వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో రోజు ఇంటర్ బోర్దు వద్ద ఆందోళనలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

రెండో రోజు ఇంటర్ బోర్దు వద్ద ఆందోళనలు || Oneindia Telugu

తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకలపై రెండో రోజు కూడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోర్డు కార్యదర్శి అవకతవకలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి , అటు విద్యా సంఘలు ,ఇటు విద్యార్థులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు బోర్డు నిర్వహకం పై బాలల హక్కుల సంఘం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.

విద్యార్థుల కు సంఘీబావం తెలిపేందుకు వచ్చిన నేతల అరెస్ట్

విద్యార్థుల కు సంఘీబావం తెలిపేందుకు వచ్చిన నేతల అరెస్ట్

ఇంటర్ విద్యా వ్వవస్థ తీరుపై నిరసన వ్యక్తం చేసేందుకు రాజకీయ నాయకులు సైతం విద్యార్థులకు సంఘీబావం వ్యక్తం చేసేందుకు వస్తున్నారు ఈనేపథ్యంలోనే బోర్డువద్దకు చేరుకున్న నేతలను వెంటవెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రోఫెసర్ నాగేశ్వర్ ను బోర్డు వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడిన అయిదు నిమిషాల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా బోర్డు భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు.దీంతో విద్యార్థులను సైతం లోపలికి అనుమతించడం లేదు.

రేపటితో ముగియనున్న రీ వ్యాల్యుయోషన్ తేదీ.

రేపటితో ముగియనున్న రీ వ్యాల్యుయోషన్ తేదీ.

కాగా మోమోల్లో తప్పులు దోర్లిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్న విద్యార్థులు అదే సమయంలో రీ వ్యాల్యుయోషన్, కు ధరఖాస్తు చేసుకుంటున్నారు.కాగా ఇప్పటి వరకు 9000 మంది రీవ్యాల్యుయోషన్ కు ధరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. కాగ రేపటితో గడువు ముగియనుండడంతో పెద్ద ఎత్తున రీ వ్యాల్యుయెషన్ కు ధరఖాస్తు చేసుకునేందుకు క్యూలు కట్టారు. కాగా ఈ గడువు రేపటితో ముగియనుంది.

ఇంటర్ బోర్డు వ్యవహరం కోర్టుకు

ఇంటర్ బోర్డు వ్యవహరం కోర్టుకు

ఓవైపు విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా ,మరోవైపు ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఇంటర్ బోర్డు నిర్వాకం వల్ల రాష్ట్ర్రంలో మొత్తం 16 మంది మ‌ృత్యువాత పడ్డారని ఆరోపిస్తూ బాలల హక్కుల సంఘం, కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ధాఖలు చేసింది. పిటిషన్ ను స్వికరించిన కోర్టు దీనిపై విచారచేపట్టనుంది.

English summary
Inter students agitation going on second day also, at the same time children rights commission filed a pition agianst board today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X