వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది బ‌స్సా..? దోమ‌ల మందు పొగా..? వాయు కాలుష్యంతో వామ్మో అనిపిస్తున్న న‌గ‌ర బ‌స్సులు...!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబ‌ద్ : న‌గ‌రంలో ఎటు చూసినా వాహనాలు, వాటి నుంచి వచ్చే పొగ ఘాటుకు ఊపిరాడక ఇబ్బందులు, రోడ్డు పక్కన నడుచు కుంటూ వెళ్తున్నా గుప్పుమని పొగ మొఖంపై కొట్టినట్లు పడు తుంది. నగరంలో రోజురోజుకూ జనాభాకు మించి వాహనాలు రోడ్లపై కనిపిస్తుంటాయి. కనీసం రోడ్డు దాటేందుకు కూడా కష్టంగా ఉంటుంది. నగరంలో ఏ ప్రాంతంలో ఎక్కడ చూసినా వాహనాల గజిబిజి కనబడుతుంది. ఆ వాహనాల వెనుకే పొగ ముప్పు పొంచి ఉంటుంది. దీంతో వెనుకనున్న వాహనాదారులు ముక్కు మూసుకోవాల్సిందే. ట్రాఫిక్‌ సిగల్స్‌ వద్ద ఇక చెప్పనవసం లేదు. ఇది కేవలం ద్విచక్ర వాహనాలు, ఆటోరిక్షాలు, కార్లు మాత్రమే అనుకుంటే పొరపాటే. న‌గ‌రంలో ఉన్న వాహ‌నాల నుండి వ‌చ్చే పొగ ఒక ఎత్తైతే కేవలం ఆర్టీసీ బ‌స్సుల నుండి వ‌చ్చే పొగ మ‌రో ఎత్తు. నియంత్ర‌ణ లేని ఆర్టీసి బ‌స్సులు వెద‌జ‌ల్లు తున్న కాలుష్యంపై న‌గ‌ర వాసులు పెద్ద యెత్తుల ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

నియంత్ర‌ణ లేని ఆర్టీసి బ‌స్సులు..! కాలుష్యంతో స్వైర‌విహారం..!!

నియంత్ర‌ణ లేని ఆర్టీసి బ‌స్సులు..! కాలుష్యంతో స్వైర‌విహారం..!!

రాజధాని హైదరాబాద్ నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ఇబ్బడిముబ్బడిగా వాహనా లు పెరిగిపోవడం, కాలం చెల్లిన వాహనాలు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన గణంకాలు కాలుష్య తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. తాజా పరిణామాలపై పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాహనాల వినియోగంలో నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని సుప్రీంకోర్టు సైతం గతంలో సూచనలు చేసింది. మేలైన ప్రజారవాణా, సిఎన్‌జి,ఎల్‌పిజి వంటి సహజ ఇంధనాలను ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకూ సూచించింది. కాని విశ్వ‌న‌గ‌రం వైపు ప‌రుగులు తీస్తున్నా కాలుష్య స‌మ‌స్య మాత్రం రోజు రోజుకూ పెరిగిపోంతోంది.

పేరుకే విశ్వ‌న‌గ‌రం...! కార్యాచ‌ర‌ణ మాత్రం సున్నా..!!

పేరుకే విశ్వ‌న‌గ‌రం...! కార్యాచ‌ర‌ణ మాత్రం సున్నా..!!

ప్ర‌ధానంగా ఆర్టీసీ బస్సులు బుస్సుమని పొగచిమ్ముతున్నాయి. వీటి మధ్యనే ప్రయాణికులు, వాహనాదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తోంది. శ్వాస కోశ, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. దీనిపై నిఘా పెట్టాల్సిన కాలుష్య నియంత్రణ ఆధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ట్రాఫిక్‌ పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఎంత సేపు ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ, చలాన్‌ వేయడం తప్ప పట్టించుకున్న నాథుడు లేడు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనదారు లకు కౌన్సిలింగ్‌ నిర్వహించి అవగాహన కల్పించాలని పలు వురు వాపోతున్నారు. ఆ తర్వాత చలాన్లు రాసి కాలుష్యం నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

చోద్యం చూస్తున్న కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి..! త‌నిఖీలు నామ‌మాత్ర‌మే..!

