వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ స్పీచ్‌పై రామ్ చరణ్ ఇలా, వైసీపీ+జనసేన ప్రభుత్వమని మహేష్ కత్తి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గుంటూరులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగంపై అతని అన్నయ్య కొడుకు, ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ స్పందించారు. పవన్ తన ప్రసంగంలో బీజేపీని, వైసీపీని విమర్శించడంతో పాటు టీడీపీని ఏకిపారేశారు.

చదవండి: నన్ను అలా అంటారా!: రైల్వే జోన్‌పై పీయూష్ గోయెల్ క్లారిటీ, బాబుకు కౌంటర్

జనసేనాని విమర్శలపై ఓ వైపు టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. మరోవైపు, అదే స్థాయిలో ప్రశంసలు కూడా వస్తున్నాయి. పవన్ ప్రసంగాన్ని మహేష్ కత్తి కూడా ప్రశంసించారు.

చదవండి: పవన్! నీకేం వస్తుంది, ఢిల్లీలో రహస్య ఒప్పందాలు, మోడీ తమిళనాడు పాలిటిక్స్: బాబు సంచలనం

పవన్ కళ్యాణ్ ప్రసంగంపై రామ్ చరణ్

స్ఫూర్తివంతమైన, నిజాయితీతో కూడిన అద్భుతమైన ప్రసంగం అంటూ రామ్ చరణ్ తేజ పేర్కొన్నారు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం ఎదురు చూద్దామన్నారు. రామ్ చరణ్ సహా పలువురు గతంలోను పవన్ ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు.

వైసీపీ, లెఫ్ట్, జనసేన కలిస్తే ప్రభుత్వం

మహేష్ కత్తి కూడా పవన్ కళ్యాణ్‌కు అనుకూలంగా ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, వామపక్షాలు, జనసేన కలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'వైసిపి+వామపక్షాలు+జనసేన = 2019 ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం' అని పేర్కొన్నారు.

చంద్రబాబు బదులు లోకేష్‌ను అనొద్దు

గుంటూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి నారా లోకేష్ పైన విమర్శలు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మహేష్ కత్తి స్పందిస్తూ.. చంద్రబాబును అన్నా పర్లేదు కానీ లోకేష్‌ను అంటే మాత్రం ఊరుకునేలా లేరని పేర్కొన్నారు.

పూనమ్ కౌర్ మరోసారి

ఇదిలా ఉండగా, పూనమ్ కౌర్ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఆమె తన ఫేస్‌బుక్ అకౌంటులో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. కాన్సెప్ట్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి, బట్టలు మార్చుకున్నట్లు మనుషులను మారుస్తూ మాట మీద ఉండకపోవడం, జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ వేషభాషలు మారుస్తూ జనాలను మభ్యపెట్టి అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని, ఆ భగవంతుడే నిజం ఏమిటో తెలిసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కాగా, గతంలో పవన్‌తో తన వివాదంలోకి పూనమ్‌ను మహేష్ లాగిన విషయం తెలిసిందే.

English summary
'Inspiring & truthful ... great speech!! Let’s hope the best for our state in future' Ram Charan tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X