హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఎస్‌తో సంబంధాలు: హైదరాబాద్‌లో కెన్యా యువతి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఓ యువతిని శనివారం ఇంటెలిజెన్స్, నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. టోలిచౌక్‌లో పట్టుబడ్డ ఆ యువతి కెన్యా దేశానికి చెందినదిగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు గుర్తించారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో మార్కెటింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రియాజుద్దీన్‌(మహ్మద్ సిరాజుద్దీన్)ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అమీనా ఐసిస్ సానుభూతిపరురాలని సిట్ పోలీసులు నిర్థారించారు.

కర్నాటక గుల్బర్గాకు చెందిన రియాజుద్దీన్, జైపూర్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో పనిచేస్తూ ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా యువతీ, యువకులను ఐసిస్‌లో చేర్పించే యత్నం చేస్తున్నాడు.

IS suspect Kenyan Girl under cops lens

ఉగ్రవాద భావజాలంతో కూడిన వీడియో టేపులు, సాహిత్యాన్ని ఫేస్‌బుక్ ద్వారా అందిస్తున్నాడని కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు పసిగట్టాయి. రియాజుద్దీన్ ఇచ్చిన సమాచారంతో ఆమెను అరెస్టు చేసినట్టు తెలిసింది. అమీనా(20) ఓ బాయ్ ఫ్రెండ్‌తో రెండు నెలల విడిది కోసం హైదరాబాద్‌కు రాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, పోలీసుల అదుపులోవున్న అమీనాను కేంద్రప్రభుత్వ అనుమతితో తిరిగి శనివారం రాత్రి కెన్యాకు పంపించినట్టు సమాచారం. ఇరవై ఏళ్ల యువతి అమీనా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సిట్ అధికారి ఒకరు తెలిపారు.

English summary
A young girl hailing from Kenya and living in Hyderabad, who was allegedly in touch with the arrested executive of Indian Oil Corporation, has been kept under surveillance for her suspected links with IS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X