వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లాయి : తప్పుచేసినవారిపై చర్యలు, జనార్ధన్ రెడ్డి స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల ప్రకటనల్లో తప్పులు దొర్లినట్టు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు సమర్పించిన నివేదికను మీడియాకు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. తప్పుచేసిన బోర్డు, ఏజెన్సీ, ఇతర విభాగాలకు చెందిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పబ్లికేషన్ లో తేడా

పబ్లికేషన్ లో తేడా

ఇంటర్ ఫలితాల్లో తప్పుకు ప్రధాన కారణం పబ్లికేషన్ తో తేడా జరిగినట్టు కమిటీ గుర్తించిందని పేర్కొన్నారు. ఆరు తప్పులు జరిగినట్టు వెంకటేశ్వరరావు నేతృత్వంలోని కమిటీ గుర్తించిందని .. దానికి గల కారణాలను 10 పేజీల్లో నివేదించిందని తెలిపారు. కొందరు విద్యార్థులకు సంబంధించి 99కి బదులు 00 మార్క్ పెట్టడంతో తప్పు జరిగిందన్నారు.

సెంటర్ మార్చడంతో తప్పిదం

సెంటర్ మార్చడంతో తప్పిదం

496 మంది విద్యార్థులు సొంత కాలేజీలో సెంటర్ పడిందని చెప్పారు. అయితే చివరి క్షణంలో వారి సెంటర్ మార్చి పరీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. అంతకుముందు కేటాయించిన సెంటర్ లో అబ్ సెంట్ పడిందని .. అటెండెట్ పడకపోవడంతో కొంచెం పొరపాటు జరిగిందని అంగీకరించారు. ఎంఈసీకి చెందిన 4 వేల 9 వందల మంది విద్యార్థుల విషయంలో ఇలాంటి పొరపాటే జరిగినట్టు తెలిపారు. వీరేగాక మరికొందరు విద్యార్థులు ఆన్సర్ షీట్ లో సరిగా బబుల్ చేయకపోవడంతో మార్కుల లిస్టులో తేడా చూపిందని వెల్లడించారు.

ఇక నష్టం జరగనీయం

ఇక నష్టం జరగనీయం

మొత్తం 9 లక్షల 70 వేలమంది విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సరైన చర్యలు తీసుకుంటామని భరోసా నిచ్చారు. జాగఫ్రికి చెందిన 531 మంది విద్యార్థుల ప్రాక్టికల్ మార్కుల మార్కుల షిట్ లో మిస్సైందని తెలిపారు. అందుకే ఫలితాల్లో తేడా జరిగిందని పేర్కొన్నారు. ప్రధానంగా కోడింగ్, డీ కోడింగ్ తో పాటు సాప్ట్ వేర్ సమస్య ఏర్పడిందని .. అందుకే ఫలితాలపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు.

అందరికీ ఫ్రీ రీ వాల్యుయేషన్

అందరికీ ఫ్రీ రీ వాల్యుయేషన్

ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుల పేపర్లను ఉచితంగా రీ వాల్యుయేషన్ చేస్తున్నట్టు గుర్తుచేసిన జనార్థన్ రెడ్డి .. 80 శాతం మార్కులతో పాసై .. మిగతా సబ్జెక్టుల్లో ఫెయిలైన వారి పేపర్లను కూడా ఫ్రీగా రీ వాల్యుయేషన్ చేస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే 3.40 లక్షల మంది ఫ్రీగా వాల్యుయేషన్ చేస్తున్నామని .. దానికి అదనంగా 22 వేల 141 మంది పేపర్లను రీ వాల్యుయేషన్ చేస్తామని తెలిపారు.

English summary
According to Education Secretary Janardhan Reddy, there are mistakes in the inter. The report submitted by the chairman of the committee, Venkateshwara Rao, He said that the chief Secretary's approval was granted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X