వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టివి9 కొనుగోలు: బిజెపి కోసం మీడియా హౌజ్ ప్లాన్ చేస్తున్నారా?

టివి9.. తెలుగులో 24 గంటల వార్తా ఛానెళ్ళ దశ దిశను మార్చేసింది. తెలుగులో 24 గంటల న్యూస్ ఛానెళ్ళలో ఇప్పటికీ కూడ అగ్రస్థానంలో ఉంటుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టివి9.. తెలుగులో 24 గంటల వార్తా ఛానెళ్ళ దశ దిశను మార్చేసింది. తెలుగులో 24 గంటల న్యూస్ ఛానెళ్ళలో ఇప్పటికీ కూడ అగ్రస్థానంలో ఉంటుంది. ఎన్ని కొత్త చానెల్స్ పుట్టుకొచ్చినా కానీ, తన స్థానాన్ని కాపాడుకొంటుంది అయితే ఇలాంటి టీవి9 ఛానెల్‌ను బిజెపి ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్‌ కొనుగోలు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయమై టివి9 మాత్రం అధికారికంగా మాత్రం ఏ విషయాన్ని వెల్లడించలేదు. టివి9 విక్రయించేందుకు సన్నాహలు చేస్తున్నట్టుగా ఆ సంస్థ గతంలో ఓ మీడియా సంస్థకు వెల్లడించడం గమనార్హం.

గతంలో పలుమార్లు టివి9 విక్రయానికి ఉందంటూ ప్రచారం సాగింది. ఫలానా సంస్థ టివి9 చానెల్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం సాగేది. అయితే ఈ తరహ ప్రచారం ప్రతి ఏటా సాగుతూనే ఉండేది.

అయితే ఈ దఫా మాత్రం బిజెపి ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్‌ టివి9 చానెల్‌ను కొనుగోలు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది అయితే ఈ విషయమై మాత్రం టివి9 మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

గతంలో వచ్చిన ప్రచారం లాంటిదే ఈ ప్రచారం అనుకోవచ్చా, లేదా నిజంగానే టివి9 విక్రయాలు జరిగాయా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఏషియన్ నెట్‌వర్క్ మీడియా హౌజ్ రాజీవ్ చంద్రశేఖరన్‌కు ఉంది. సో.. టివి9 ను కొనుగోలు చేసే ఉంటారని విశ్వసించే వారు కూడ ఉన్నారు.

టివి9ను రాజీవ్ చంద్రశేఖర్ కొనుగోలు చేశారా?

టివి9ను రాజీవ్ చంద్రశేఖర్ కొనుగోలు చేశారా?

కేరళకు చెందిన బిజెపి ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ కు ఏషీయన్ నెట్‌వర్క్ మీడియా హౌజ్ ఉంది. అయితే టివి9ను రాజీవ్ చంద్రశేఖర్ కొనుగోలు చేశారనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఇదే మీడియా హౌజ్ అర్నబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవిలో కూడ పెట్టుబడులు పెట్టారనే ప్రచారం కూడ ఉంది.ఎన్‌డిటీవీలో కూడ స్పైస్‌జెట్ మేజర్ షేర్లను కొనుగోలు చేసిందనే వార్తలు కూడ ఇటీవల వచ్చాయి. అయితే ఈ వార్తలను ఎన్‌డిటివి ఖండించింది. టివి9 కొనుగోలు విషయమై మాత్రం ఆ సంస్థ అధికారికంగా స్పందించలేదు. గతంలో వచ్చిన ప్రచారం తరహలోనే ప్రస్తుతం ఈ తరహ ప్రచారం సాగుతోందా అనే చర్చ కూడ లేకపోలేదు

