వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం చెప్పినప్పుడే ఉద్యోగాల్లో చేరి ఉంటే బాగుండేది... సమ్మె విరమణపై కార్మికుల్లో విభేదాలు

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మె విరమణపై కార్మిక యూనియన్ల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నిర్వహించిన నేతలు ఎం సాధించారనే విమర్శలు ఇతర యూనియన్ల నుండి వెల్లువెత్తుతున్నాయి. మొత్తం ఆర్టీసీలో 11 యూనియన్లు ఉంటే... కేవలం మూడు సంఘాలే జేఏసీని ఏర్పాటు చేసుకున్నాయని కార్మిక సంఘం నేతలు చెబుతున్నారు.

 47 రోజుల సమ్మెలో ఏం సాధించాము

47 రోజుల సమ్మెలో ఏం సాధించాము

ముఖ్యంగా అశ్వత్థామ రెడ్డి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని దీంతో సమ్మె కార్మికులకు అన్యాయం జరిగిందని పలువురు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జేఏసీ కో కొన్వినర్‌గా ఉన్న హన్మంతు విమర్శించారు. 48 రోజుల సమ్మెలో జేఏసీ వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. ప్రధాన డిమాండ్ అయిన, విలీనాన్ని పక్కన పెట్టడడం కార్మికులకు పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించారు. ఇక సీఎం పెట్టిన డెడ్‌లైన్‌ అనంతరం విధుల్లో చేరిఉంటే ఇంతమంది ప్రాణాలు బలి అయ్యోవి కాదని ఆయన వ్యాఖ్యానించారు. అశ్వాత్థామ రెడ్డి సరైన సమయంలో స్పందిచక పోవడం వల్లే సమస్యలు పేరుకుపోయాయని ఇతర కార్మికులు విమర్శలు చేశారు.

రాజకీయ ప్రకటనలు చేసిన అశ్వత్థామ రెడ్డి

రాజకీయ ప్రకటనలు చేసిన అశ్వత్థామ రెడ్డి

ముఖ్యంగా జేఏసీ కన్వినర్‌గా ఉన్న అశ్వత్థామ రెడ్డి సమ్మె ప్రారంభంలో ఓ రాజకీయ నాయకుడిలా ప్రభుత్వాన్ని విమర్శలు చేశాడనే అరోపణలు ఎదుర్కోన్నాడు. ప్రభుత్వాన్ని కూలదోస్తామంటూ హెచ్చరికలు సైతం జారీ చేశాడు. సీఎం కేసీఆర్ వెలువరించిన నిర్ణయాలపై పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రకటనలు చేశారనే విమర్శలు సైతం వచ్చాయి. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యూనియన్లు ఇతర రాజకీయా పార్టీల ప్రమేయాన్ని ఎక్కువగా తీసుకోవడంతో.. సమ్మెపై ప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించదనే అభిప్రాయాలు వచ్చాయి. ఈ పరిణామాలతో సమ్మె విఫలం కావడంతో ఇతర కార్మిక సంఘాల నేతలు ప్రస్తుత పరిణామాలపై విరుచుకుపడుతున్నారు.

గతంలో ఎన్నో విజయాలు సాధించిన ఆర్టీసీ

గతంలో ఎన్నో విజయాలు సాధించిన ఆర్టీసీ

ఆర్టీసీకి సమ్మెలోకి దిగిన ప్రతిసారి విజయమే సాధించింది. అయితే గతంలో ఎప్పుడు లేనట్టుగా ప్రస్తుతం చేసిన సమ్మె పూర్తిగా విఫలం అయినట్టుగా భావించాలి. ముఖ్యంగా కార్మికుల చివరి అస్త్రంగా సమ్మెను కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు వ్యాఖ్యానించినట్టుగా ముందుగా అనేక నిరసనలు, విజ్ఝప్తులు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ప్రభుత్వం మనసును తెలుసుకుని వ్యవహరించాల్సిన అవకాశం కూడ ఉంటుంది. దీంతో కిలేరిగి వాతపెట్టాల్సిన అవశ్యకతను కార్మిక సంఘాలు ఫాలో అవుతాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రెండవ సారి ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతుంది. దీంతో ప్రభుత్వానికి మరో నాలుగు సంవత్సరాల సమయం ఉండగానే విలీనం చేస్తారా లేదా చస్తారా అనే ప్రకటనలతో సమ్మెలోకి దిగింది ... ఇక అప్పటికే సమ్మెపై వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వ వర్గాలు ఎవ్వరు కూడ ముందుకు రాని పరిస్థితి నెలకోంది. దీంతో ప్రభుత్వం అనుకున్నదే సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
Internal dispute come over RTC strike call off with in the leaders group who went on strike against the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X