వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ మూల్యాంకనం విషయంలో నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు .. ప్రభుత్వానికి మొట్టికాయలు

|
Google Oneindia TeluguNews

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలు సైతం కొనసాగుతున్నాయి. తప్పుల తడకలా ఉన్న ఫలితాలతో విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారు . ఇక కోర్టు సైతం ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆగ్రహం వ్యక్తం చేసి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతిఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి

మూడోరోజు ఆందోళనలకు సిద్ధమైన తల్లిదండ్రులు, విద్యార్థులు

మూడోరోజు ఆందోళనలకు సిద్ధమైన తల్లిదండ్రులు, విద్యార్థులు

ఇంటర్ ఫలితాల అవకతవకలపై మూడోరోజు ఆందోళనలకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. బోర్డు కార్యదర్శి అశోక్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విద్యార్థుల తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు జరుపుతున్నారు. విద్యార్థుల అరెస్టులు, రాజకీయ నేతల సంఘీభావం, విద్యార్థి సంఘాల నినాదాలతో ఇంటర్ బోర్డు కార్యాలయం హోరెత్తుతోంది .

ఇంటర్ బోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ విచారణ

ఇంటర్ బోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ విచారణ

మరోవైపు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారించింది. బోర్డు కార్యదర్శి అశోక్‌తో పాటు, గ్లోబరీనా సంస్థ సీఈవో రాజులను ప్రశ్నించింది. గ్లోబరీనా సంస్థ లోపాలు, బోర్డు వ్యవహరించిన తీరుపై కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈమేరకు కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.మరోవైపు ఇంటర్ బోర్డు ప్రక్షాళనకు సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు .. పరిష్కార మార్గాలతో హాజరుకావాలని ఆదేశం

ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు .. పరిష్కార మార్గాలతో హాజరుకావాలని ఆదేశం

ఇంటర్ ఫలితాల అవకతవకలపై బాలల హక్కుల కమీషన్ వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఇంటర్ మూల్యంకనం విషయంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జవాబుపత్రాల మూల్యాంకనంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమస్యను ఎలా పరిష్కరిస్తారో వచ్చే సోమవారం నాటికి స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిష్కార మార్గాలతో తమ ముందు హాజరుకావాలని విద్యాశాఖ కార్యదర్శి , ఇంటర్ బోర్డు కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

English summary
A total of 9 lakh students had appeared in the intermediate exams held in February-March. The results, announced last Thursday, led to utter chaos. Many bright students who did well in the first year failed in the second year. Most of them were shocked as they were awarded zero, one or two marks. in this reagrd the High Court has said that it appears to have been ignored in the evaluation of the answers. The High Court has directed the government to make it clear by Monday how the problem is resolved. The High Courts have ordered the Education Secretary and the Inter-Board Secretary to appear before the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X