వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ దేశాన్ని ఉద్ధరించటానికి వెళ్తున్నారా? భ్రష్టు పట్టించింది టీఆర్ఎస్సే..సాధినేని యామిని ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ మహిళా అధికార ప్రతినిధి, ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని ఈసారి తెలంగాణా సీఎం కేసీఆర్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు . కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోతే పరామర్శించటానికి తీరని సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశాన్ని ఉద్దరిస్తారా అని యామిని కేసీఆర్ పై వాగ్బాణాలు సంధించారు.

కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం .. తెలంగాణలో కేసీఆర్ కు జైలు ఖాయం .. ఎమ్మెల్యే కోమటిరెడ్డి జోస్యం కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం .. తెలంగాణలో కేసీఆర్ కు జైలు ఖాయం .. ఎమ్మెల్యే కోమటిరెడ్డి జోస్యం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశాన్ని ఉద్ధరించడానికి వెళుతున్నారా అన్న సాధినేని యామిని

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశాన్ని ఉద్ధరించడానికి వెళుతున్నారా అన్న సాధినేని యామిని

ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడిన యామిని దేశంలో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీల నాయకత్వంలో రెండు కూటములు ఉన్నాయని, ఇక కేసీఆర్ మూడో కూటమి పెట్టి వెళ్తే ఆదరించేవారు ఎవరుఅని ప్రశ్నించారు యామిని . 21 ప్రాంతీయ పార్టీలను కలుపుకుని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంపై పోరాటం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రంపై చంద్రబాబు యుద్ధం ప్రకటిస్తే కేసీఆర్ కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారా అని యామిని అన్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశాన్ని ఉద్ధరించడానికి వెళుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 రెండు సార్లు ప్రధానిని నిలబెట్టిన ఘనత చంద్రబాబుది అన్న యామిని

రెండు సార్లు ప్రధానిని నిలబెట్టిన ఘనత చంద్రబాబుది అన్న యామిని

కేసీఆర్ ఓ రాజకీయ నేతగా ఎవరినైనా కలవొచ్చనీ, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన యామిని చంద్రబాబును చూసి కేసీఆర్ కూడా ఏదో చేసేద్దాం అనుకుంటున్నారని అన్నారు. . కానీ చంద్రబాబు జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలను కలుపుకునిపోతున్నారన్న యామిని గత 40 ఏళ్ల చరిత్రలో ఇలా రెండుసార్లు ప్రాంతీయ పార్టీలను కలిపి రెండు సార్లు ప్రధానిని నిలబెట్టిన ఘనత చంద్రబాబుదేనని యామిని ప్రశంసించారు. రాబోయే ఐదేళ్లు కూడా చంద్రబాబే సీఎంగా ఉంటారని జోస్యం చెప్పారు.

రాజకీయ వ్యవస్థలను భ్రష్టు పట్టించింది టీఆర్ఎస్ .. యామిని ఫైర్

రాజకీయ వ్యవస్థలను భ్రష్టు పట్టించింది టీఆర్ఎస్ .. యామిని ఫైర్

ఇక రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఎవరండీ? అన్న యామిని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది టీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. 26 మంది విద్యార్థులు చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించకుండా దేశ సమస్యలపై పోరాడుతానని చెప్పే వ్యక్తి గురించి ప్రజలే ఆలోచించుకోవాలి అని యామిని పేర్కొన్నారు .నిన్నటి దాకా జగన్ మీద విరుచుకుపడిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చక్రం తిప్పాలని చూస్తున్న తెలంగాణా సీఎం కేసీఆర్ పై తన మాటలతో దాడి చేశారు .

English summary
The Telugu Desam Party Women's spokesperson and Fire Brand Yamini this time broke with Telangana CM KCR. Telangana Chief Minister KCR is going to bring the country into the federal front . In Telangana, KCR does not have the time to visit the deceased families of inter students . but he is going to bring the country under the fedaral front she questioned .System is corrupt because of TRS party Yamini alligated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X