హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెలుగులోకి కొత్త విషయం.. సీబీఐకి ఈడీ లేఖ: ఎన్నికలకు ముందు జగన్‌కు 'హైదరాబాద్' షాక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీకి చెందిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ షాకిచ్చింది. హైదరాబాదులోని భూమి విషయానికి సంబంధంచి సంచలన విషయాన్ని తాజాగా మరోసారి గుర్తు చేసింది. నీకిది.. నాకది కింద జగన్‌కు భారీ లబ్ధి చేకూరిందని పేర్కొంది. హిందూజా కేసులో హైదరాబాదులో 11 ఎకరాలకు పైగా భూమిని కొల్లగొట్టారని పేర్కొంది. దీనిపై ఈడీ రెండేళ్ల కిందటే సీబీఐకి లేఖ రాసిందని టీడీపీ వెలుగులోకి తెచ్చింది. మోడీ, జగన్ కుమ్మక్కు వల్లే అది బయటకు రాలేదని ఆరోపించింది. జగన్ ఆస్తుల కేసులో లోతైన దర్యాఫ్తు చేయాలని, చేశారు. సీబీఐ మెమోలో లోపాలున్నాయని పేర్కొంది.

<strong>పోటీలో కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, డికే అరుణ!: లిస్ట్‌లో రేవంత్ రెడ్డి, ఖమ్మంపై రేణుకా పట్టు</strong>పోటీలో కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, డికే అరుణ!: లిస్ట్‌లో రేవంత్ రెడ్డి, ఖమ్మంపై రేణుకా పట్టు

 క్విడ్ ప్రోకో కింద జగన్‌కు 11 ఎకరాల లబ్ధి

క్విడ్ ప్రోకో కింద జగన్‌కు 11 ఎకరాల లబ్ధి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అత్యంత విలువైన 100 ఎకరాల భూ వినియోగ మార్పిడికి అనుమతి ఇవ్వడం ద్వారా నాటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హిందూజా గ్రూప్‌కు చెందిన జీవోసీఎల్ అనుచిత లబ్ధి చేకూర్చిందని, ప్రతిగా క్విడ్‌ ప్రో కో విధానంలో జగన్‌కు 11.10 ఎకరాల భూమిని హిందూజా గ్రూప్‌ లంచంగా కట్టబెట్టిందని ఈడీ పేర్కొందని చెబుతున్నారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కేసుపై హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్ కోర్టుకు సీబీఐ సమర్పించిన మెమోలో కొన్ని వాస్తవ విరుద్ధ అంశాలున్నాయని, వాటిని సవరించి మళ్లీ మెమో దాఖలు చేయాలని రెండేళ్ల కిందటే స్పష్టం చేసిందని పేర్కొన్నారు.

 మెమో లోపాలున్నట్లు సీబీఐకి ఈడీ డైరెక్టర్ లేఖ

మెమో లోపాలున్నట్లు సీబీఐకి ఈడీ డైరెక్టర్ లేఖ

జగన్‌ కేసులను మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తున్న ఈడీ డైరెక్టర్ కర్నల్‌సింగ్‌ 2017 మే 31న సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మకు లేఖ రాశారని పేర్కొంది. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన లోపాలను ఆయన ఆ లేఖలో ప్రస్తావించారని పేర్కొంది. వైయస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ క్విడ్ ప్రో కింద ఎలా లబ్ధి పొందింది కూడా వివరించారట. జగన్ కేసులో సీబీఐ 11 ఛార్జీషీట్లు దాఖలు చేసింది. ఇందులో 5 ఛార్జీషీట్లలో జగన్ కంపెనీ కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ ప్రై.లి. క్విడ్ ప్రోకో కింద ఎలాంటి లబ్ధి పొందలేదని సీబీఐ మెమో సమర్పించింది. దీనిని తప్పుబట్టారట. కాబట్టి ఈ కేసుల్లో మరింత లోతుగా దర్యాఫ్తు చేసి సీబీఐ కోర్టుకు సవరించి మెమో సమర్పించాలని సూచించారట.

ఆ సంస్థ ఏర్పాటు వెనుక విజయసాయి రెడ్డి

ఆ సంస్థ ఏర్పాటు వెనుక విజయసాయి రెడ్డి

దీనిని ఆధారంగా చేసుకొని టీడీపీ.. వైసీపీపై విమర్శలు గుప్పిస్తోంది. సీబీఐ కనుక ఈ కేసులో చర్యలు తీసుకోకుంటే ప్రధాని మోడీతో జగన్ కుమ్మక్కు అయ్యారని చెప్పేందుకు ఆస్కారం ఉంటుందని టీడీపీ ఆరోపిస్తోంది. కాగా, క్విడ్ ప్రోకో ఎలా జరిగిందో ఆ లేఖలో ఈడీ డైరెక్టర్ సవివరంగా వివరించారట. జగన్‌కు కూకట్‌పల్లిలోని 11 ఎకరాలు కట్టబెట్టేందుకు బినామీ సంస్థలను ఉపయోగించుకున్నారని, ఆ సంస్థ ఏర్పాటు వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారని ఈడీ డైరెక్టర్ రాసిన లేఖను బట్టి అర్థమవుతోందని పేర్కొంది. ఆ సంస్థ అడ్రస్.. అలాగే బెంగళూరులోని విజయసాయిరెడ్డి నివాసం ఒకటేనట.

ఛార్జీషీట్లో అన్ని పేర్లు లేవు

ఛార్జీషీట్లో అన్ని పేర్లు లేవు

జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ 11 ఛార్జీషీట్లు దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్‌లో 73 సంస్థలు లేదా వ్యక్తుల పేర్లు ఉంటే, ఛార్జీషీట్లో మాత్రం 28 పేర్లే ఉన్నాయని ఈడీ డైరెక్టర్ పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. జగన్ కేసులను పునఃపరిశీలించాలని సీబీఐ డైరెక్టర్‌కు ఈడీ డైరెక్టర్ లేఖ రాసి రెండేళ్లవుతున్నా సీబీఐ ఎందుకు స్పందించలేదని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇందుకు జగన్, మోడీ మధ్య ఒప్పందమే కారణమని ఆరోపిస్తోంది. విజయసాయి రెడ్డి నిత్యం ప్రధాని కార్యాలయంలో ఉండేవారని, జగన్ పై ఉన్న కేసులను నీరుగార్చే ఒప్పందంలో భాగంగానే ఇవి జరుగుతున్నాయని ఈ లేఖ ద్వారా వెల్లడవుతోందని టీడీపీ అంటోంది.

English summary
Irk for YSR Congress Party chief YS Jagan Mohan Reddy. Telugu Desam drags Hyderabad 11 Acres land before Andhra Pradesh Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X