వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ బోర్టు రద్దు..! కేంద్రం తరహాలో 12 వరకు ఒకే సంస్థ..! అంగీకారం తెలిపిన సీఎం..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇంటర్ బోర్టు రద్దు..! అంగీకారం తెలిపిన సీఎం..? || Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుపై సీఎం చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిస్తోంది. ఇంటర్ బోర్డును రద్ధు చేయాలని ఆదేశాలు జారీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వం తరహాలో ఒకటి నుంచి 12 వ తరగతి వరకు ఒకే బోర్డును ఏర్పాటు చేయనున్నారు. కేంద్రంలో సీబీఎస్ఈ బోర్డు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా విధానాన్ని పర్యవేక్షిస్తోంది. తెలంగాణ ఇంటర్ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తారా లేదా పేరు మార్చి, 1 నుంచి 12 వ తరగతి వరకు మరో సంస్థను ఏర్పాటు చేస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే అంశంపై సాద్యాసాద్యాలను పరిశీలించాల్సిందిగా చంద్రశేఖర్ రావు అదికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

ఇంటర్ పై ఎరుపెక్కిన రాష్ట్రం..! అన్ని కలెక్టరేట్ల ముట్టడి..! గవర్నర్ కు అఖిలపక్షం వినతిపత్రం..!!ఇంటర్ పై ఎరుపెక్కిన రాష్ట్రం..! అన్ని కలెక్టరేట్ల ముట్టడి..! గవర్నర్ కు అఖిలపక్షం వినతిపత్రం..!!

 రాష్ట్రంలో సీబీఎస్ఈ తరహా విధానం..! ప్రభుత్వ సూత్రప్రాయ అంగీకారం..!!

రాష్ట్రంలో సీబీఎస్ఈ తరహా విధానం..! ప్రభుత్వ సూత్రప్రాయ అంగీకారం..!!

ఇక ఇదే ఈ అంశంపై చర్చించేందుకు ప్రగతి భవన్ సీఎం చంద్రశేఖర్ రావు, విద్యశాఖ ఉన్నతాధికారులు, ఇంటర్ బోర్డు అధికారులతో సమావేశమయ్యారు. గత ఆరు రోజులుగా ఇంటర్ ఫలితాలపై రాష్ట్ర వ్యప్తంగా ఉద్యమాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో అట్టుడుకుతోంది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తపోస్తున్నాయి. ఇంటర్ వ్యవహారంలో రాష్ట్రం రావణ కాష్టాన్ని తలపిస్తున్న నేపథ్యమే కాకుండా, విద్యార్థుల ఆత్మహత్యలతో అట్టుడుకుతోంది. దీంతో ఇంటర్ బోర్డ్ పై ముఖ్యమంత్రి సంచలన నిర్ణయంతీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఒత్తిడి నుంచి విద్యార్థులకు విముక్తి..! సీబీఎస్ఈ తరహా విధానం..!!

ఒత్తిడి నుంచి విద్యార్థులకు విముక్తి..! సీబీఎస్ఈ తరహా విధానం..!!

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని సీఎం చంద్రశేఖర్ రావు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రగతిభవన్‌లోనిర్వహించిన సమీక్షలో ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. పాఠశాల విద్యలో ఇంటర్‌ విద్యా విలీనానికి సంబంధించి రెండేళ్ల క్రితమే బీజం పడింది. ఇందుకు సంబంధించి సీఎం చంద్రశేఖర్ రావు గతంలోనే ప్రతిపాదన చేశారు. దీనిపై కాలేజీ యాజమాన్యాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల అభిప్రాయాన్ని తీసుకున్నారు. వారంతా వ్యతిరేకించడంతో సీఎం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

 వందల కోట్ల వ్యాపారానికి చెక్‌..! మరిన్ని కేంద్ర నిధులకు అవకాశం..!!

వందల కోట్ల వ్యాపారానికి చెక్‌..! మరిన్ని కేంద్ర నిధులకు అవకాశం..!!

దేశంలోని 29 రాష్ట్రాల్లో కేవలం ఏపీ, తెలంగాణలో మాత్రమే ఇంటర్మీడియట్‌ బోర్డు ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో సీబీఎస్ఈ విధానంతో పాటుగా 10+2 విధానం అమల్లో ఉంది. అంటే పాఠశాల విద్యకు, ఇంటర్మీడియట్‌ విద్యకు ఒకే శాఖ, ఒకే కార్యదర్శి ఉంటారు. ఈ రెండు శాఖలూ ఒకే గొడుగు కింద ఉండడం వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఏటా 15-20 కోట్ల రూపాయల వరకు మాత్రమే నిధులు అందుతున్నాయి. అయితే ఒకే గొడుగు కింద ఉంటే ఏడాదికి 300 కోట్ల రూపాయల వరకు ఫండింగ్‌ వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఒకే గొడుగు కిందకు టెన్త్, ఇంటర్..! ప్రయోజనాలు అనేకం..!!

ఒకే గొడుగు కిందకు టెన్త్, ఇంటర్..! ప్రయోజనాలు అనేకం..!!

ఇంటర్మీడియట్‌ విద్య పేరిట రాష్ట్రంలో ఏటా వందల కోట్ల వ్యాపారం సాగుతుండడం గమనార్హం. అదే విధంగా జేఈఈ, నీట్‌ ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాజకీయ లాబీయింగ్‌ కూడా పెరిగిపోయింది. ఈ విషయంలో ప్రభుత్వం చూసీ చూడనట్లుగా ఉంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే రాష్ట్రంలో సీబీఎస్ఈ తరహా విద్యా విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
CM Chandrashekhar Rao has been sensational decision on the Telangana Intermediate Board. There seems to be more room for orders to make the inter-board work easier. The central government will form a single board from one to 12th standard.cm wants to fallow the central standards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X