వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరసింహన్ ను ఒకే రాష్ట్రానికి పరిమితం చేసింది ఆయనేనా...? గవర్నర్ మార్పు వెనుక లక్ష్మణ్ హస్తం...?

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP కి ప్రత్యేక గవర్నర్ నియామకంలో కీలక పాత్ర పోషించిన BJP అద్యక్షుడు లక్ష్మణ్ || Oneindia Telugu

హైదరాబాద్ : దేశంలో బీజేపి రెండోసారి అదికారంలోకి వచ్చాక కాషాయం నేతలు దూకుడు పెంచారు. కేంద్రంలో పూర్తి మెజారిటీతో అదికారంలో రావడంతో బీజేపి స్వతంత్ర్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలస్తోంది. బీజేపి యేతర రాష్ట్రాల్లో ప్రభావం చూపేందుకు స్థానిక నేతలకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నారు బీజేపి ముఖ్యనేతలు. బీజేపి బలోపేతం అయ్యేందుకు ఎదురౌతున్న అవరోధాలను అధిరోహించడంలో స్థానికి నేతలకు సంపూర్ణ మద్దత్తు ఇస్తున్నారు నాయకులు. దక్షిణ భారత దేశంలో సత్తా చూపేంకు తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్న బీజేపి ఏపితో పాటు తెలంగాణ నేతలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటూనే, నేతలకు కీలకమైన పదవులు కట్టబెడుతోంది కేంద్ర బీజేపీ. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న నేతలను తమ పార్టలోకి తీసుకుని మొదట సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది.

 రెండోసారి అదికారంలోకి వచ్చిన బీజేపి..! రాష్ట్రాల్లో దూకుడు పెంచిన కమలం..!!

రెండోసారి అదికారంలోకి వచ్చిన బీజేపి..! రాష్ట్రాల్లో దూకుడు పెంచిన కమలం..!!

వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక నేతలను బీజేపిలో చేర్చుకుని ప్రభావం చూపాలన్నది కూడా భారతీయ జనతా మాస్టర్ ప్లాన్ గా చర్చ జరగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండడం కూడా స్థానిక బీజేపి నేతలకు అంతగా మింగుడుపడని అంశంగా పరిణమించింది.దీంతో ఆంద్ర ప్రదేశ్ కు కొత్త గవర్నర్ నియమించాలనే ప్రతిపాదన తెలంగాణ బీజేపి పార్టీ నుండి వెళ్లినట్టు, అందులో తెలంగాణ బీజేపి అద్యక్షుగు డాక్టర్ కె లక్ష్మణ్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్టాలకు ఉమ్మడి గవర్నర్ కొనసాగుతున్న నరసింహన్ ను ఒకే రాష్ట్రానికి పరిమితం చేయడంలో లక్ష్మణ్ పాత్ర ఉన్నట్టు చర్చ జరుగుతోంది.

 రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు..! కీలక పాత్ర పోషించిన లక్ష్మణ్..!!

రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు..! కీలక పాత్ర పోషించిన లక్ష్మణ్..!!

గవర్నర్ నరసింహన్ కొలువు ఎందుకు ఊడింది..? ఆయనను సాగనంపడం వెనుక తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు డా కే.లక్ష్మణ్ హస్తం ఉన్నదా...? తాజాగా జరుగుతున్న చర్చ ఇది. నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో, చైర్ పర్సన్ సోనియమ్మ నమ్మకాన్ని చూరగొని.. అత్యంత విధేయుడిగా మారి, ఏపీ గవర్నర్ పదవిలో నరసింహన్ నియమితులయ్యారు. ఆ తర్వాతి కాలంలో బలంగా పాతుకుపోయారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు, విభజన తరువాత పలువురు ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత దక్కించుకున్నారు.

 సుధీర్ఘ కాలం సేవలందించిన నరసింహన్..! తెలంగాణకు పరిమితం చేసిన బీజేపి..!!

సుధీర్ఘ కాలం సేవలందించిన నరసింహన్..! తెలంగాణకు పరిమితం చేసిన బీజేపి..!!

ప్రభుత్వం మారినా, ముఖ్యమంత్రులు మారినా కూడా... నరసింహన్ కుర్చీ మాత్రం పదిలంగానే ఉంది. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు అందరూ ఇంటికి వెళ్లినా.. నరసింహన్ ను మాత్రం కొనసాగించటమే కాదు.. మరో టర్మ్ పొడిగింపు దక్కించుకున్న ఏకైక వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. సోనియమ్మకు ఎంత విధేయుడిగా వ్యవహరించారో.. అంతకు మించిన విధేయతను మోది హయాంలో వ్యవహరించారన్న పేరుంది. ఇంటెలీజెన్స్ మాజీ బాస్ గా ఉన్న అనుభవం నరసింహన్ కు బాగా కలిసొచ్చింది. అదే ఆయనను సుదీర్ఘకాలం గవర్నర్ గా కొనసాగేలా చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు ఉండాలంటూ పలువురు ప్రముఖులు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తులు కూడా చేశారు.

 ఏ రాష్ట్రానికి ఆ గవర్నర్..! ప్రతిపాదించిన లక్ష్మణ్.. ఒప్పుకున్న కేంద్రం..!!

ఏ రాష్ట్రానికి ఆ గవర్నర్..! ప్రతిపాదించిన లక్ష్మణ్.. ఒప్పుకున్న కేంద్రం..!!

ఈ డిమాండును తెర మీదకు తెచ్చిన వారిలో అన్ని పార్టీల వారు ఉన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు ఎంతగా కోరినప్పటికీ మోదీ వినలేదు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు ఉండాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆయన అలా డిమాండ్ చేశారో లేదో... బీజేపీ అధినాయకత్వం వెంటనే స్పందించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించాలని నిర్ణయించింది. లక్ష్మణ్ మాటకు మోదీ అంత ప్రాధాన్యమిచ్చారా...? నరసింహన్ తీరుపై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు లక్ష్మణ్ ‘బ్రీఫింగ్' ఇచ్చిన తరువాతనే మార్పు జరిగిందా...? ప్రస్తుతానికి ఈ అంశాలు చర్చనీయాంశాలుగా మారాయి.

English summary
The proposal to appoint a new governor to Andhra Pradesh has gone from the Telangana BJP party, in which Telangana BJP leader Dr K Laxman seems to have played a key role. There is debate as to the role of Laxman in limiting the ongoing Narasimhan to a single state of telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X