India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IPL 2021: టీఆర్ఎస్ యూటర్న్ -BCCIకి మంత్రి కేటీఆర్ అభ్యర్థన -Sunrisers Hyderabadకు షాక్?

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆదాయం సమకూరే క్రికెట్ టోర్నీగా పేరుపొందిన 'ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల కారణంగా గతేడాది బయటి దేశం(యూఏఈ)లో టోర్నీని నిర్వహించిన బీసీసీఐ.. ఈసారి ఐపీఎల్ 2021ని ఇండియాలోనే నిర్వహిస్తున్నప్పటికీ కేవలం ఆరు నగరాలకే మ్యాచ్ లను పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. మరోవైపు వార్నర్ గాయంపై ఆసీస్ మీడియా అనూహ్య కథనాలను రాసుకొచ్చింది..

ముఖేశ్.. దమ్ముంటే మమల్ని ఆపు -అంబానీ ఇంటికి 'బాంబు'కేసులో షాకింగ్ ట్విస్ట్ - తెరపైకి 'హింద్' సంస్థముఖేశ్.. దమ్ముంటే మమల్ని ఆపు -అంబానీ ఇంటికి 'బాంబు'కేసులో షాకింగ్ ట్విస్ట్ - తెరపైకి 'హింద్' సంస్థ

#Ktr #IPL హైదరాబాద్ లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించండి : మంత్రి కేటీఆర్
ఆరు నగరాల్లోనే ఐపీఎల్..

ఆరు నగరాల్లోనే ఐపీఎల్..

వేసవి సెలవుల్లో చిన్నా, పెద్దా తేడాల్లేకుండా దేశమంతటా ఐపీఎల్ మ్యాచ్ లను ఆనందించడం పరిపాటిగా మారగా, కరోనా విలయం తర్వాత ఎంటర్ టైన్మెంట్ కేవలం టీవీలకే పరిమితమైపోయింది. ఈ ఏడాది ఐపీఎల్ దేశలోనే జరుగుతున్నప్పటికీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో వేదికలను కుదిస్తామని ఇదివరకే చెప్పారు. గతంలో దేశంలోని 30కిపైగా స్టేడియాల్లో మ్యచ్ లు జరగ్గా, ఐపీఎల్ 2021ని మాత్రం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్ కతా నగరాలకు మాత్రమే పరిమితం చేయాలని బీసీసీఐ డిసైడైందని 'టైమ్స్' ఓ కథనాన్ని రాసింది. ఐపీఎల్ వేదికలను కుదించారన్న వార్తలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు..

 హైదరాబాద్‌లో ఐపీఎల్ పెట్టండి..

హైదరాబాద్‌లో ఐపీఎల్ పెట్టండి..

2021సీజన్ లో ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే వేదికల జాబితాలో హైదరాబాద్ సిటీ లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివాకం కీలక స్పందన తెలియజేయారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు హైదరాబాద్‌ను కూడా ఎంపిక చేయాలని బీసీసీఐ, ఐపీఎల్‌‌ ప్రతినిధులను ట్విటర్ వేదికగా కేటీఆర్ కోరారు. అంతేకాదు..

కొవిడ్ ఎఫెక్ట్ తక్కువే..

కొవిడ్ ఎఫెక్ట్ తక్కువే..

ఏ కరోనా మహమ్మారి కారణంగానైతే ఐపీఎల్ వేదికలను ఆరుకు పరిమితం చేశారో, ఆ వైరస్ ప్రభావం తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా తక్కువగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తమ దగ్గర కోవిడ్ ప్రభావం అధికంగా లేదనడానికి ఇక్కడ నమోదవుతున్న తక్కువ కేసులే నిదర్శనమన్నారు. మిగిలిన మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో కేసులు తక్కువ అని కేటీఆర్ గుర్తుచేశారు. ఐపీఎల్ మ్యాచ్ లను హైదరాబాద్ లో నిర్వహింస్తే గనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కాగా,

SRH పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్

SRH పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్

ఐపీఎల్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేయడం తెలిసిందే. తెలంగాణ క్రికెటర్లను ఐపీఎల్ లో అంటరానివాళ్లుగా చూస్తున్నారని, ప్రతిభావంతులకు సరైన ప్రాతినిధ్యం లభించడంలేదని, ఐపీఎల్ వేలంలో ఒక్క హైదరాబాద్ ఆటగాడ్ని కూడా తీసుకోలేదంటూ సన్ రైజర్స్ యాజమాన్యంపై దానం మండిపడ్డారు. స్థానిక ఆటగాళ్లు లేకుండా ఆ జట్టుకు హైదరాబాద్ పేరు దండగ అని, లోకల్ ఆటగాళ్లపై చిన్నచూపునకు నిరసనగా హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని దానం వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన వారంలోపే మంత్రి కేటీఆర్ ఐపీఎల్ ఉండాల్సిందేనని కోరడంతో టీఆర్ఎస్ పార్టీ యూటర్న్ తీసుకున్నట్లయింది. ఇదిలా ఉంటే..

ఐపీఎల్‌కు వార్నర్ దూరం?

ఐపీఎల్‌కు వార్నర్ దూరం?

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ షెడ్యూల్ త్వరలోనే వెలువడనుండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతికూలతలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఎస్ఆర్‌హెచ్ సారధి ‌డేవిడ్‌ వార్నర్‌ 14వ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియన్ మీడియా చెబుతోంది. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండో వన్డే మ్యాచులో తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి డేవిడ్ వార్నర్‌కు మరో ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని, ప్రస్తుతం అతడు మెరుగైన చికిత్స తీసుకుంటున్నాడని, వార్నర్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రత్యక శ్రద్ద తీసుకుంటోందని, ఐపీఎల్ సీజన్ లో అతను ఉంటాడా లేదా ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వచ్చాయి.

పెద్దగట్టు జాతర షురూ -4రోజులు విజయవాడ-హైదరాబాద్ హైవే మళ్లింపు -5రాష్ట్రాల భక్తులు -ఇవీ విశేషాలుపెద్దగట్టు జాతర షురూ -4రోజులు విజయవాడ-హైదరాబాద్ హైవే మళ్లింపు -5రాష్ట్రాల భక్తులు -ఇవీ విశేషాలు

English summary
Telangana Minister KT Rama Rao has urged BCCI to host some IPL games in Hyderabad, citing the low number of Covid-19 cases in the city. The Minister’s tweet has come after revealed that six cities that are in fray for the upcoming IPL. Hyderabad was not among them. earlier trs mla danam nagender threatened to stop ipl matches in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X