హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు

తీవ్ర మనోవేదనతో శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. కేసులో తన పేరు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.నిజానికి శ్రావణ్ అనే వ్యక్తి శిరీష జీవితంలోకి రాకుండా ఉంటే ఇదంతా జరిగ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

ప్రభాకర్ మృతికి ఏసీపీనే కారణమా?: భార్య, తల్లి ఏమన్నారంటే?ప్రభాకర్ మృతికి ఏసీపీనే కారణమా?: భార్య, తల్లి ఏమన్నారంటే?

మొత్తం వ్యవహారంలో శ్రావణ్ పాత్రే కీలకమని పోలీసులు నిర్దారించినందువల్లే కేసులో అతన్ని ఏ-1గా ఉంచినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో భాగంగా.. శ్రావణ్ అసలు నైజం ఎలాంటిదో.. అతని దురాలోచనకు శిరీష ఎలా బలైందో బయటపడింది. ఒకసారి శ్రావణ్ బ్యాక్ గ్రౌండ్‌ను పరిశీలిస్తే..

శిరీష కేసు: ఎవరీ రాజీవ్? సినిమాలతో లింకేంటి.. ముందు నుంచి ఇంతేనా!శిరీష కేసు: ఎవరీ రాజీవ్? సినిమాలతో లింకేంటి.. ముందు నుంచి ఇంతేనా!

అమ్మాయిల మోజు.. నిత్యం జల్సాలు:

అమ్మాయిల మోజు.. నిత్యం జల్సాలు:

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడుకొండ్ల గ్రామానికి శ్రావణ్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తండ్రి రమేశ్ సివిల్ కాంట్రాక్టర్. తొలి నుంచి శ్రావణ్ కు అమ్మాయిలంటే మోజు ఎక్కువ. నిత్యం పార్టీలు.. రాత్రయితే చాలు అమ్మాయిలతో జల్సాలు.. అతనికి నిత్యకృత్యం. తాను అనుకున్న పని జరగడానికి ఎంతకైనా తెగిస్తాడన్న పేరు కూడా శ్రావణ్ కు ఉంది.

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో లింకు ఇలా!:

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో లింకు ఇలా!:

తొలి నుంచి పోలీస్ సర్కిల్‌తో సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు శ్రావణ్. కొత్తగా వచ్చే పోలీసులతో పరిచయాలు పెంచుకోవడం.. వారితో పనులు జరిపించుకోవడం అతనికి ముందు నుంచి అలవాటు. ఇందుక ప్రతిఫలంగా వారికి కానుకలు ఇచ్చేవాడు. చాలాసార్లు అమ్మాయిలను కూడా వారి వద్దకు పంపించేవాడని విచారణలో తేలింది.

నల్లగొండ జిల్లాకే చెందిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ప్రొబేషనరీ పీరియడ్ లో డ్యూటీ నిమిత్తం మాల్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ఇక్కడే శ్రావణ్ కు ప్రభాకర్ రెడ్డికి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

ప్రభాకర్ రెడ్డికి అమ్మాయిల సరఫరా:

ప్రభాకర్ రెడ్డికి అమ్మాయిల సరఫరా:

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కుకునూర్ పల్లికి మారిన తర్వాత కూడా శ్రావణ్ తన స్నేహాన్ని కొనసాగించాడు. మధ్యలో రెండు మూడుసార్లు కొంతమంది కాల్ గర్ల్స్ ను శ్రావణ్ ప్రభాకర్ రెడ్డి వద్దకు పంపించాడు. ఇదే విషయాన్ని పోలీసుల వాంగ్మూలంలో శ్రావణ్ అంగీకరించాడు.

శిరీష-శ్రావణ్ మధ్య పరిచయం ఇలా:

శిరీష-శ్రావణ్ మధ్య పరిచయం ఇలా:

బ్యుటీషియన్ గా పనిచేసే శిరీష.. శ్రావణ్ స్నేహితుడి వివాహానికి వచ్చింది. పెళ్లిలోనే శిరీషతో పరిచయం పెంచుకున్న శ్రావణ్.. తరుచూ ఆమెతో టచ్ లో ఉండేవాడు. ఆ తర్వాత చాలాసార్లు వారిద్దరు కలిశారు. ఈ క్రమంలో శిరీషకు తన సర్కిల్ లో పలుమార్లు మేకప్ పని ఇప్పించాడు.

రాజీవ్ కు పరిచయం చేసింది శిరీషే:

రాజీవ్ కు పరిచయం చేసింది శిరీషే:

నాలుగేళ్ల క్రితం రాజీవ్ వల్లభనేని ఆర్జే స్టూడియోలో శిరీష జాయిన్ అయింది. ఆ తర్వాత రాజీవ్ శిరీషతో సాన్నిహిత్యం పెంచుకోవడం, అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడం తెలిసిందే. ఇదే క్రమంలో.. శ్రావణ్‌ను శిరీష రాజీవ్‌కు పరిచయం చేసింది. రాజీవ్‌కు ఫొటోగ్రఫీ పని ఉన్నప్పుడల్లా శ్రావణ్‌ కూడా అతనితో పాటే వెళ్లేవాడు. రోజులో ఎక్కువ సమయం రాజీవ్ ప్లాటులోనే గడిపేవాడు. శిరీష, రాజీవ్, శ్రావణ్ ముగ్గురు కలిసి పార్టీలు చేసుకునేవారు. శిరీషతో అతనికి వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది.

పథకం ప్రకారమే:

పథకం ప్రకారమే:

కుకునూర్ పల్లికి వెళ్లడంలో శ్రావణ్ పాత్రే కీలకమని పోలీసులు నిర్దారించారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి ముందు నుంచి కాల్ గర్ల్స్ ను సరఫరా చేసే శ్రావణ్.. ఉద్దేశపూర్వకంగానే శిరీషను అతని వద్దకు తీసుకెళ్లాలనుకున్నాడు. రాజీవ్ ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్లాన్ వేశాడు.

కుకునూర్ పల్లికి చేరుకున్న తర్వాత.. శిరీష, ప్రభాకర్ రెడ్డి, శ్రావణ్ ముగ్గురు కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ క్రమంలో శిరీషతో ప్రభాకర్ రెడ్డి ఏకాంతంగా గడపాలన్న ఉద్దేశంతోనే శ్రావణ్ పదేపదే సిగరెట్ పేరుతో రాజీవ్ ను బయటకు తీసుకెళ్లాడు.

శిరీష ప్రతిఘటించడంతో సీన్ రివర్స్:

శిరీష ప్రతిఘటించడంతో సీన్ రివర్స్:


ప్రభాకర్ రెడ్డి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో శిరీష తట్టుకోలేకపోయింది. గట్టిగా ప్రతిఘటించింది. శిరీష ఎదురు తిరుగుతుందని ఊహించని శ్రావణ్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఇదంతా తెలియని రాజీవ్ శిరీషపై చేయి చేసుకున్నాడు. అక్కడి నుంచి నగరానికి తిరిగి వచ్చిన తర్వాత.. తీవ్ర మనోవేదనతో శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. కేసులో తన పేరు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.

నిజానికి శ్రావణ్ అనే వ్యక్తి శిరీష జీవితంలోకి రాకుండా ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదని, అతనో క్యారెక్టర్ లెస్ అని సీపీ మహేందర్ రెడ్డి పేర్కొనడం గమనార్హం.

English summary
These are the interesting facts about Shravan who was accused as A-1 in sirisha's suicide case. He always in lust
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X