హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చూడటానికి ఇనుప రాడ్ ... లోపల బంగారం ...షాక్ అయ్యేలా ఎయిర్ పోర్ట్ లో స్మగ్లింగ్

|
Google Oneindia TeluguNews

కాదేది స్మగ్లింగ్ కు అనర్హం అని నిరూపిస్తున్నారు స్మగ్లర్లు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , స్మగ్లర్లు భద్రతా వ్యవస్థ కళ్లుగప్పి బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ముఠాలతో ఎయిర్ పోర్ట్ అధికారులు షాక్ కు గురవుతున్నారు.

వీడు మామూలు దొంగ కాదు.. బండ్ల చోరీ వయా OLXవీడు మామూలు దొంగ కాదు.. బండ్ల చోరీ వయా OLX

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్ పోర్ట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొన్నటికి మొన్న మస్కట్ నుండి ప్లేట్ల రూపంలో హైదరాబాద్‌కు తరలిస్తున్న 2.75 కిలోల బంగారంతో పాటు నిందితులను పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇక తాజాగా ఇనుప రాడ్ లో బంగారం స్మగ్లింగ్ కి పాల్పడిన స్మగ్లర్ గుట్టు రట్టు చేశారు ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు .

Iron rod inside gold ... shocking... smuggling at airport

ఇన్నాళ్లూ బట్టల్లో , బ్యాగుల్లో,మొబైళ్లలో, శరీర భాగాలలో సైతం బంగారం దాచి తెచ్చిన ముఠాల గురించి విన్నాం. ఇప్పుడు తాజాగా ఇనుప రాడ్ లో అత్యంత భద్రంగా బంగారం దాచి స్మగ్లింగ్ కు పాల్పడిన వ్యక్తి ఉదంతం ఎయిర్ పోర్ట్ అధికారులను షాక్ కు గురి చేసింది. అతని వద్ద ఉన్న రాడ్ పగలగొట్టి చూస్తే అందులో బంగారం బయటపడింది. విదేశాల నుంచీ హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుణ్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు పట్టుకున్నారు. అతని దగ్గరున్న ఇనుప రాడ్డులను పగలగొట్టి చూసిన ఎయిర్ పోర్ట్ పోలీసులకు మైండ్ బ్లాంకైంది. రాడ్ల మధ్యలో బంగారం దాచి, స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం 2 కేజీల 300 గ్రాముల బంగారాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు.

English summary
The gold smuggling took place in the checks conducted by the airport police at Shamshabad Airport. The airport police seized 2 kg 300 grams of gold that was hiding in gold in the middle of the iron rod. He also caught the accused. The case was registered by the Airport Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X