• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డిసెంబర్ 7 అమావాస్య: కేసీఆర్‌కు గ్రహాలు అనుకూలిస్తాయా.?

|

హైదరాబాద్ : దేశం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఎటు చూసినా ఎన్నికలపైనే వాడీ వేడీ చర్చ జరుగుతోంది. ఇక సాధారణ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలు సమయం ఉండగానే... అంతకంటే ముందు సెమీఫెనల్స్‌గా భావిస్తున్న ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీంతో ఆయా రాజకీయపార్టీలు తమ ప్రచారంలో వేగాన్ని పెంచాయి. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతలు మాటల యుద్దాలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో పదప్రయోగం చేస్తుండగా అంతే ధీటుగా విపక్షాలు సమాధానం ఇస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా ఎన్నికల తేదీ కేసీఆర్‌ను వెంటాడుతోంది. అంటే డిసెంబర్ 7 అనే తేదీ కేసీఆర్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది.

ఏ కార్యం మొదలు పెట్టినా ముహూర్త బలం చూసే కేసీఆర్

ఏ కార్యం మొదలు పెట్టినా ముహూర్త బలం చూసే కేసీఆర్

కేసీఆర్... ఈ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందంటే అది కేసీఆర్ వల్లే వచ్చిందనే వరకు వెళ్లింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావించినప్పుడల్లా కేసీఆర్ అనే పేరును తప్పకుండా ప్రస్తావించాల్సి వస్తుంది. అంతలా ఈ పేరు ప్రజల్లో రిజిస్టరయిపోయింది. ఇక గులాబీ బాస్ ఒక మాట మాట్లాడారంటే చాలు... ఇటు సభికుల నుంచి ఒకటే ఈలలు, ఒకటే చప్పట్లు. ఇంత అభిమానాన్ని చూరగొన్న కేసీఆర్..ఇంతటి ప్రజాదరణ కలిగిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఒక దగ్గర మాత్రం చాలా అనుకువగా మెలుగుతారు. కేసీఆర్‌ ఏ కార్యం మొదలు పెట్టినా అందుకు మంచి ముహూర్తం చూస్తారు. అంతలా ఆయన జాతకాలను, సంఖ్యాశాస్త్రాన్ని, వాస్తులను నమ్ముతారు.

కేసీఆర్‌ ఫేట్‌ను న్యూమరాలజీ డిసైడ్ చేస్తుందా..?

కేసీఆర్‌ ఫేట్‌ను న్యూమరాలజీ డిసైడ్ చేస్తుందా..?

గులాబీ బాస్ కేసీఆర్ సంఖ్యాశాస్త్రాన్ని బలంగా నమ్ముతారు. ఆయన ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా నెంబర్ గేమ్ పైనే ఆధారపడతారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు సంఖ్యాబలంతో పాటు, ముహూర్తం కూడా ఎంచుకుని కచ్చితంగా జూన్ 2,2014న మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌కు కలిసొచ్చే సంఖ్య 6. ఇదంతా కూడితే వచ్చే సంఖ్య ఆరు. ఇక గులాబీ బాస్ కాన్వాయ్ సంఖ్య కూడా ఆరే. అతని కారు నెంబర్ కూడా ఆరు. ఇక అసెంబ్లీని రద్దు చేసేందుకు కూడా కేసీఆర్ సంఖ్యాశాస్త్రాన్నే నమ్ముకున్నారు. అసెంబ్లీని రద్దు చేసేందుకు సెప్టెంబర్ 6వ తేదీనే ఎంచుకున్నారు. దీని వెనక సంఖ్యాశాస్త్రంతో పాటు జోతిష్యులు చెప్పిన గ్రహబలం కూడా ఉంది. దీన్ని బట్టే ఏ సమయంలో అసెంబ్లీ రద్దు ప్రకటన చేయాలో కూడా డిసైడ్ అయ్యింది.

డిసెంబర్ 7 అమావాస్య...మరి కేసీఆర్‌కు కలిసొస్తుందా..?

డిసెంబర్ 7 అమావాస్య...మరి కేసీఆర్‌కు కలిసొస్తుందా..?

ఇక సంఖ్యాబలాన్ని, గ్రహబలాన్ని చాలా బలంగా నమ్మే కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల తేదీ మాత్రం మింగుడుపడటం లేదనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు అమావాస్య కావడం కేసీఆర్‌కు కలిసొస్తుందో లేదో అన్న ఆందోళన ప్రగతి భవన్‌లో మొదలైనట్లు సమాచారం. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఈ తేదీపై పలు కోణాల్లో చర్చలు ఊపందుకున్నాయి. కేసీఆర్‌కు డిసెంబర్ 7 కలిసిరాదని కొన్ని వాదనలు జరుగుతుండగా... మరికొంతమంది వాటన్నిటినీ జయించగలిగే శక్తి ఒక్క గులాబీ బాస్‌కే ఉందంటూ చర్చలు జరుగుతున్నాయి.

నిండు చంద్రుడు రూపంలో కేసీఆర్ వస్తారు

నిండు చంద్రుడు రూపంలో కేసీఆర్ వస్తారు

డిసెంబర్ 7పై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై స్పందించారు టీఆర్ఎస్ నేత డాక్టర్ బూర నర్సయ్యగౌడ్. డిసెంబర్ 7 టీఆర్ఎస్‌కు శుభసూచకం కాదని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్ 7న ప్రజలు తమను ఆశీర్వదిస్తారని 11న టీఆర్ఎస్ విజయం సాధించిందన్న వార్త బయటకు వస్తుందని ఆ తర్వాత మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని బూర నర్సయ్యగౌడ్ జోస్యం చెప్పారు. అంతేకాదు చంద్రేశేఖర్ రూపంలో నిండు చంద్రుడిని ప్రజలు చూస్తారని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amavasya on polling day December 7 has come to haunt the TRS. Care taker Chief Minister K. Chandrasekhar Rao is known to believe in numerology, astrology, and Vaastu. Much as it is being spread that it would be a bad omen for the ruling party,TRS MP Boora Narsaiah Goud dismissed such talk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more