మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

600కేజీల డ్రగ్స్: మెదక్, నల్గొండల్లో భారీ ముఠాలు.. కూపీ లాగుతున్న ఇంటలిజెన్స్!

భారీ ఎత్తున డ్రగ్స్ నిలువ చేశారన్న సమాచారంతో.. మెదక్, నల్గొండ, జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సోదాలు నిర్వహించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అటు టాలీవుడ్.. ఇటు హైదరాబాద్.. గత కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసులోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల కూడా డ్రగ్స్ మూలాలు బయటపడుతుండటం కలకలం రేపుతూ వస్తోంది. కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థ సైతం సైలెంట్ గా తన పని కానిచ్చేస్తోంది.

తాజాగా ఓ భారీ డ్రగ్ ముఠా గుట్టు రట్టు చేసింది ఇంటలిజెన్స్. భారీ ఎత్తున డ్రగ్స్ నిలువ చేశారన్న సమాచారంతో..
మెదక్, నల్గొండ, జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఏకంగా 600 కేజీల మత్తు పదార్థాలు పట్టుబడటం గమనార్హం. వీటి విలువ రూ.7 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా.

intelligence busted huge drug racket in medak, nalgonda

మాదకద్రవ్యాల ముఠాకు సంబంధించి పలువురు అనుమానితులు, నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పట్టుబడిన మాదకద్రవ్యాలను ల్యాబ్స్ లోనే తయారుచేసినట్లు అధికారులు గుర్తించారు.

అయితే ఈ ల్యాబ్‌లు ఏవైనా సంస్థలకు చెందినవా? లేక డ్రగ్స్ తయారీ కోసం ఈ ముఠానే వాటిని ఏర్పాటు చేసిందా? అన్న దానిపై ప్రస్తుతం అధికారులు కూపీ లాగుతున్నారు.

English summary
Directorate of Intelligence officials busted a huge drug racket in Medak and Nalgonda districts. They found almost 600kg drugs in storage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X