టివి9 ఆదాయం వందల కోట్లు

టివి9 ఆదాయం వందల కోట్లు

టివి9కు ప్రతి ఏటా వందల కోట్ల ఆదాయం వస్తోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టివి9కు తెలుగుతో పాటు కన్నడ, గుజరాత్, మహరాష్ట్రలో పలు ఛానెల్స్ ఉన్నాయి. టివి9 తెలుగు ఆదాయం 2016 మార్చికి సుమారు 76.31 కోట్లు 2017 మార్చికి 84.80 వచ్చిందని సమాచారం. నెంబర్ వన్ స్థానంలో ఉంది.కర్ణాటకలో ఉన్న టివి9 ఛానెల్ 2016 మార్చికి60.60 కోట్ల ఆదాయం వస్తోందని అంచనా వేశారు. కానీ72.40 కోట్లు వచ్చిందని సమాచారం.గుజరాత్‌లో టివి9 2016 మార్చికి23.53 కోట్ల ఆదాయం వస్తోందని అంచనావేశారు.అయితే రూ.27.30 కోట్ల ఆదాయం వచ్చిందని సమాచారం. తెలుగు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో టివి9 నెంబర్‌వన్ స్థానాల్లో ఉంది.

మహరాష్ట్రలో మూడో స్థానంలో టివి9

మహరాష్ట్రలో మూడో స్థానంలో టివి9

మహరాష్ట్రలో టివి9 2016 మార్చి నాటికి రూ.14 కోట్లు వస్తాయని అంచనా వేశారు.అయితే 2017 మార్చినాటికి 17.10 కోట్ల ఆదాయం వచ్చింది. న్యూస్9 ఛానెల్‌కు 2016 మార్చి నాటికి 10.10 కోట్లు, 2017 మార్చి నాటికి రూ.17.10 కోట్లు ఆదాయం వస్తోందని అంచనా. టివి1 కు రూ.4.02 కోట్లు 2016 మార్చి నాటికి రాగా, 2017 మార్చికి సుమారు రూ.4.80 కోట్లు వస్తోందని అంచనావేశారు.

టివి9 విక్రయానికి సానుకూలమే

టివి9 విక్రయానికి సానుకూలమే

టివి9ను విక్రయించేందుకు తాము సిద్దమేనని గతంలోనే ఈ సంస్థ ప్రధాన వాటాదారుడు శ్రీనిరాజు ప్రకటించారు. జూలైలో ఓ మీడియా సంస్థతో శ్రీనిరాజు టివి9ను విక్రయించేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు.అయితే ఎవరికీ ఈ సంస్థను విక్రయించాలనే విషయమై బయటకు వివరాలు వెల్లడించకూడదనే ఒప్పందం ఉందని ఆయన ప్రకటించినట్టుగా ఎక్సేంచ్4మీడియా ప్రకటించింది. ఈ వార్తతో టివి9 విక్రయానికి సిద్దంగా ఉందనేది వాస్తవమేననే ప్రచారాన్ని కొందరు విశ్వసిస్తున్నారు.

బిజెపి కోసం మీడియా హౌజ్ ప్లాన్ చేస్తున్నారా

బిజెపి కోసం మీడియా హౌజ్ ప్లాన్ చేస్తున్నారా

ఏషియన్ నెట్ వర్క్‌ మీడియా హౌజ్ అధినేత రాజీవ్ చంద్రశేఖర్ గతంలో స్టార్‌ టివితో కలిసి జాయింట్ వెంచర్‌ను ప్రారంభించారు. అయితే ఏషియన్ నెట్ ప్లస్, విజయ్ టివిలలో తన మెజారిటీ వాటాలను విక్రయించుకొన్నారు. అయితే స్టార్ టీవితో తన జాయింట్ వెంచర్‌ నుండి 2013లో ఏషియన్ నెట్ వర్క్ వైదొలిగింది.దేశంలోని ప్రధాన భాషల్లో బిజెపికి మద్దతుగా నిలిచే మీడియా అవసరం ఉంది. దీంతో ఆయా భాషల్లో బలంగా వేళ్లూనుకొన్న మీడియాహౌజ్‌ల్లో పెట్టుబడులు పెడితే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం కూడ లేకపోలేదు.దీంతో బిజెపి ఎంపి రాజీవ్ చంద్రశేఖర్ టివి9 ఛానెల్‌ను కొనుగోలు చేశారని ప్రచారం సాగుతోంది.అయితే ఈ విషయమై రెండు వర్గాల నుండి అధికారికంగా సమాచారం మాత్రం లేదు

English summary
There is spreading a rumour on Bjp Mp Rajeev Chandrasekhar buying majority stakes of tv9 channel.But Tv9 not yet confirmed this stakes buying rumours
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X