వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జానా రెడ్డి చెప్పిన కాంగ్రెసు బాహుబలి రేవంత్ రెడ్డేనా?

అప్పట్లో తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి గురించి చాలా ఆసక్తికరమైన చర్చ సాగింది. కాంగ్రెసు పార్టీకి బాహుబలి వస్తాడని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత కె. జానా రెడ్డి చేసిన వ్యాఖ్య చుట్టూ చర్చ సాగ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అప్పట్లో తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి గురించి చాలా ఆసక్తికరమైన చర్చ సాగింది. కాంగ్రెసు పార్టీకి బాహుబలి వస్తాడని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత కె. జానా రెడ్డి చేసిన వ్యాఖ్య చుట్టూ చర్చ సాగుతూ వచ్చింది.

కాంగ్రెసులో చాలా మంది బాహుబాలులు ఉన్నారని పార్టీ సీనియర్ నేత డికె అరుణ లాంటివాళ్లన్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 1 విడులైనప్పుడు ఆ చర్చ సాగింది.

అయితే, ప్రస్తుత తరుణంలో జానా రెడ్డి చెప్పిన బాహుబలి రేవంత్ రెడ్డే కావచ్చుననే ఆసక్తికరమైన చర్చ కూడా ప్రారంభమైంది.

జైపాల్ రెడ్డికి జానా దగ్గర....

జైపాల్ రెడ్డికి జానా దగ్గర....

రేవంత్ రెడ్డిని కాంగ్రెసులోకి తీసుకుని రావడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జానా రెడ్డి కూడా జైపాల్ రెడ్డికి సన్నిహితుడే. నిజానికి, కాస్తా చురుగ్గా వ్యవహరిస్తే తెలంగాణలో కాంగ్రెసుకు పెద్ద దిక్కు జైపాల్ రెడ్డే. పార్టీ అధిష్టానం వద్ద ఆయన మాటకు విలువ ఉంది. పార్టీలోకి రేవంత్ రెడ్డిని తీసుకుని వచ్చే విషయంలో జైపాల్ రెడ్డి జానారెడ్డితో పాటు మిగతా సీనియర్లను అంగీకరింపజేసినట్లు ప్రచారం సాగుతోంది.

అనివార్యత ఎందుకు....

అనివార్యత ఎందుకు....

రేవంత్ రెడ్డిని కాంగ్రెసులోకి ఆహ్వానించాల్సిన అనివార్యతలో ఆ పార్టీ నేతలంగా పడిపోయారు. మాట వరుసకు సీనియర్లు చాలా మంది కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వాగ్ధాటికి, వ్యూహాలకు వారెవరూ సరి తూగడం లేదు. ఆ కొరతను తీర్చే గలిగే సత్తా రేవంత్ రెడ్డికి ఉందనే భావన బలంగా ఉంది.

కెసిఆర్ వెల్‌కం వ్యూహం...

కెసిఆర్ వెల్‌కం వ్యూహం...

కెసిఆర్ వెల్‌కం వ్యూహం కూడా కాంగ్రెసు పార్టీ నేతలను పునరాలోచనలో పడేసింది. తమను సామాజిక సమీకరణాల పేరుతో దెబ్బ కొట్టడానికి ఆయన ఆ వ్యూహాన్ని ముందుకు తెచ్చారనేది వారికి స్పష్టంగానే అర్థమైనట్లు ఉంది. అందువల్లనే పార్టీలో పరస్పరం పైచేయి సాధించుకోవడానికి అంతర్గత కుమ్ములాటలో మునిగిపోవడానికి సమయం కాదని భావించి ఉంటారు. అందుకే, రేవంత్ రెడ్డి వారికి అందివచ్చిన నాయకుడని భావిస్తూ ఉండవచ్చు.

కోమటిరెడ్డి బ్రదర్స్....

కోమటిరెడ్డి బ్రదర్స్....

కోమటిరెడ్డి బ్రదర్స్ మొదటి నుంచి కూడా పిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. దీంతో వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లపై నిత్యం విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. వారిని అంగీకరించి వెనక్కి తగ్గడానికి సీనియర్లకు మనసు ఒప్పినట్లు లేదు. దీంతో వారికి ధీటైన నాయకుడు రేవంత్ రెడ్డేనని వారు భావించి ఉండవచ్చు. మొత్తం మీద, కాంగ్రెసుకు బాహుబలి దొరకడానే భావన మాత్రం ఉన్నట్లుంది.

English summary
At present conditions debate is going on that Telugu Desam Telangana working prsident Revanth Reddy might be the Bahubali of Congress party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X