హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో ఎంపీ కవిత భేటీ! భారతికి ఆహ్వానం: ఆసక్తికర చర్చ, గవర్నర్‌తో కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

హైదరాబాదులోని జగన్ నివాసం లోటస్ పాండుకు ఆమె వెళ్లారని అంటున్నారు. జగన్, కవితల భేటీని ఇటు వైసిపి, అటు టిఆర్ఎస్ రహస్యంగా ఉంచాయని కూడా చెబుతున్నారు. కవిత, జగన్‌లు భేటీ అయ్యారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

Is Kavitha welcomes YS Jagan's wife?

అయితే, కల్వకుంట్ల కవిత... జగన్‌ను కలుసుకోవడంలో రాజకీయ ప్రాధాన్యత లేదని కూడా అంటున్నారు. జగన్ సతీమణి భారతిని బతుకమ్మ సంబరాలకు ఆహ్వానించేందుకు ఆమె వైసిపి అధినేతను కలిశారని అంటున్నారు.

కవిత, జగన్‌ల భేటీ నిజమేనా అనేది తెలియాల్సి ఉంది. అయితే, భేటీ నిజమైతే మాత్రం అది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చనే అని చెప్పవచ్చు. భారతిని బతుకమ్మ వేడుకలను ఆహ్వానించేందుకు వచ్చినా అది చర్చకు దారి తీస్తుందని అంటున్నారు.

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం సాయంత్రం భేటీ అయ్యారు.

English summary
It is said that, Nizamabad MP Kalvakuntla Kavitha met YSRCP chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X