వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్లో ఫెయిల్ .. ఐఐటీ లో కూడా ఫెయిల్ అవుతానని గన్ తో కాల్చుకుని ఇంటర్ విద్యార్ధి బలి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో నేరెడ్‌మెట్‌లో ఇంటర్ విద్యార్ధి అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే కుటుంబ కలహాలతో తండ్రి కుమారుడిని కాల్చి చంపారని తొలుత వార్తలు వచ్చాయి. తండ్రి మహారుద్దీన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఇంటర్ లో ఫెయిల్ అవ్వటం, నేడు ఐఐటీ ఫలితాలు రానుండటం విద్యార్ధి మృతికి కారణాలని తేల్చారు పోలీసులు .

Inter failed student shot himself in fear of IIT results in Neredmet PS limits

ఇంటర్ లో ఫెయిల్ .. డిప్రెషన్ లో తనను తానే కాల్చుకున్న విద్యార్ధి

ఆర్కే పురం బాలాజీ కాలనీకి చెందిన సోహైల్ అనే విద్యార్ధి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తండ్రి మహారుద్దీన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. తాజాగా వెల్లడైన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో సోహైల్ ఫెయిల్ అయ్యాడు. దీంతో తండ్రి కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదువు మీద శ్రద్ధ పెట్టాలని సూచించాడు. అప్పటి నుండి డిప్రెషన్ లో ఉన్న సోహైల్ నేడు ఐఐటీ ఫలితాలు రానుండటంతో అందులో సైతం ఫెయిల్ అయ్యానేమో అని భయపడి తండ్రి వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకున్నాడు

వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుకు మార్గదర్శకాలు జారీ .. ఎలా లెక్కిస్తారంటే

సోహైల్ మృతిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ...

సోమవారం అర్ధరాత్రి మంచంపై తుపాకీతో కాల్చుకుని సోహైల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. అతని తండ్రి ఆర్మీలో పనిచేశాడు కాబట్టి ఇంట్లో లైసెన్స్‌డ్ గన్ ఉంది. దానితో ప్రాణాలు తీసుకున్న సోహైల్ మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆధారాలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ ఫెయిల్ అవ్వడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నప్పటికీ మరేదైనా కోణం వుందా అన్నదానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
One more Intermediate student committed suicide by shooting himself with a gun on Monday late night in RK Puram under Neredmet Police Station limits. The victim identified as Sohail. According to police, since Sohail failed in Intermediate exams his father Maharuddin, who is a retired Army employee and presently working as a security guard in a Bank, argued with him and told him to take care of his studies. Due to which Sohail went into depression. He has also taken coaching for IIT and as the results for IIT exams are going to release today, he doubted about his rank and took the extreme step under depression.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X