వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ బోర్డు అధికారుల నిర్వాకంతో విద్యార్ధి బలి.. అప్పుడు పాస్ , ఇప్పుడు ఫెయిల్

|
Google Oneindia TeluguNews

ఇంటర్ బోర్డు అధికారుల నిర్వాకం ఒక విద్యార్థికి తిప్పలు తెచ్చి పెట్టింది. మొదటి సంవత్సరం పాస్ అయిన విద్యార్ధి రెండో సంవత్సరం కూడా పరీక్షలు రాశాక మొదటి సంవత్సరం లో ఫెయిల్ అయినట్టు మెమో రావటంతో విద్యార్థితో పాటు ఆ మెమో చూసిన వారంతా అవాక్కయ్యారు. అప్పుడు పాస్ అయ్యి ఇప్పుడు మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ ఎలా అని దిక్కు తోచని స్థితిలో పడ్డాడు ఆ విద్యార్ధి . ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోక లబోదిబోమంటున్నాడు సదరు విద్యార్ధి.

<strong>జగన్ పై నాగబాబు ఫైర్ .. తెలంగాణా విద్యార్థుల ఆత్మహత్యలపై ఒక్క వెధవ మాట్లాడలేదని ఆగ్రహం </strong>జగన్ పై నాగబాబు ఫైర్ .. తెలంగాణా విద్యార్థుల ఆత్మహత్యలపై ఒక్క వెధవ మాట్లాడలేదని ఆగ్రహం

మొదటి సంవత్సరం అప్పుడు పాస్ .. ఇప్పుడు ఫెయిల్... మెమోలో గందరగోళం

మొదటి సంవత్సరం అప్పుడు పాస్ .. ఇప్పుడు ఫెయిల్... మెమోలో గందరగోళం

వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన నిమ్మల రవి హుజూర్‌నగర్‌ గాయత్రి కళాశాలలో చదివాడు . రవి సెకండియర్లో మ్యాథ్స్‌, ఇంగ్లీష్‌ ఫెయిలయ్యాడు. అయితే, రెండేళ్లకు సంబంధించిన మార్కుల జాబితాలో మొదటి సంవత్సరం సంస్కృతం పాఠ్యాంశం నాట్‌ ఫౌండ్‌ అని వచ్చింది. అలాగే, సంస్కృతం మార్కులను మ్యాథ్స్‌ కు, మ్యాథ్స్‌ మార్కులను ఫిజిక్స్‌కు, ఫిజిక్స్‌ మార్కులను కెమిస్ట్రీకి వేసేశారు. ఫలితంగా విద్యార్థిని ఫెయిల్‌ చేసేశారు. రెండో సంవత్సరంలో రెండు సబ్జెక్ట్ లతో పాటు మొదటి సంవత్సరం పాసైన సబ్జెక్టులు కూడా ఫెయిల్ గా మెమోలో వేశారు.

మళ్ళీ ఫీజు చెల్లించి పరీక్షలు రాయమంటున్న అధికారులు .. లబోదిబోమంటున్న విద్యార్ధి

మళ్ళీ ఫీజు చెల్లించి పరీక్షలు రాయమంటున్న అధికారులు .. లబోదిబోమంటున్న విద్యార్ధి

ఫస్టియర్‌ పాసైన రవికి పాసైనట్లు మెమో కూడా ఇచ్చారు. సెకండియర్‌ కూడా రాసిన రవికి రెండేళ్ల ఫలితాలలో ఇప్పుడు ఫస్టియర్లో ఫెయిలైనట్లు పేర్కొన్నారు. అంతేనా, ఒక సబ్జెక్టుకి వేయాల్సిన మార్కులను మరో సబ్జెక్టుకి వేసి గందరగోళం చేశారు . దీనిపై రవి జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేయగా, తామేమీ చేయలేమన్నారు. మళ్లీ ఫీజు చెల్లించి పరీక్ష రాయాలని బోర్డు అధికారులు చెప్పారు. పాసైన సబ్జెక్టును మళ్ళీ రాయమనడం ఏమిటని విద్యార్థి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

సాంకేతిక లోపం వల్లే సమస్య .. న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాం అంటున్న అధికారులు

సాంకేతిక లోపం వల్లే సమస్య .. న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాం అంటున్న అధికారులు

ఇంటర్‌ మొదటి సంవత్సరం 2016-17 లో ఉత్తీర్ణత సాధించానని 2018లో సెకండియర్‌లో మ్యాథ్స్‌-ఏ, ఇంగ్లీష్‌ ఫెయిలయ్యానని చెప్పాడు రవి . ఆ రెండూ 2019 మార్చిలో పాసయ్యాను. కానీ, సెకండియర్‌ మెమోలో ఫస్టియర్‌ సంస్కృతం ఫెయిల్‌ అయినట్లు చూపిస్తోందన్నాడు . మళ్లీ ఫీజు చెల్లించి పరీక్ష రాయాలని బోర్డు అధికారులు చెప్పారని పాసైన పరీక్ష మళ్ళీ రాయటంపై రవి ఇబ్బంది పడుతున్నారు. అయితే అధికారులు మాత్రం సాంకేతిక లోపం వల్ల మొదటి సంవత్సరం ఫలితాలు అలా వచ్చాయి. విద్యార్థికి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని జిల్లాలో ఇలాంటి సంఘటనలు మూడు జరిగాయని చెప్పటం కొసమెరుపు .

English summary
Intermediate board technical errors made a student facing problems. intermediate board gave shocking results to a student . A student named Ravi passed his first year after second year results now he was failed in first year . the board sent the shocking results to him . With this results he approached the officials .. but the officials said that again he has to write examinations . there is a technical error occured . but the student should bear punishment .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X