వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డి రూల్స్‌ను అతిక్రమించాడా, ఏమన్నారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో నిందితుడైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి హైకోర్టు పెట్టిన బెయిల్ షరతులను ఉల్లంఘించారని తెలంగాణ న్యాయవాదల జెఎసి (టిఎజెఎసి) ఆరోపించింది. ఈ మేరకు టిఎజెఎసి నాయకులు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) స్టాండింగ్ కౌన్సెల్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఎసిబి స్టాండింగ్ కౌన్సిల్ వి రవికిరణ్ రావుకు వారు గురువారం ఆ వినతిపత్రాన్ని సమర్పించారు. మీడియాతో మాట్లాడే సమయంలో రేవంత్ రెడ్డి నోటుకు ఓటు ఏ రూపంలోనూ కేసు గురించి గానీ, ఆ కేసు ప్రగతి గురించి గానీ మాట్లాడకూడదని హైకోర్టు షరతు పెట్టిందని వారు గుర్తు చేశారు.

Is Revanth reddy violated rules?

అయితే, రేవంత్ రెడ్డి ఈ నెల 9వ తేదీన మీడియాతో మాట్లాడిన సందర్భంలో నిబంధనలను ఉల్లంఘించారని వారు ఆరోపించారు. తనపై పెట్టిన కేసు తనను ఏమీ చేయలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు వారు తెలిపారు. దానికితోడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును అవమానించారని వారు ఆరోపించారు.

షరతులను ఉల్లంఘించినందున రేవంత్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయడానికి చర్యలను ప్రారంభించాలని వారు ఎసిబి స్టాండింగ్ కౌన్సిల్‌ను కోరారు. హైకోర్టు అనుమతితో ఆయన ఇటీవల హైదరాబాదులో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

English summary
Telangana advocates JAC has urged the ACB standing counsel to initiate steps to cancel Telangana Telugu Desam party MLA, accused in cash for vote case Revanth Reddy's bail, granted by high Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X