ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రమేశ్ రాథోడ్ రాక: సిట్టింగ్‌లకు టెన్షన్.. రమేశ్ చేరిక టీఆర్ఎస్ కే మేలు చేకూరుతుందా?

తెలంగాణలో పాత ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో పాత ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ ఈ నెల 29న గులాబీ కండువా కప్పుకోవాలని తహతహాలాడుతుండటంతో పచ్చ జెండా ముందుకు తీసుకెళ్లే వారి సంగతేమోగానీ ప్రస్తుతం అధికార టీఆర్ఎస్‌లో గెడం నగేశ్, ఎమ్మెల్యేలు బాపురావు, కోవలక్ష్మి, రేఖానాయక్ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రమేశ్‌రాథోడ్‌ను అడ్జెస్ట్‌ చేయడం కోసం తమకు చెక్‌ పెడతారన్న భావన వారిలో ఏర్పడిందని మాటలు వినిపిస్తున్నాయి. 2009లో ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందిన రమేశ్ రాథోడ్ తనతోపాటు 2014లో ఆయన తనయుడు రితేశ్ రాథోడ్ ఓటమి పాలయ్యారు. కానీ ఇప్పుడు రమేశ్ రాథోడ్ టీఆర్ఎస్‌లో చేరితే ఎంపి నగేశ్, ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరిని అడ్జస్ట్ చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రత్యేకించి రమేశ్‌రాథోడ్‌ సొంత అసెంబ్లీ నియోజకవర్గం ఖానాపూర్‌ నుంచి రమేశ్ రాథోడ్ తనయుడు రితేశ్ రాథోడ్‌పై గెలుపొందిన టీఆర్‌ఎస్‌ నేత రేఖానాయక్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాథోడ్‌ కుటుంబంతో ఎమ్మెల్యే రేఖానాయక్‌కు విభేదాలు ఉన్నాయి.. ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి. రాథోడ్‌కు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలనుకుంటే ఆయన కచ్చితంగా ఖానాపూర్‌నే కోరుకుంటారు. ఇది రేఖానాయక్‌కు అంత తేలిగ్గా మింగుడుపడే అంశం కాదని విశ్లేషకులు చెప్తున్నారు.

ఎమ్మెల్యేల్లో ఒకరికి చాన్స్ అనుమానమే

ఎమ్మెల్యేల్లో ఒకరికి చాన్స్ అనుమానమే

ఒకవేళ ఆదిలాబాద్‌ ఎంపీ నగేశ్ బోధ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైతే తప్ప ఎంపీ టికెట్‌ రమేశ్‌ రాథోడ్‌కు దక్కే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. నిజంగా అలాగే జరిగితే మాత్రం బోధ్‌ ఎమ్మెల్యే బాపూరావుకు గడ్డుకాలం వచ్చినట్టే! ఒకవేళ బోధ్‌ టికెట్‌ బాపురావుకే ఇస్తే రాథోడ్‌కు ఆసిఫాబాద్‌ను కేటాయించే ఛాన్స్‌ ఉంది.. ఇదే జరిగితే ఆసిఫాబాద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మి స్థానానికి ఎసరు వస్తుంది.. నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న జ‌రిగి ఉట్నూరు కేంద్రంగా మరో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఏర్పడితే త‌ప్ప గిరిజన ఎమ్మెల్యేల ఆందోళనకు తెరపడే అవకాశాలు కనిపించడం లేదు.

ప్రస్తుత ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఇలా

ప్రస్తుత ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఇలా

అంతేకాదు ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో కొందరి పట్ల సీఎం కేసీఆఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న ముగ్గురు గిరిజన ఎమ్మెల్యేలలో ఇద్దరిని పక్కన పెట్టే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మార్చుకోవడం లేదని.. వారి తీరుతో పార్టీ బలహీనపడుతోందని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారట! ఇప్పటి నుంచైనా ఎమ్మెల్యేలు తమ వైఖరి మార్చుకుని పార్టీ అధి నాయకత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేస్తేనే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వారికి బీ ఫామ్ లభించే అవకాశాలు ఉన్నాయి. అలా కాకపోయినా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి చోటు కల్పిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