చోద్యం చూస్తున్న కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి..! త‌నిఖీలు నామ‌మాత్ర‌మే..!

పాతబస్తీలోని గోషామహాల్‌, బేగం బజార్‌, అఫ్జల్‌గంజ్‌, ఎంజిబిఎస్‌, చార్మినార్‌, బహదూర్‌పురా, మీర్‌ చౌక్‌, ఫలక్‌నుమా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని రహదారుల గుండా ప్రతిరోజ వేలకొద్ది వాహనా లు రాకపోకలు సాగిస్తున్నాయి. అంతే కాకుండా ఖైర‌తాబాద్, పంజాగుట్ట‌, అమీర్ పేట‌, ఎర్ర‌గ‌డ్డ‌, కూక‌ట్ ప‌ల్లి ప్రాంత్త‌ల్లో కాలం చెల్లిన వాహ‌నాలు రోడ్డు మీద షికారు చేస్తూ ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చెల‌గాటం ఆడుతుంటాయి. ఆ వాహనాల్లో చాలా వాటికి సకాలం లో మరమ్మతులు చేయించకపోవడంతో అధిక పొగను వెదజల్లు తాయి. దానికోసం రహదారులపై పొల్యూషన్‌ వాహనాలు తనిఖీ చేసి కాలుష్య నియంత్రణ ధృవపత్రం (పియూసి) ఇస్తారు. అందులో వాహన కాలుష్యం ఎంతమేర కు ఉందో తెలుస్తోంది. పియూసి ఆరు నెలలకు ఒకసారి చేయించుకో వాల్సి ఉంటుంది. పియుసి సర్టిఫికెట్లను ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీ చేసి కాలుష్య ప్రమాణాలు పాటించని వాహనాలపై ఫైన్‌ వేయాలి. కాని అలాంటి సంద‌ర్బాలు మ‌న విశ్వ‌న‌గ‌రంలో చాలా అరుదుగా క‌నిపిస్తుంటాయి.

ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చెల‌గాటం ఎన్నాళ్లు..! ప్ర‌భుత్వం యంత్రాంగం కొర‌డా ఝుళిపించాలి..!!

ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చెల‌గాటం ఎన్నాళ్లు..! ప్ర‌భుత్వం యంత్రాంగం కొర‌డా ఝుళిపించాలి..!!

వాహనాల తనిఖీల్లో పోలీసులు మొదట ఆర్‌సి, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్య్సూరెన్స్‌ తనిఖీ చేసిన అనంతరం పొల్యూషన్‌ సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారు. రోడ్లపై, పెట్రోల్‌ బంకుల్లోని కాలుష్య నియంత్రణ యంత్రాలపై సంబంధిత అధికారుల నియంత్రణ లేకపోవడంతో వారు ఏ వాహనాని కైనా ఇష్టారాజ్యంగా పియుసి ఇస్తారు. విపరీతంగా కాలుష్యం వెదజల్లే ఆటోలు, ఆర్టీసీ బ‌స్సులు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దీంతో ట్రాఫిక్‌ పోలీసుల దృష్టిలో పియుసి సర్టిఫికెట్‌కు అర్థమే మారిపో యింది. అది చలాన్లకే పరిమితం అవుతోంది. కాని పొల్యూ షన్‌ సర్టిఫికెట్లపై అంత ఆసక్తి చూపకపోవటం ఇందుకు నిద ర్శనం. దక్షిణ, ప‌శ్చిమ‌, తూర్పు మండలాల్లోని ట్రాఫిక్‌ పోలీసులు కాలుష్యం వెదజల్లుతున్న వాహనదారులను గుర్తించి వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించి ఆ తర్వాత చలాన్లు రాయాలని పలువురు వాహనాదారులు కోరుతున్నారు.

English summary
If the smoke from the vehicles in the city is exhausted, the smoke from the RTC buses is another phase. The city residents are expressing concern over the pollution caused by uncontrolled RTC buses.The pollution problem is rising day by day even we are moving towards world city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X