వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్ ఇలాకాలో మరో విద్యార్థిని బలి... ఆగని ఆత్మహత్యలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాల రగడ కొనసాగుతుంది . ఇంటర్ ఫలితాల అవకతవకలపై విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ఇప్పటి వరకు 23మంది విద్యార్థులు బలవంమరనాలకు పాల్పడ్డారని, ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇంటర్ అక్రమాలపై చర్యలు షురూ.. ఇద్దరిపై మొదటి వేటు వేసిన బోర్డ్ !ఇంటర్ అక్రమాలపై చర్యలు షురూ.. ఇద్దరిపై మొదటి వేటు వేసిన బోర్డ్ !

కేటీఆర్ ఇలాకాలో ...రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో విద్యార్థిని బలి

కేటీఆర్ ఇలాకాలో ...రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో విద్యార్థిని బలి

రాష్ట్ర వ్యాప్త ఆందోళనల నేపధ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటే ఇంటర్ ఫలితాలలో ఫెయిలైన ఓ విద్యార్థిని పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సాక్షాత్తు కేటీఆర్ ఇలాకాలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశం అవుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చింది.

తెలంగాణలో ఆగని ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు

తెలంగాణలో ఆగని ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు

తెలంగాణలో ఇంటర్మిడియట్‌ ఫలితాలు వెలువడిన దగ్గరి నుండి విద్యార్థులు ఫెయిల్ అయ్యామని వరుస ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. ఒకపక్క ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పినా విద్యార్థులు మాత్రం ప్రాణాలు వదులుతూనే ఉన్నారు. కాగా ఇప్పటికి తెలంగాణలో విద్యార్ధిని, విద్యార్థులు సూమారు 23 మంది విద్యార్థులు ప్రాణాలను వదిలారు . తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని .. ఫెయిల్ అవ్వటమే కారణం

పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని .. ఫెయిల్ అవ్వటమే కారణం

ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం , పరీక్షా ఫలితాల్లో అవకతవకల వ్యవహారంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటమండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన కామిండ్ల లావణ్య అనే ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న లావణ్య తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.

English summary
Lavanya an intermediate second year girl who was resident of vattimalla village in Rajanna siricilla district. The girl, who felt very bad by saw the results. her name did not appear in the results announced on Thursday, because of her failure in exams she committed suicide by taking festicide and The police registered the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X