రమేశ్ ‘కారెక్కే'ందుకు ముహూర్తం ఖరారు

రమేశ్ ‘కారెక్కే'ందుకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరో కుదుపునకు గురి కానున్నదని తేలిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పార్టీకి అండగా ఉన్న కీలక నేత రమేశ్‌రాథోడ్‌ సోమవారం కారెక్కేందుకు ముహూర్తం కూడా ఖరారయ్యింది. ఆ రోజున జిల్లా వ్యాప్తంగా ఉన్న క్యాడర్‌తో కలిసి ఆయన గులాబీకండువా వేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. రమేశ్‌రాథోడ్‌తో పాటు ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే సుమన్‌ రాథోడ్, ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆయన కుమారుడు రితేశ్‌ రాథోడ్‌లతోపాటు ఆదిలాబాద్, కుమ్రంభీమ్, నిర్మల్‌ జిల్లాల్లోని టీడీపీ ముఖ్య నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆ పార్టీకి గడ్డుకాలం వచ్చినట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లో చేరిన కీలక నేతలు

ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లో చేరిన కీలక నేతలు

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట ఆదిలాబాద్ జిల్లా. ప్రస్తుత ఎంపి గెడం నగేశ్ 1994 నుంచి బోధ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక రాయబారి సముద్రాల వేణుగోపాల చారి.. నాడు చంద్రబాబు నాయుడకు అత్యంత సన్నిహితుడు మరి. 2004 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ జిల్లాలో క్రియాశీల పాత్ర పోషించింది. 2009 తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న వేళ క్రమంగా నాయకులంతా తెలుగుదేశం పార్టీని వీడడం ప్రారంభించారు. అలా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యూఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి హోదాలో పనిచేస్తున్న సముద్రాల వేణుగోపాల చారి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ ఎంపీ నగేశ్‌ వంటి నేతలు తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీఆర్‌ఎస్‌లో చేరారు. నాటి నుంచి జిల్లాలో రమేశ్‌రాథోడ్‌ ఒక్కడే పార్టీని నడిపిస్తూ వస్తున్నారు.

కేంద్రంలో పదవులపై ఆశలు హుళక్కేనా

కేంద్రంలో పదవులపై ఆశలు హుళక్కేనా

అనూహ్యంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి రమేశ్ రాథోడ్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరబోతుండటం టీడీపీకి పెద్ద దెబ్బేనని విశ్లేషకులు, ప్రత్యర్థులు సైతం అభిప్రాయ పడ్తున్నారు. నిజానికి 2014 సాధారణ ఎన్నికలలో రమేశ్‌రాథోడ్‌ ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి, ఆయన కుమారుడు రితేశ్‌ రాథోడ్‌ ఖానాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీకి బలమైన క్యాడర్‌ ఉన్నా కూడా ఓడిపోవడం తండ్రీ కొడుకులు తట్టుకోలేకపోయారు. కానీ తెలంగాణ సెంటిమెంట్ ముందు పార్టీల పన్నాగాలు పని చేయలేదు. అలాగే ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటంతో ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది.. ఆ ప్రచారాన్ని రమేశ్‌రాథోడ్‌ ఖండిస్తూ వచ్చారు.కేంద్రంలో తమ పార్టీ భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏదో ఒక నామినేటెడ్‌ పదవి లభిస్తుందని ఆశపడ్డారు. ఓ దశలో కేంద్ర గిరిజన సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి వరించబోతున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. కారణాలు ఏమైనా నామినేటెడ్‌ పదవి దక్కలేదు. తెలంగాణలో టీడీపీ - బీజేపీ మధ్య సంబంధాలు అంతగా లేకపోవడంతో రాథోడ్‌ శిబిరంలో ఓ విధమైన నైరాశ్యం ఏర్పడిందని వినికిడి. దీంతో టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదన్న భావన ఏర్పడిందని చెప్తుంటారు.

