వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీని ప్రతి దానికీ పిలవాలా !.. కేంద్రం కాళేశ్వరానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్న కేసీఆర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు || Oneindia Telugu

కేసీఆర్ కు కేంద్రానికి మధ్య గ్యాప్ పెరిగిందా ? కాళేశ్వరం వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించకపోవటం లో ఆంతర్యం అదేనా ? కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి మోడీకి ఆహ్వానం లేదు అంటే కేసీఆర్ మండిపడ్డ కారణం అదేనా ? అటు మోడీ కూడా కేసీఆర్ ను దూరంగా పెడుతున్నారా ? తెలంగాణలో బీజేపీ చక్రం తిప్పే ప్లాన్ లో ఉన్నారా ? ప్రత్యామ్నాయంగా మారాలని పావులు కదుపుతున్నారా అంటే అవును అని చెప్పాల్సి వస్తుంది.

కేసీఆర్ క్లారిటీ .. జగన్ తో దోస్తీ ... అవసరమైతే మోడీతో కుస్తీకేసీఆర్ క్లారిటీ .. జగన్ తో దోస్తీ ... అవసరమైతే మోడీతో కుస్తీ

కేసీఆర్ కు కేంద్రానికి మధ్య పెరుగుతున్న గ్యాప్ .. లోక్ సభ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్

కేసీఆర్ కు కేంద్రానికి మధ్య పెరుగుతున్న గ్యాప్ .. లోక్ సభ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్

తెలంగాణా రాష్ట్ర సీఎంగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కేంద్ర సర్కార్ తో దూరంగా ఉంటున్నట్టు తాజా పరిణామాల నేపధ్యంలో కనిపిస్తుంది. ఎన్నికల ముందు కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ద్వారా చక్రం తిప్పుతామని భావించిన కేసీఆర్ కు ఎన్నికలు షాక్ ఇచ్చాయి. దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . ఈ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లనే సంపాదించుకుంది.అయితే ఫలితాలకు ముందు కేంద్రంలో హంగ్ ఏర్పడే సూచనలు ఉన్నాయని అప్పుడు కీలక భూమిక ఫెడరల్ ఫ్రంట్ దేనని కేసీఆర్ భావించారు. కానీ అది జరగలేదు . అంతే కాక తెలంగాణా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు స్థానాలు సాధించటంతో బీజేపీ అధినాయకత్వం దృష్టి తెలంగాణాపై పడింది. దీంతో కేసీఆర్ కు కేంద్రానికి మధ్య గ్యాప్ పెరిగినట్లయింది.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే లక్ష్యంతో బీజేపీ .. అదే కేసీఆర్ ఆగ్రహానికి కారణం

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే లక్ష్యంతో బీజేపీ .. అదే కేసీఆర్ ఆగ్రహానికి కారణం

తెలంగాణా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కలలన్నీ కల్లలు అయ్యాయి. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు గాను కేవలం 9 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ నుండి, టీడీపీ నుండి, అటు అధికార పార్టీ నుండి కీలక నాయకులను బీజేపీలో చేర్చుకునే వ్యూహంలో ఉంది. అందుకోసం రంగంలోకి దిగిన రాం మాధవ్ ఇప్పటికే పలువురు ముఖ్యనేతలతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనేనని చెప్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే ప్రధాని మోడీకి కేసీఆర్ కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. దాంతో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించే ఆలోచన కూడా చేయలేదు కేసీఆర్ .

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు చిల్లిగవ్వ ఇవ్వలేదు .. ప్రతి కార్యక్రమానికి మోడీని పిలవాలా? కేసీఆర్ ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు చిల్లిగవ్వ ఇవ్వలేదు .. ప్రతి కార్యక్రమానికి మోడీని పిలవాలా? కేసీఆర్ ఫైర్

తాజా మీడియా సమావేశంలో కేసీఆర్ ప్రధాని మోడీ, అమిత్ షా లపై తనదైన శైలిలో పంచ్ లు వేశారు . కాళేశ్వరానికి మోడీని ఎందుకు పిలవలేదన్న ప్రశ్నకు కేసీఆర్ మండిపడ్డారు. ప్రతి కార్యక్రమానికి మోడీని పిలవాలా? అన్ని ప్రశ్నించిన కేసీఆర్ మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి మోడీని పిలిచాం కదా అని గుర్తు చేశారు. ఇక కాళేశ్వరం సాధకుడిని తానేనని చెప్పుకున్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని సంచలన వ్యాఖ్య చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేసీఆర్ పేర్కొన్నారు .అయినా తాను ఢిల్లీకి వెళితే ఓ స్టోరీ , వెళ్లకుంటే మరో స్టోరీ, ఇదంతా సిల్లీ వ్యక్తులు చేసే పని అంటూ తనపై వ్యతిరేక కథనాలు రాస్తున్న మీడియాపైన కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాజెక్ట్ లకు కేంద్రం పైసా సాయం చేయలేదంటూ పదేపదే చెప్పుకొచ్చిన కేసీఆర్ తద్వారా బిజెపి పట్ల ఆకర్షితులు అవుతున్న తెలంగాణ ప్రజలకు కమలం తమ ప్రాంతానికి చేసింది ఏమీలేదని తేల్చేశారు కెసిఆర్. కేంద్రంపై కొన్ని అంశాలతో ఏకీభవిస్తామని తెలంగాణ కు నష్టం అనుకుంటే విభేదిస్తామని వ్యాఖ్యానించి రాబోయే రోజుల్లో కారు టార్గెట్ ఎవరో చెప్పక చెప్పేశారు కేసీఆర్

English summary
"Do we have to invite him for everything," quipped KCR when a reporter asked why he did not invite Modi for inauguration for Kaleshwaram project. "I am doing it. Are you not happy. I am the achiever."KCR also did not agree when a reporter pointed out that he had good relations with Modi for five years."You are wrong. First year was bitter. When he snatched our mandals and power project, I said the Prime Minister is fascist," he said.Admitting that the TRS later supported NDA on issues like election of President and Vice-President, the TRS leader said the party would extend similar issue-based support.KCR also claimed that the Centre did not extend the help of an extra rupee during last five years. "NITI Aayog asked the Centre to provide Rs 24,000 crore for Mission Kakatiya and Mission Bhagiratha. They did not even give Rs 24," he said.The Chief Minister said the Centre did not provide any help for construction of Kaleshwaram project."We will request if they give we will accept and if not, we will move ahead," he said when asked if he will again approach the Centre for funds for various projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X