India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర రైతులు చనిపోతే పట్టించుకోని కేసీఆర్ పంజాబ్ రైతులకు నష్టపరిహారమా?సీఎం పై మండిపడ్డ డీకే అరుణ.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బీజేపి,టీఆర్ఎస్ నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకూ బీజేపి జాతీయ నాయకులు జేపీ నడ్డా, తరుణ్ చుగ్, అమీత్ షా లను టార్గెట్ చేస్తూ మంత్రులు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. సుధీర్ఘ విరామం తర్వాత ప్రగతి భవన్ లో అధికారిక కార్యక్రమాలను సమీక్షించిన తర్వాత సీఎం చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాలపై బీజేపి నేతలు మండిపడుతున్నారు. గ్రామ పంచాయితీలకు కేంద్రం నేరుగా నిధులు మంజూరు చేయడం చిల్లర పంచాయితీ ఎలా అవుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు.

 పల్లెలకు నేరుగా నిధులు ఇస్తున్నాం.. చిల్లర పంచాయితీ ఎట్లయితదో సీఎం చెప్పాలన్న డీకే అరుణ

పల్లెలకు నేరుగా నిధులు ఇస్తున్నాం.. చిల్లర పంచాయితీ ఎట్లయితదో సీఎం చెప్పాలన్న డీకే అరుణ


తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో భాగం కాదన్న రీతిలో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీరును బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎండగట్టారు. గురువారం మధ్యాహ్నం డీకే అరుణ స్పందిస్తూ, కేంద్రం పల్లెలకు నేరుగా నిధులు ఇచ్చే విషయాన్ని చిల్లర వ్యవహారం అని ముఖ్యమంత్రి అనడం దేనికి సంకేతం అని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తే మన రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని భావిస్తున్నారా అని అనుమానం వస్తుందని డీకే అరుణ పేర్కొన్నారు.

 స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసారు.. సీఎంపై మండిపడ్డ డీకే అరుణ

స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసారు.. సీఎంపై మండిపడ్డ డీకే అరుణ


స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అధికారాలు లేకుండా చేసిన నియంత సీఎం చంద్రశేఖర్ రావు, కేంద్రం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దొంగనే, దొంగా దొంగా అనట్లు ఉందని డీకే అరుణ విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సమస్యలు తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వస్తున్నాయో తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పాలని డీకే అరుణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రామీణ ఉపాధి హామీ నిధులతో, మీరు గ్రామాలలో వేసే రోడ్లు కూడా కనీసం స్థానిక ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా, తీర్మానాలు లేకుండానే మీ పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికి కట్టబెడుతున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు.

కోని సీఎం.. పంజాబ్ రైతుకుటుంబాలకు నష్టపరిహారమా.?నిలదీసిన ఫైర్ బ్రాండ్

కోని సీఎం.. పంజాబ్ రైతుకుటుంబాలకు నష్టపరిహారమా.?నిలదీసిన ఫైర్ బ్రాండ్


అంతే కాకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతు విధానాలపైనే కాకుండా పంజాబ్ పర్యటన పై డీకే అరుణ ధ్వజమెత్తారు. కన్న తల్లికి తిండి పెట్టనొడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయించినట్లు ఉంది తెలంగాణ రాష్ట్ర సీఎం చంద్రశేఖర్ రావు తీరని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేసారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ ఇవ్వడం లేదు, ఆత్మహత్యలు చేసుకున్న వారికి కనీసం పరామర్శ లేదు కానీ, పక్క రాష్ట్రంలో రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి బయలుదేరుతున్నడు అని డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 లక్ష రుణ మాఫీ చేయాలి.. డిమాండ్ చేసిన డీకే అరుణ

లక్ష రుణ మాఫీ చేయాలి.. డిమాండ్ చేసిన డీకే అరుణ


సీఎం చంద్రశేఖర్ రావు వ్యవహారశైలి కేవలం జాతీయ స్థాయిలో ప్రచారం పొందడానికే తప్ప మరొకటి కాదని, చిత్తశుద్ధి ఉంటే ముందు తెలంగాణ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన తర్వాత ఇతరులను ఆదుకోవాలని డీకే అరుణ సీఎం చంద్రశేఖర్ రావు కి హితవు పలికారు.

English summary
BJP leaders are angry over the decisions taken by CM Chandrasekhar Rao after reviewing official functions at Pragati Bhavan. BJP national vice-president DK Aruna questioned how the Center could become a dispute by allocating funds directly to gram panchayats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X