వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్‌ ఫలితాలపై హైకోర్ట్ లో విచారణ..! మే 8లోపు రివాల్యూయేషన్ పూర్తి చేయాలన్న కోర్ట్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై హైకోర్టులో విచారణ ముగిసింది. విద్యార్థుల రివాల్యుయేషన్‌పై ఇంటర్‌బోర్డ్‌ కోర్టుకు తమ నిర్ణయం తెలపనుంది. దానితో పాటు చనిపోయిన విద్యార్థులకు 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ మరో పిటిషన్‌ కూడా దాఖలైంది. దీంతో ఈ రెండు పిటీషన్లను హైకోర్టు విచారించానుంది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. మే 8 నాటికి రీ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తామని ఇంటర్‌బోర్డు హైకోర్టుకు తెలిపింది. రీవెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌లో ఎంత మంది ఉత్తీర్ణులయ్యారో తెలపాలని హైకోర్టు ఇంటర్‌బోర్డును ఆదేశించింది. రీవెరిఫికేషన్‌లో ఎంత మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతారో పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకుంటామని హై కోర్టు వెల్లడించింది. విద్యార్థుల ఆత్మహత్యలు విషాదకరమని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

Investigation in HC on Inter Results.!Court orders to complete the revolutions within May8..!!

ఇంటర్ బోర్డ్ వ్యవహారం పై హైకోర్టు లో వాదనలు ముగిసాయి. ఈ సందర్బంగా హైకోర్ట్ కు కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఫెయిల్ అయిన 3 లక్షల మంది విద్యార్థులకు మళ్ళీ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు జరుపుతామని కోర్ట్ కు ఇంటర్ బోర్డ్ విన్నవించుకుంది. రీ వేరిఫికేషన్ కాకుండా రీ వాల్యుయేషన్ జరిపించాలని పిటిషనర్ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి కోర్టును కోరారు. ఇంటర్ బోర్డ్ ఫలితాల పై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను తాము చూసామని హైకోర్ట్ తెలిపింది. దీంతో రీ వెరిఫికేషన్ రీ కౌంటింగ్ ను మే 8 లోపు ముగించి పూర్తి వివరాలను హైకోర్ట్ కు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వం కు హైకోర్ట్ ఆదేశాలు జారి చేసింది. తడుపరి విచారణ మే 8 కు వాయిదా వేసింది హైకోర్ట్.

English summary
The inquiry ended in the High Court on the interference of inter-agency results. The decision to give an interview to the Interbound Court on student revolutions. Another petition has also been filed to pay Rs 50 lakh compensation to dead students. The High Court is considering these two petitions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X