• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ రెండు పార్టీల‌కు కూట‌మిలో కుచ్చు టోపీ త‌ప్ప‌దా..?

|

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో విప‌క్షాలు క‌లిసి న‌డిచేందుకు వినూత్న నిర్ణ‌యం తీసుకున్నారు. బ‌ల‌మైన గులాబీ పార్టీని ఓడించేందుకు భావ‌సారూప్య‌తక‌లిగిన పార్టీల‌న్నీ ఏకం కావాల‌న్న సంక‌ల్పంతో మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ్డారు. కాంగ్రెస్, తెలుగుదేశంతో పాటు తెలంగాణ జ‌న స‌మితి, సీపిఐ పార్టీలు కూడా మ‌హాకూట‌మిలో పాలుపంచుకున్నాయి. క‌థ ఇక్క‌డివర‌కూ బాగానే ఉన్నా సీట్ల స‌ర్దుబాటు కొలిక్కిరాక, విప‌క్షాలు రాజీ ప‌డ‌క కూట‌మి క‌థ‌ రోజుకో ఆస‌క్తిక‌ర మ‌లుపు తిరుగుతోంది. తాజాగా కూట‌మి నుండి జ‌న‌స‌మితి, సీపిఐ పార్టీలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయంటూ పెద్ద యెత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

తేల్చ‌ని కాంగ్రెస్..! తెలంగాణ జన సమితి, సీపీఐ నేతలు తీవ్ర అస‌హ‌నం..!!

తేల్చ‌ని కాంగ్రెస్..! తెలంగాణ జన సమితి, సీపీఐ నేతలు తీవ్ర అస‌హ‌నం..!!

తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికల్లో పొత్తులకు సిద్ధపడిన కాంగ్రెస్, ఇప్పుడు సీట్ల సర్దుబాట్లలో అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ జన సమితి, సీపీఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ సీట్లు ఉన్నాయి, అందులో హైదరాబాద్ లోక్‌సభ సీటు మినహా, మిగిలిన 16 లోక్‌సభ సీట్లలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ను తమకు కేటాయించాల‌ని కోరుతుండ‌గా, దానికి కాంగ్రెస్ సమాధానం చెప్పకుండా జాప్యం చేస్తోంద‌ని టీజేఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా కాంగ్రెస్ ఏడు సీట్లు మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పడం శోచనీయమని వారు వాపోతున్నారు.

రాజయ్యే తప్పుగా ప్రవర్తించారు: కేటీఆర్ ఎదుట తమ్ముడంటూనే కడియం చురకలు <br /> రాజయ్యే తప్పుగా ప్రవర్తించారు: కేటీఆర్ ఎదుట తమ్ముడంటూనే కడియం చురకలు

కూట‌మిలో కాంగ్రెస్ తీరు..! విప‌క్షాలు బేజారు..!!

కూట‌మిలో కాంగ్రెస్ తీరు..! విప‌క్షాలు బేజారు..!!

దీంతో తాము అన్ని స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధపడ్డామని, అయితే అలా చేస్తే ఓట్లు చీలిపోతాయంటూ తమను బుజ్జగిస్తున్నారని వారు పేర్కొన్నారు. జిల్లాల నుంచి తమపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నందున, 16 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే విజయావకాశాలు ఉంటాయని వారు అంటున్నారు. ఇదిలావుండగా మరోవైపు టీజేఎస్‌ను తమతో కలవనీయకపోతే ఆ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తుందేమోనన్న అనుమానాలూ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నాయి. దీనికితోడు సీపీఐ నేతలు కూడా కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కొలిక్కిరాని సీట్ల స‌ర్దుబాటు..! జ‌న‌స‌మితి, సీపిఐకి త‌ప్ప‌దా బంగ‌పాటు..?

కొలిక్కిరాని సీట్ల స‌ర్దుబాటు..! జ‌న‌స‌మితి, సీపిఐకి త‌ప్ప‌దా బంగ‌పాటు..?

తమకు కనీసం 9 సీట్లయినా కేటాయించకపోతే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమని బెదిరింపులకు దిగుతున్నారని సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం మలి విడత చర్చల్లో కూటమి అభ్యర్థులను, ఉమ్మడి ప్రణాళికను ప్రకటించాలని నిర్ణయించింది. అలాగే అప్పటి నుంచి ప్రచారంలో నిమగ్నం కావాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు ఇప్పటికే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో, అంతవరకు సీట్లు ఆశించి, భంగపడిన నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పంచన చేరుతున్నారు. దీంతో టిక్కెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌పై ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతోంది.

ఎవ‌రికి ఎన్ని..? మ‌రో నాలుగు రోజుల్లో తేల‌నున్న భ‌విత‌వ్యం..!!

ఎవ‌రికి ఎన్ని..? మ‌రో నాలుగు రోజుల్లో తేల‌నున్న భ‌విత‌వ్యం..!!

ఇటీవలే కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ లోకి తిరిగి రావడంతో పరకాల నుంచి పోటీ చేద్దామనుకున్న వెంకట్రామ్‌కు టిక్కెట్ దక్కదేమోనన్న సందేహం వెంటాడుతున్నదని తెలుస్తోంది. ఇదిలావుండగా 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ సీట్లలో విజయం దక్కించుకుంది. దీంతో తమకు ఆయా స్థానాలు కేటాయించాలని కోరడంతో కాంగ్రెస్‌ ఇది పెను సవాల్ గా మారిందంటున్నారు. ప్ర‌స్తుత ట్రెండ్ ను బ‌ట్టి చూస్తే టీడీపీ 22 సీట్లు కోరుతుండగా, సీపీఐ 12 సీట్లు, టీజేఎస్ 16 సీట్లు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. మ‌రి సీట్ల పంప‌కాల‌లో కాంగ్రెస్ ఎవ‌రికి ఏ మేర‌కు లాభం చేకూర్చుతుందో చూడాలి.

English summary
Congress, which is preparing for alliances in the early elections,Now the Telangana Jana Samiti, on the attitude adopted in seat adjustments, CPI leaders seem to be furious. The campaign is going on to come out of the alliance janasamithi and CPI parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X