వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొంతు కోసుకున్న ఇంటర్ విద్యార్ధి ... కారణం తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

|
Google Oneindia TeluguNews

ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేదని తల్లిదండ్రుల చెప్పడానికి భయపడిన విద్యార్థి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానిక పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద గొంతు కోసి పడి ఉన్న విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఎవరు అనుమానించిన పోలీసులు విద్యార్థి అసలు విషయం చెప్పాక నిర్ఘాంతపోయారు.

పబ్జీ ఎఫెక్ట్ .. సిద్దిపేటలో మరో యువకుడు బలి
సూర్యాపేట జిల్లా కాసర్లకు చెందిన తరుణ్ కుమార్ ప్రగతి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్ కు పరీక్షలు జరుగుతున్న క్రమంలో అన్ని పరీక్షలు రాసిన తరుణ్ చివరి పరీక్ష రేపు అంటే మార్చి 13న రాయాల్సి ఉంది. ఈ క్రమంలో పరీక్షలు సరిగా రాయలేదనీ..ఫెయిల్ అయిపోతాననే భయంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలీయక అయోమయానికి గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు తిడతారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తరుణ్ పోలీసులకు తెలిపాడు.

inter student committed suicide by strangling... Do you know the reason ?

పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భయంతో నగరంలోని పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద గొంతు కోసుకున్న తరుణ్ కుమార్ ను రాత్రంతా ఎవరు గమనించకపోవటంతో అచేతనంగా పడి ఉన్నాడు. ఉదయం వాకింగ్ కు వెళ్లిన కొంతమంది అతన్ని గుర్తించటంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఆ తరువాత విద్యార్థి మాచర్ల తరుణ కుమార్ నుండి వివరాలు సేకరించారు. మొదట తనపై ఎవరో గుర్తు తెలియనివారు దాడి చేశారని తెలిపారు. ఆ తరువాత అసలు విషాయాన్ని బైటపెట్టారు. తనకు తానే గొంతు కోసుకున్నానని పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతోనే, తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక గొంతు కోసుకున్నానని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

English summary
A student who is writing inter exams committed suicide by strangling with fear of failing examination. Tharun Kumar of Suryapet city had committed suicide to not tell parents that the exams were not properly written by him . he cut his neck with a blade and Local people have moved Tarun Kumar to the hospital. The shock struck when Tarun Kumar told police that he had strangled him self .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X