• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ నటితో పూర్ణిమ చాట్: ఎంత తెలివైందంటే?, 'పేరెంట్స్'ను వద్దనడం వెనుక..

|

హైదరాబాద్: తొమ్మిదో తరగతి చదివే బాలికకు తల్లిదండ్రులంటే ఎందుకంత ఏహ్యభావం?.. పైకి అరిష్టమని చెబుతున్నప్పటికీ.. అంతకుమించి బలమైన కారణాలేమైనా ఉన్నాయా?.. పూర్ణిమసాయి విషయంలో ఇప్పుడివే ప్రశ్నలు లోతైన చర్చకు దారితీశాయి. అటు పోలీసులు సైతం ఇదే అంశంపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.

అదృశ్యమైపోయిన కుమార్తె ఆచూకీ దొరకగానే సంతోషపడ్డ ఆ తల్లిదండ్రులకు అది ఎంతోసేపు నిలవలేదు. కన్న కూతురే తల్లిదండ్రుల ముఖం కూడా చూడటానికి ఇష్టపడకపోవడం చాలామందిలో ఆలోచనలో పడవేసింది. ఇదంతా బాలికలోని విపరీత ధోరణా?.. లేక నిజంగానే మరే ఇతర బలమైన కారణముందా? అన్నది ప్రస్తుతం చాలామందిలో రేకెత్తుతున్న అనుమానం.

తల్లిదండ్రుల ముఖం చూడను: పూర్ణిమ, ఎందుకంటే?, నేటి రాత్రికి నగరానికి..

అదే కారణమా?:

అదే కారణమా?:

తొలి నుంచి నటన పట్ల అమితమైన ఆసక్తి కలిగిన పూర్ణిమ సాయి.. అదే లోకంలో విహరించినట్లు తెలుస్తోంది. ఒంటరి సమయాల్లో డబ్ స్మాష్ వంటి వీడియోలతో తనలోని నటనను బయటపెట్టేది. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి మురిసిపోయేది.

చదువుకోవాల్సిన వయసులో ఆమె ఆలోచలను నటన చుట్టూ తిరగడం తల్లిదండ్రులకు నచ్చలేదు. బహుశా.. ఏ తల్లిదండ్రులైనా ఇలాగే వ్యవహరిస్తారేమో!. పూర్ణిమ తల్లిదండ్రులు కూడా ముందు చదువుపై ఫోకస్ చేయాలంటూ మందలించారు. ఆ కారణానికే వారి పట్ల ఆమె అయిష్టత పెంచుకుందా? అన్న అనుమానం కూడా తలెత్తుతోంది.

ఆ టీవి నటితో చాట్:

ఆ టీవి నటితో చాట్:

హిందీలో ప్రసారమయ్యే ఇష్క్‌బాజ్‌ అనే 'షో'కు పూర్ణిమ పెద్ద ఫ్యాన్. అందులో ప్రధాన పాత్రలో నటిస్తున్న సురభిచందన అంటే పూర్ణిమకు చెప్పలేనంత ఇష్టం. ఈ షోలో ఆమె పాత్ర పేరు 'అనికా' కావడంతో ముంబై దాదర్ లో చేరిన అనాథశ్రమంలోను పూర్ణిమ తన పేరును అనికాశ్రీ గానే పేర్కొంది.

ఆమె నటనకు ముగ్దురాలైన పూర్ణిమ.. సోషల్ మీడియా ద్వారా ఆమెతో పరిచయం పెంచుకోవడం గమనార్హం.

ఐ యామ్‌ బిగ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ యూ మామ్.., ఐ లవ్‌ యువర్‌ యాక్టింగ్.. అంటూ బాలిక సదరు నటితో చేసిన చాటింగ్ వివరాలను పోలీసులు గుర్తించారు. బాలిక మెసేజ్ లకు సురభి కూడా స్పందించి థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చినట్లు గుర్తించారు.

ఇంటి నుంచి వెళ్లేముందు.. డిలీట్ చేసి:

ఇంటి నుంచి వెళ్లేముందు.. డిలీట్ చేసి:

ఇంటి నుంచి ముంబై వెళ్లేముందు పూర్ణిమ తన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఖాతాల్ని తొలగించడం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది. దీన్నిబట్టి ఆమె ఎంత తెలివిగా పారిపోవాలనుకుందో అర్థమవుతోంది. ఎక్కడా తన గురించి క్లూ దొరక్కుండా చేసేందుకే ఆమె తన ఖాతాలను డిలీట్ చేసింది. ఇంత తెలివైన అమ్మాయి కుటుంబం పట్ల ఎందుకంత విముఖతతో ఉందన్నదే అంతుపట్టడం లేదు.

నేడు తేలనున్న భవితవ్యం:

నేడు తేలనున్న భవితవ్యం:

బుధవారం రంగారెడ్డి జిల్లా బాలికా సంరక్షణ కమిటీ(సీడబ్ల్యూసీ) ముందు పోలీసులు పూర్ణిమను హాజరుపరచనున్నారు. ఈ కమిటీ సభ్యులు బాలికకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. అప్పటికీ ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు నిరాకరిస్తే.. ఆమెను హోంలోనే ఉంచి చదివించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

అదే సమయంలో తల్లిదండ్రుల పట్ల అంత విముఖత ప్రదర్శించడానికి గల కారణాలను అన్వేషించనున్నారు. అందులో భాగంగా బాలిక కుటుంబ నేపథ్యం, పాఠశాలలో ఆమె వ్యవహార శైలి, ఇతరత్రా వివరాలను సేకరించనున్నారు.

English summary
Police are trying find is there any strong reason behind Poornima Sai refuse to go with parents?. On wednesday police take her infront CWC Rangareddy to decide her future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X