వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో గుర్తింపులేని కాలేజీలపై కొరడా .. 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో గుర్తింపులేని కాలేజీలపై కొరడా ఝుళిపిస్తుంది విద్యా శాఖ . తెలంగాణా రాష్ట్రంలో 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ రోజు ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో భేటీ అయిన విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తింపు లేని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . ఇక హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో గుర్తింపు లేని ఇంటర్ కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు పేర్కొన్నారు .

ఇంటర్ పరీక్షల్లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్ఇంటర్ పరీక్షల్లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్

ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులేని 79 కళాశాలలను గుర్తించి నోటీసులు ఇచ్చామని,మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించామని ఆయన పేర్కొన్నారు . కాలేజీల యాజమాన్యాల నుంచి స్పందన రాకుంటే వాటిని మూసివేస్తామని హెచ్చరించారు. కచ్చితంగా అనుమతులు తీసుకుని, నిబంధలన ప్రకారం కళాశాలలు నడిపించాలని లేదంటే కచ్చితంగా కళాశాలలు మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు.

Inter board issued notices to 79 unrecognized inter colleges in Telangana

ఇక హైకోర్టు అనుమతులు లేని కాలేజీలపై చర్యలు తీసుకోమని చెప్పిందనిఈ నెల 25 తేదీ లోపు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ఇంటర్ బోర్డు కార్యదర్శి కాలేజీ యాజమాన్యాలు సహకరించాలని అన్నారు. కొన్ని కాలేజీలకు అగ్నిమాపక అనుమతి లేదని, మరికొన్ని కాలేజీలు ఓ చోట అనుమతి తీసుకుని, అదే పేరుతో అనుమతి లేకుండా మరోచోట నడుపుతున్నారని చెప్పారు. ఇక అనుమతులు లేని, అడ్రెస్ మార్చిన , విద్యార్థులకు వసతి సరిగా లేని, ఫైర్ సేఫ్టీ లేని కళాశాలలకు చెక్ పెట్టే పనిలో ఉన్నారు ఏపీ ఇంటర్ విద్యా శాఖాధికారులు.

English summary
telangana inter board secretary said that 79 unrecognized colleges across Telangana have been issued notices and ordered to be interpreted within three days. Colleges have been warned to shut down if they do not receive a response from the management. Colleges are strictly admissible, nor are they required to operate in accordance with regulations, or else they will be closed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X