ్ఓడీ డాక్టర్ రవి ప్రకటించారు. ఒక్కసారిగా అంతమంది చిన్నారులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే విషయమై వైద్యులు ఆరా తీస్తున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ రెండు మాసాల చిన్నారి మృతి చెందాడు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
The 2 months baby child died due to vaccination.Another 14 children were seriously ill. Recently, the babies who were vaccinated in the Nampally Urban Health Center were ill. A baby was died in Niloufer. and the 14 severe illnesses have undergoing treatment at Niloufer hospital . Three of them are in critical condition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X