వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెవెన్యూ శాఖ... సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం...? ఐజీ విచక్షణాధికారాల్లో కోత...?

|
Google Oneindia TeluguNews

రెవెన్యూ శాఖకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే వీఆర్వో వ్యవస్థ రద్దు,కొత్త రెవెన్యూ చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం... తాజాగా స్టాంపు డ్యూటీ వసూళ్లకు సంబంధించి అధికారుల విచక్షణాధికారాలకు కోత పెట్టాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు 'ఇండియన్‌ స్టాంపు యాక్ట్‌-1899'కు సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అసలేంటీ ఈ చట్టం...

అసలేంటీ ఈ చట్టం...

యాక్ట్ సవరణను రాష్ట్రపతికి పంపించడానికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపించే అవకాశం ఉందన్న లీకులు వస్తున్నాయి. ఇండియన్‌ స్టాంప్‌ యాక్ట్‌-1899లోని సెక్షన్‌ 47(ఏ) ప్రకారం... భూమి విలువ బహిరంగ మార్కెట్ కంటే ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ (రిజిస్ట్రేషన్ వాల్యూ) ఎక్కువగా ఉంటే... సదరు భూ యజమాని సబ్-రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి విలువను తగ్గించమని,ఆ ప్రకారమే స్టాంప్ డ్యూటీని వసూలు చేయమని కోరవచ్చు. దరఖాస్తును పరిశీలించిన పిదప సబ్ రిజిస్ట్రార్ దాన్ని జిల్లా రిజిస్ట్రార్(డీఆర్)కు పంపిస్తాడు. అక్కడి నుంచి అది రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీ) వద్దకు వెళ్తుంది. ఐజీకి ఉండే విచక్షణాధికారాలతో రిజిస్ట్రేషన్ వాల్యూని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవచ్చు.

డీఆర్‌ల నుంచి ఐజీలకు బదిలీ..

డీఆర్‌ల నుంచి ఐజీలకు బదిలీ..

ఐజీ ఆమోదం మేరకు ఆయన నిర్ణయించిన వాల్యూ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ స్టాంప్ డ్యూటీ వసూలు చేసి భూమిని రిజిస్టర్ చేస్తాడు. నిజానికి గతంలో ఈ అధికారం జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలకు ఉండేది. కానీ వారిపై పని ఒత్తిడి అధికమవుతుండటంతో ఆ బాధ్యతలను జిల్లా రిజిస్ట్రార్లకు(డీఆర్) బదిలీ చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో డీఆర్‌లు సబ్ రిజిస్ట్రార్లు కుమ్మక్కై మార్కెట్ వాల్యూని భారీగా తగ్గించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారన్న విమర్శలున్నాయి. మియాపూర్ భూకుంభకోణంలోనూ ఇదే అంశం బయటపడింది. దీంతో ప్రభుత్వం ఆ అధికారాలను ఐజీలకు దఖలు పరిచింది.

Recommended Video

Telangana లో Women Commission ఏర్పాటు కోసం రోడ్డెక్కిన TTDP మహిళలు..
బిల్లు పెట్టే ఛాన్స్...?

బిల్లు పెట్టే ఛాన్స్...?


ఐజీలకు అప్పగించిన అధికారాలను కూడా తొలగించాలని ప్రభుత్వం ఇప్పుడు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇండియన్‌ స్టాంప్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 47(ఏ)కు సవరణ చేసిన గవర్నర్‌కు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేంద్ర పరిధిలోని చట్టం కావడంతో... ముందు శాసన సభ సమావేశాల్లో బిల్లును పెట్టి ఆమోదించే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. అయితే ఈ చట్ట సవరణను కేంద్ర హోంశాఖ పరిశీలించి ఆమోదిస్తేనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారని నిపుణులు చెబుతున్నారు.

English summary
There are some speculations that CM KCR might take a decision to cut powers of revenue IG,and wants to bring an ordinance. According to the Indian stamp act 1899 IG's has powers to reduce land registration value.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X