• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IPS RS Praveen Kumar : హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీపై ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్షన్ ఇదే...

|

హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని ఐపీఎస్ అధికారి,సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చేది లేనిది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా విరామం లేకుండా పనిచేసినందునా మొదట కొంత విశ్రాంతి కోరుకుంటున్నానని తెలిపారు. ఆ తర్వాత తన కార్యాచరణ ఉంటుందని... సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని వెల్లడించారు.

తన 26 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎస్ ప్రస్థానంలో తాను చేయగలిగినంత చేశానని ప్రవీణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యూరోక్రాట్‌గా తాను చేసింది కేవలం 1 శాతం మాత్రమేనని... పేద ప్రజల కోసం ఇంకా చాలా చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తన చివరి శ్వాస వరకు అణగారిన వర్గాల కోసమే తన కార్యాచరణ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో కొన్ని పరిమితులు ఉంటాయని... ఎటువంటి పరిమితులు లేని విశాల ప్రపంచంలో పనిచేసేందుకే తాను పదవి నుంచి బయటకు రావాలనుకుంటున్నానని తెలిపారు.

ips praveen kumar reaction over the speculations of political entry and contesting huzurabad

తన ఇన్నేళ్ల సర్వీసులో తనతో పాటు కలిసి పనిచేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ శాఖలో హోంగార్డు నుంచి డీజీపీ వరకు,గురుకులాల్లో అటెండర్ నుంచి ప్రిన్సిపాల్ వరకూ ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. స్వేరో సంస్థ కొనసాగుతుందా అన్న ప్రశ్నకు...ఈ భూమి ఉన్నంతవరకు ఆ సంస్థ ఉంటుందన్నారు. అది ఒక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు చెందినది కాదని... తాను సీనియర్ అయినందునా సుప్రీమ్ స్వేరో అనే గౌరవం కట్టబెట్టారని అన్నారు. గురుకుల పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆ సంస్థ ఎప్పటికీ ఉంటుందన్నారు.

పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు చేసిన ఎన్‌కౌంటర్లకు ఏమైనా పశ్చాత్తాప పడుతున్నారా అన్న ప్రశ్నకు... దానికి చరిత్ర,భవిష్యత్ సమాధానం చెబుతాయన్నారు. విమర్శలకు కుంగిపోవడం,ప్రశంసలకు పొంగిపోవడం తన నైజం కాదని... పేదల కోసం మరింత గొప్పగా పనిచేసేందుకే ఐపీఎస్ పదవిని వదులుకున్నానని స్పష్టం చేశారు.

కాగా,ఆర్ఎస్ ప్రవీణ్ రాజీనామా నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆయన్ను హుజురాబాద్ అభ్యర్థిగా నిలపబోతుందన్న ప్రచారం తెర పైకి వచ్చింది. తాజాగా ప్రవీణ్ కుమార్ ఇచ్చిన స్పష్టతతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ప్రవీణ్ కుమార్ రాజీనామా లేఖలో మహనీయులు పూలే,అంబేడ్కర్,కాన్షీరాం చూపిన బాటలో పయనిస్తానని పేర్కొనడం గమనార్హం. దీన్నిబట్టి ఆయన భవిష్యత్తులో బహుజన రాజకీయాలు నిర్మించబోతున్నారన్న చర్చ జరుగుతోంది.

English summary
IPS officer and secretary of social welfare residential schools, RS Praveen Kumar has made it clear that he has no intention of contesting the Huzurabad by-election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X