బీజేపీ నుంచి రమేశ్‌తో రాయబారాలు

బీజేపీ నుంచి రమేశ్‌తో రాయబారాలు

ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం తెరపైకి వచ్చిందట! ఆ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో మాట్లాడినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో తెలియదు కానీ కాంగ్రెస్‌లో చేరతారన్న అంశం క్రమేణా మరుగునపడిపోయింది. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం కూడా గాలం వేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా రమేశ్‌ రాథోడ్‌ గులాబీగూటికి చేరబోతుండటం జిల్లాలోని నేతలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మరో ట్విస్టు ఏమిటంటే రమేశ్‌రాథోడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరుతారనే విషయం జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలకు తెలియదని, అంతకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని అంటున్నారు.

ఇలా టీఆర్ఎస్ లో చేరేందుకు మార్గం సుగమం

ఇలా టీఆర్ఎస్ లో చేరేందుకు మార్గం సుగమం

వారం రోజుల క్రితం రమేశ్ రాథోడ్ తన కుమారుడి వివాహ ఆహ్వానపత్రిక ఇవ్వడానికి రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నివాసానికి వెళ్లారు. అక్కడే రాజకీయ భవితవ్యంపై చర్చ జరిగిందని తెలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితులలో ఇంకా టీడీపీలోనే కొనసాగితే రాజకీయంగా చాలా నష్టపోవలసి వస్తుందని.. టీఆర్‌ఎస్‌లో చేరితే భవిష్యత్ ఉంటుందని టీడీపీలో మాజీ సహచరుడు తుమ్మల సూచించారట! అక్కడి నుంచే సీఎం కేసీఆర్‌తో సంప్రదింపులు జరపడంతో పాటు ప్రత్యేకంగా భేటి అయ్యారని తెలుస్తోంది. రమేశ్‌ రాథోడ్‌కు టీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి గట్టి భరోసా లభించిందట! ఇప్పటికిప్పుడు ఏదో ఒక నామినేటెడ్‌ పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారట! కొద్ది నెలల కిందట కేసీఆర్‌ నిర్వహించిన సర్వేలో రమేశ్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉన్న విషయం తేలిందట! అందుకే ఆదిలాబాద్ జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలకు ఇష్టం లేకపోయినా రాథోడ్‌ను పార్టీలో చేర్చుకోబోతున్నారు కేసీఆర్‌.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలో త్యాగధనులెవ్వరో

సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలో త్యాగధనులెవ్వరో

వచ్చే నెల పదో తేదీన జరిగే తమ కుమారుడి వివాహానికి సీఎం కే చంద్రశేఖర్ రావును ఆహ్వానించిన రమేశ్‌ అంతకు ముందే అంటే ఈ నెల 29ననే టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు, ఇతర నేతలంతా ఒకప్పుడు టీడీపీలో ఉన్నవారే కనుక రాజకీయ భవిష్యత్‌పై రమేశ్‌కు నమ్మకం కుదిరిందని వినికిడి. అయితే గులాబీ కండువా కప్పుకున్న రమేశ్ రాథోడ్ కోసం ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరిని త్యాగానికి పురిగొల్పాల్సిన పరిస్థితి ఆ పార్టీ నాయకత్వానిదని చెప్పుకుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న జ‌రిగి ఉట్నూరు కేంద్రంగా మరో గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గం ఏర్పడితే త‌ప్ప గిరిజన ఎమ్మెల్యేల ఆందోళనకు తెరపడే అవకాశాలు కనిపించడం లేదు.తాజా పరిణామాలతో రమేశ్‌ క్యాడర్‌లో ఓ విధమైన ఉత్సాహం ఏర్పడింది.. మరి రాథోడ్‌ చేరికతో జిల్లాలో టీఆర్‌ఎస్‌కు నిజంగానే ప్రయోజనం చేకూరుతుందా? లేక గ్రూపు రాజకీయాలు అధికమవుతాయా? అన్నది కాలమే తెలపాలి.

English summary
Adilabad ex MP Ramesh Rathod will join TRS on Monday while with in the TRS leaders partcularly MLA's has desent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X