వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తహసీల్దారా..? అడ్డ గాడిదా..? వ్రుద్ద దంప‌తుల‌తో బిక్షమెత్తించిన వైనం..!!

|
Google Oneindia TeluguNews

భూపాల ప‌ల్లి/ హైద‌రాబాద్ : వారిది క్రిష్ణా రామా అనుకుంటూ మ‌న‌వ‌ళ్ల‌తో కాల‌క్షేపం చేసే వ‌య‌సు. ఐన వాళ్లను ,బందుబ‌ల‌గాన్ని చూసి త్రుప్తిగా ఆనందించాల్సిన వ‌య‌సు. కాని వారి వ‌య‌సుకు కూడా గౌర‌వం ఇవ్వకుండా ఓ క‌క్కుర్తి అదికారి వారు బిచ్చ‌మెత్తుకోవ‌డానికి కార‌ణం అయ్యాడు. విష‌యం తెలుసుకున్న స్థానికులు అన్నం తింటున్నాడా బియ్యం తింటున్నాడా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. తహసీల్దారుకు లంచం ఇచ్చేందుకు సాయం చేయాలంటూ ఇద్దరు వృద్ధ దంపతులు బిచ్చమెత్తిన ఘటన ఇది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌కు చెందిన మాంత బసవయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ పట్టా భూములకు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దారు లంచం అడుగుతున్నారని జిల్లా కేంద్రంలో భిక్షాటన చేశారు. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తక్షణం స్పందించి ఆర్డీవో ద్వారా సమస్య పరిష్కరించారు.

Is he officer..? or Donkey..! demanded bribe from aged couple..!!
వృద్ధ దంపతులు తమ 9 ఎకరాల భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని రెండేళ్లుగా తిరుగుతున్నారు. రెండు నెలల క్రితం తహసీల్దారు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. ఇటీవల జేసీ స్వర్ణలత తహసీల్దారును ఆదేశించినా ఫలితం లేకపోయింది. చివరగా తహసీల్దారుకు లంచం ఇస్తేనే పాసు పుస్తకం జారీ చేస్తారనే ఉద్దేశంతో భిక్షాటనకు దిగారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వారిని భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి తన కార్యాలయానికి పిలిపించి 4.10 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాన్ని జారీ చేశారు. మిగతా 5.07 ఎకరాల భూములు వివాదంలో ఉన్నందున పూర్తిగా పరిశీలించి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తామని ఆర్డీవో వెల్లడించారు.
ఇదే మాట కొద్ది రోజుల ముందుగా చెబితే వ్రుద్ద జంట‌కు బిక్షాట‌న చేసే ఖ‌ర్మ త‌న్నేద‌ని ప‌లువురు చెవులు కొరుక్కున్న‌ట్టు తెలుస్తోంది.
English summary
This is the event that two elderly couples have been seeking finacial help to give bribe for the the tehsildar officer.Jayasankar Bhupalapalli district Bhupalapalli Mandalam Mantan Basavayya, Lakshmi, an elderly couple became beggars due to the tehesildars behaviour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X