• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీడేం పంతులురా బాబూ..! భీమా డబ్బుల కోసం బేకార్ పని చేసాడు యెదవ..!!

|

పాల్వంచ/హైదరాబాద్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సక్రమమార్గంలో నడసాల్పిన ప్రభుత్వోపాధ్యాయుడే అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కడం అత్యంత హేయమైన చర్య. అంతే కాకుండా చేసే ఎదవ పనికి భార్య సహకారం కూడా తీసుకున్నాడు సన్నాసి. భార్యతో కలిసి సమీప బంధువునే హత్య చేసిన దారుణ ఉదంతమిది. బీమా సొమ్ము కోసం ఎంతో నమ్మకంగా వ్యవహరించి స్వయానా తోడల్లుడినే అంతమొందించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్‌ రాజువాల్‌, రాధా భార్యభర్తలు. రాజువాల్‌ అశ్వాపురం మండలం వెంకటాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. చాలా ఏళ్లుగా జీవిత బీమా పాలసీలు చేయిస్తూ ఏజెంట్ల నుంచి కమీషన్లు తీసుకునేవాడు. అనారోగ్యంతో బాధపడుతున్న బంధువుల తరఫున దుర్బుద్ధితో తానే ప్రీమియం చెల్లించటం మొదలుపెట్టాడు.

 బీమా సొమ్ము కోసం టీచరు ఘాతుకం..! తోడల్లుడి దారుణ హత్య..!!

బీమా సొమ్ము కోసం టీచరు ఘాతుకం..! తోడల్లుడి దారుణ హత్య..!!

పాల్వంచలోని కరకవాగుకు చెందిన నలభై ఏడేళ్ల భూక్య రాయుడు కు నీలా, బద్రి ఇద్దరు భార్యలు. రెండో భార్య బద్రి.. రాజువాల్‌ భార్యకు చెల్లెలు. చాలాకాలం క్రితం నుంచి రాయుడు రెండో భార్యతోనే ఉంటున్నాడు. గత ఏడాది అక్టోబరు 17న కరకవాగు శివారులో మేకలు మేపడానికి వెళ్లి కిన్నెరసాని కాల్వలో పడి అతడు మరణించాడు. భార్య బద్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పాల్వంచ పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

హతుని భార్యకు అనుమానం రావడంతో..! కదిలిన డొంక..!!

హతుని భార్యకు అనుమానం రావడంతో..! కదిలిన డొంక..!!

పోస్టుమార్టం రిపోర్టులో అతిగా మద్యం తాగి నీటిలో పడి మరణించినట్టు తేలింది. దీంతో కేసు మూసేశారు. తర్వాత పలు కంపెనీలకు చెందిన ఏజెంట్లు బీమా పరిహారం చెల్లించేందుకు, నామినీ వివరాలను సేకరించేందుకు విచారణకు వచ్చారు. రెండో భార్యపై 17 పాలసీలు ఉండటంతో ఏజెంట్లు ఆమె వద్దకు వెళ్లారు. ఆ పాలసీల్లో వచ్చిన మొత్తాల్లో కొంత ఆమెకు అప్పగించి మిగిలినదంతా రాజువాల్‌, ఏజెంట్లు పంచుకున్నారు. ఇంకా కొన్ని పాలసీలకు సంబంధించి సొమ్ము రావాల్సి ఉంది.

 ముందే జీవిత పాలసీలు కట్టి ఆపై కిరాతకం..! దీనమ్మా పంతులూ...!!

ముందే జీవిత పాలసీలు కట్టి ఆపై కిరాతకం..! దీనమ్మా పంతులూ...!!

రాయుడు మొదటి భార్యపై కూడా మూడు పాలసీలు ఉండటంతో రెండు నెలల క్రితం ఏజెంట్లు ఆమె వద్దకు వెళ్లారు. వరసగా అంతమంది ఏజెంట్లు రావడంతో ఆమెకు అనుమానం వచ్చింది. పోలీసుల వద్ద తన అనుమానం వ్యక్తపరిచింది. దీంతో వారు కేసును తిరగదోడారు. రాయుడి ఇద్దరు భార్యలను విచారించారు. ఆ పాలసీలు ఎవరు కట్టారు? ఎలా కట్టారు? ఇలా అన్ని కోణాల్లో విచారణ చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తోడల్లుడు పేరుమీద ఉన్న 1.35 కోట్ల రూపాయల బీమా పరిహారం సొమ్ముపై కన్నేసి భార్యాభర్తలు రాజువాల్‌, రాధ పథకం ప్రకారం అతణ్ని హతమార్చారని నిర్ధారణకు వచ్చారు.

 నేరం చేసి దొరక్కుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు..! చిన్న పొరపాటుతో చిక్కిపోతారు..!!

నేరం చేసి దొరక్కుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు..! చిన్న పొరపాటుతో చిక్కిపోతారు..!!

రాయుడు మద్యానికి బానిసవడంతో రాజువాల్‌ సులభంగా పనవుతుందనుకున్నాడు. బాగా మద్యం తాగించి కాల్వలో తోసేయడంతో నీటిలో పడి మృతిచెందినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ నేరంలో రాజువాల్‌కు సహకరించిన భార్య రాధ, జూలూరుపాడు మండలానికి చెందిన వడ్డే వెంకటకృష్ణ (ఆటో డ్రైవర్‌), సమీప బంధువు బోడా కృష్ణ, ఓ మైనర్‌ను అరెస్ట్‌ చేసినట్లు పాల్వంచ డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ మడత రమేశ్‌ వివరించారు.

English summary
Bhadradri kothagudem district of Jaluruppudu, Banoth Rajuval and Radha's wife. Rajuval Ashwapuram Mandalam is a government teacher. What is the worst murder of a close relative with his wife? He was very confident about the amount of insurance and ending his own business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X