వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు అక్షరంతో తలెత్తిన 'బగ్' తొలగించారు, అందుబాటులో యాపిల్ అప్‌డేటెడ్ వెర్షన్!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల ఫేస్‌బుక్‌లో చాలామందిని ఓ విచిత్రమైన సమస్య వెంటాడింది. చాలామంది తెలుగులో రాసిన పోస్టులు స్పామ్ అంటూ రిపోర్ట్ చేయబడ్డాయి. కొన్ని పాత పోస్టులు కూడా ఎగిరిపోయాయి. దీనంతటికి కారణం 'జ్ఞ' అనే అక్షరమే.

యాపిల్ ఐఓఎస్‌లో తెలుగు యూనీకోడ్‌కి చెందిన 'జ్ఞ' అనే అక్షరాన్ని రెండర్ చేసి స్క్రీన్‌పై సక్రమంగా చూపించలేక.. చాలా పోస్టులు క్రాష్ అయిపోయాయి. దీంతో అసలు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో తెలియక చాలామంది సతమతమయ్యారు.

iOS 11.2.6 Released for iPhones with Patch for 'Telugu' Character Bug

ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తెలుగు పదంతో వచ్చిన సమస్యను పరిష్కరించింది. 'జ్ఞ' అనే అక్షరం టైప్ చేసినప్పుడు అప్లికేషన్స్ క్రాష్ అయిపోతుండటంతో.. దీన్నో బగ్‌గా గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించి మెరుగైన ఐవోఎస్ 11.2.6 వెర్షన్, టీవీ ఓఎస్ 11.2.6, వాచ్ ఓఎస్ 4.2.3, మ్యాక్ ఓఎస్ 10.13.3 వెర్షన్లను యాపిల్ విడుదల చేసింది.

కాగా, ఒక్క ఫేస్ బుక్ మాత్రమే గాక , జీమెయిల్, ట్విట్టర్ సహా ప్రీ ఇన్ స్టాల్డ్ మెస్సేజింగ్ యాప్ లన్ని ఈ పదం టైప్ చేయగానే బ్లాక్ అవడం జరిగాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు యాపిల్ ఆ బగ్ తొలగించింది. యూజర్స్ కొత్త వెర్షన్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఆ బగ్ సమస్య తలెత్తదు.

English summary
Apple released the official iOS 11.2.6 update Monday for iPhones, which comes just under four weeks after Apple pushed iOS 11.2.5 to users. This latest update was released off Apple's normal release schedule to quickly patch the "Telugu" character bug that causes erratic behavior when viewed in apps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X