వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీపీ మహేశ్ భగవత్‌కు అమెరికా ‘హీరో ’ అవార్డు: ఇవాంక ప్రకటన

రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌కు ప్రతిష్టాత్మక అమెరికా పురస్కారం వరించింది. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి 13 ఏళ్లుగా కృషి చేస్తున్న రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌కు ప్రతిష్టాత్మక అమెరికా పురస్కారం వరించింది. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి 13 ఏళ్లుగా కృషి చేస్తున్న రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌.. 'ట్రాఫికింగ్‌ ఇన్‌పర్సన్‌ రిపోర్టు హీరో అవార్డు-2017'కు ఎంపికైనట్లు అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్‌సన్‌, అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్‌ తాజాగా ప్రకటించారు.

తమ జీవితాన్ని మానవఅక్రమ రవాణా నిర్మూలన కోసం అంకితం చేసిన వ్యక్తులకు అమెరికా ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటిస్తుంది. తమ, ఇతర దేశాల్లో నిరంకుశ సేవ, ఒడిదుడుకులు, ప్రమాదా లు, ముప్పులను ఎదిరించి బాధితులను విముక్తి కలిగించడం, దోషులను శిక్ష పడేలా చేసి, సమాజంలో అవగాహన కలిగించేందుకు మహేశ్‌ భగవత్‌ ఎనలేని కృషి చేశారని తెలిపారు. వందలకొద్దీ బాధితులను విముక్తి చేశారన్నారు.

IPS officer Mahesh Bhagwat hailed as 'hero' in US State Department report on combating human trafficking

మహేశ్ భగవత్.. వివిధ ప్రభుత్వ సంస్థలు, సామాజిక సంస్థలతో సమన్వయంగా పనిచేశారు. రాచకొండలో గత ఏడాది 25 వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. 25 అపార్ట్‌మెంట్లను సీజ్‌ చేసి నిందితులను అరెస్ట్‌ చేసి కటకటాలపాలు చేశారు. భువనగిరి జోన్‌లో సుమారు 350 బాలకార్మికులను విముక్తి చేశారు. దేశంలోనే ఈ అవార్డుకు ఎంపికైన రెండో వ్యక్తి మహేశ్‌ భగవత్‌.

మొదటి వ్యక్తి ఐజీ ఉమాకాంత్‌, 2010లో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. కాగా, తెలంగాణలో ప్రప్రథముడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాకు చెందిన మహేశ్‌ భగవత్‌.. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ రాచకొండ కమిషనరేట్‌కు సీపీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.

గతంలో కూడా మహేశ్‌ భగవత్‌కు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు మీకోసం కార్యక్రమానికి ఒక అవార్డు, నల్గొండ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆసరా కార్యక్రమానికి మరొక అవార్డు లభించాయి. అంతేగాక, యూనియన్‌ హోం మినిస్ట్రీ అవార్డును కూడా ఇటీవలే అందుకున్నారు.

English summary
An IPS officer from India, Mahesh Bhagwat, who serves as Rachakonda police commissioner, Telangana State has won recognition as a hero for his efforts in combating trafficking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X