వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షారుఖ్ సినిమాలే చూస్తా: కిషన్‌తో అక్బరుద్దీన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీల మధ్య మంగళవారం శాసనసభ ఆవరణలో పలు ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. శాసనభలో జరిగిన పరిణామాలపై కాన్ఫరెన్స్ హాలులో వీడియో పుటేజీలను పరిశీలిస్తున్న సమయంలోనే మజ్లిస్ శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మధ్యలోనే హాలు నుంచి బయటికి వచ్చారు.

కాగా, లాబీలో బిజెపి ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. అయితే వీడియో పుటేజీల అంశాన్ని కిషన్‌రెడ్డి ప్రస్తావించగా... ‘ఆ సినిమా నడుస్తుంది... నేను ఆ సినిమాలు చూడను. కేవలం షారూఖ్‌ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలే చూస్తాను' అని ఓవైసీ అనడంతో అక్కడ నవ్వులు పూసాయి.

Interesting conversation between Kishan Reddy and Akbaruddin

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా కవిత

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్ నగరంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల కార్యవర్గాలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణ చీఫ్ కమిషనర్‌గా కవిత, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఆర్కే శశిధర్ చీఫ్ కమిషనర్‌గా ఎన్నికయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మారియా లూసియా, ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా లారెన్స్ ఎన్నికయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శైలజ, సీతారామమూర్తి, శేషారెడ్డి, అరుణకుమారి, అన్నపూర్ణ, ప్రకాశ్‌రావు, ఫైనాన్స్ కమిటీ సభ్యులుగా వాసంతి, వెంకట్త్న్రం, సాజీద్, శకుంతలను ఎన్నుకున్నారు.

స్కౌట్స్ అండ్ గైడ్స్ హెడ్ క్వార్టర్స్‌కు చెందిన కెపి మిశ్రా ఎన్నికల పర్యవేక్షకులుగా వ్యవహరించారు. రిటర్నింగ్ అధికారిగా ఎ. చంద్రశేఖర్‌రావు హాజయర్యారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత విజేతలను అభినందిస్తూ జరిగిన సభలో తెలంగాణ సభ్యులను వేదికపైకి పిలువకపోవడంతో కొంత సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పొరపాటును గమనించిన ఆంధ్రప్రదేశ్ సభ్యులు.. తెలంగాణ సభ్యులను వేదికపైకి పిలిచి క్షమాపణ కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది.

English summary
Interesting conversation continued between MLA and Telangana BJP president Kishan Reddy and MIM MLA Akbaruddin Owaisi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X