వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీ పార్టీలో మున్నూరు కాపుల‌కు అవ‌మానం..! యాద్రుచ్చిక‌మా..! వ్యూహమా..!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీలో అనుకొనో.., అనుకోకుండానో విచిత్ర పరిస్థితులు చోలుచేసుకుంఉన్నాయి. ముంద‌స్తు అభ్యుర్థుల ప్ర‌క‌ట‌న కార‌ణంగా అసంత్రుప్త సెగ‌లు రేగుతున్న త‌రుణంలో ఒక సామాజిక వ‌ర్గాన్ని గులాబీ బాస్ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. పార్టీలో విమ‌ర్శ‌లకు గురౌతున్న అదే సామాజిక వ‌ర్గం కావ‌డంతో అదినేత కావాల‌నే ఇరికిస్తున్నారా లేక యాద్రుచ్చికంగా జ‌రుగుతోందా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కి అదికార టీఆర్ఎస్ పార్టీలో వివ‌క్ష‌కు గురౌతున్న ఆ సామాజిక వ‌ర్గం ఏంటి..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!

 మొన్న డీయ‌స్..! నిన్న కొండా...! గులాబీ పార్టీలో ఏంజ‌రుగుతోంది..?

మొన్న డీయ‌స్..! నిన్న కొండా...! గులాబీ పార్టీలో ఏంజ‌రుగుతోంది..?

మున్నూరు కాపులకు టీఆర్ఎస్ క‌లిసొస్తున్నట్టు లేదు. ఆ పార్టీలో ఉన్న మున్నూరుకాపు నేతలు ఇటీవల తీవ్ర వివాదాస్పద మవుతున్నారు. నేరుగా పార్టీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునే పరిస్థితికి వస్తున్నారు. రాష్ట్రంలో మున్నూరు కాపులకు పెద్ద దిక్కు లాంటి రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ ఉదంతమే దీనికి ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీతో దశాబ్ధాల అనుబంధం ఉండి కూడా డీఎస్ ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరారు. రాజ్యసభ పదవి పొందారు. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు. ప్రస్తుతం టీఆర్ఎస్ అధిష్టానం డీఎస్ పై కారాలుమిరియాలు నూరుతోంది.

 మున్నూరు కాపే ఎందుకు బ‌లౌతోంది..?

మున్నూరు కాపే ఎందుకు బ‌లౌతోంది..?

కేసీఆర్ కుమార్తె కవిత నాయకత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలంతా డీఎస్ పై గురిపెట్టారు. ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరుతూ, ముఖ్యమంత్రికి ఓ తీర్మానం కూడా చేసి పంపారు. అక్కడితో వ్యవహారం ఆగిఉంటే, ఇప్పుడు పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, రాజకీయంగానే కాక, ఫ్యామిలీ పరంగా కూడా డీఎస్ ను అవ‌మాన‌ప‌రిచార‌నే పరిస్థితి వచ్చింది. డీఎస్ కుమారుడు సంజయ్ లైగింగ వేధింపుల కేసులో నిజానిజాలు ఆ పై వాడికే తెలియాలి.

కొండా దంప‌తుల ఆరోప‌ణ‌లు వాస్త‌వ‌మేనా..? స‌రైన గుర్తింపు లేదా..?

కొండా దంప‌తుల ఆరోప‌ణ‌లు వాస్త‌వ‌మేనా..? స‌రైన గుర్తింపు లేదా..?

కానీ, డీఎస్ పై టీఆర్ఎస్ అధిష్టానం గుర్రుగా ఉన్న సమయంలోనే సంజయ్ కేసు తెర మీదకు రావడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇక మున్నూరు కాపు సామాజికవర్గానికే చెందిన కొండా దంపతుల వ్యవహారం కూడా ఇటీవల టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. వాళ్లు రేపోమాపో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. కేటీఆర్ ను కలవాలంటే, కొండా మురళికి హరీష్ రికమండేషన్ అవసరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దీంతో మనస్థాపంలో ఉన్న కొండా దంపతులు ఇక ఎక్కువ కాలం కారులో ప్రయాణించే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతోంది.

ఆందోళ‌న‌లో మున్నూరు కాపులు..! గుర్తింపు కావాలంటున్న కాపులు..!

ఆందోళ‌న‌లో మున్నూరు కాపులు..! గుర్తింపు కావాలంటున్న కాపులు..!

ఆ మధ్య రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాణయ విషయంలో కూడా వివాదం చెలరేగింది. మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానం విషయంలో ఆయన టీఆర్ఎస్ అధినాయకత్వానికి ఎదురు తిరిగారు. వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుండటంతో... కేటీఆర్ జోక్యం చేసుకుని కొంత సర్దుమణిగేలా చేశారు. ఇలా టీఆర్ఎస్ లో కాకతాళియమో లేక కావాలనే జరుగుతుందో తెలియదు కానీ... మున్నూరు కాపు నేతలే వివాదాస్పదమవుతున్నారు. పార్టీ అధినాయకత్వానికి టార్గెట్ గా మారుతున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల పై ఎలా ఉంటుందోనన్న ఆందోళన టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది.

English summary
In telangana kapu community targeting by the ruling party, few days ago senior leader d. srinivas, and recently konda family kept kcr away from the party. kapu community only facing such problems in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X