హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్‌పై ఐసిస్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర!, భయానక దాడికి..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) భారీ విధ్వంసానికి ప్లాన్ వేసింది. ఈ శనివారం నాడే పేలుళ్లకు, కాల్పులకు ప్లాన్ చేసిన ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారి టార్గెట్‌లో షాపింగ్ మాల్స్, రద్దీ ప్రాంతాలు ఉన్నాయి.

హైద్రాబాద్‌లో విధ్వంసానికి కుట్ర: ఎవరీ షఫీ? బతికే ఉన్నాడుహైద్రాబాద్‌లో విధ్వంసానికి కుట్ర: ఎవరీ షఫీ? బతికే ఉన్నాడు

మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ హత్యకు కూడా వారు పథక రచన చేసినట్లుగా తెలుస్తోంది. అరెస్టైన ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు విచారించారు. ఆ విచారణలో ఈ విషయం వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది.

హైద్రాబాద్‌పై ఐసిస్, ఇవే టార్గెట్: నెట్ ద్వారా బాంబు తయారీ నేర్చారుహైద్రాబాద్‌పై ఐసిస్, ఇవే టార్గెట్: నెట్ ద్వారా బాంబు తయారీ నేర్చారు

హనుమాన్ శోభాయాత్ర వంటి హిందూ అనుకూల కార్యక్రమాల్లో రాజాసింగ్ లోథ్ కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయనను హత్య చేసేందుకు ఉగ్రవాదులు ఆయన ఇంటి సమీపంలో రెక్కీ కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అయితే, పోలీసులు అరెస్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ISIS Hyderabad- The thought is scarier than the explosives the operatives had

భయానక దాడులకు ప్లాన్!

ఎన్ఐఏ అధికారులు ఐదుగురిని ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. వారిని నాంపల్లి కోర్టులో గురువారం హాజరుపరిచారు. అనంతరం వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

ప్యారిస్ తరహా దాడులు చేయాలని వారు భావించినట్లుగా విచారణలో తేలింది. అప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్.. ప్యారిస్ దాడుల ద్వారా మరోసారి సత్తా చాటింది. హైదరాబాదులో అరెస్టైన వారి నుంచి పోలీసులు ట్రయాసీటోన్, ట్రైపెరాక్సైడ్ వంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో విధ్వంసానికి ఐఎస్ కుట్ర: మదర్ ఆఫ్ సాతాన్ (ఫొటోలు)హైదరాబాద్‌లో విధ్వంసానికి ఐఎస్ కుట్ర: మదర్ ఆఫ్ సాతాన్ (ఫొటోలు)

ఇలాంటి పేలుడు పదార్థాలనే ప్యారిస్, బెల్జియం దాడుల సందర్భంగా ఉపయోగించారు. అలాంటి దాడులనే హైదరాబాదులోను చేయాలని భావించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ప్యారిస్ దాడుల ద్వారా స్ఫూర్తి పొంది, ఇలాంటి దాడులనే భారత్‌లో చేయాలని భావించారని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ ఓ క్యాన్సర్ వ్యాధిలా వ్యాప్తిస్తోంది. సిరియా, ఇరాక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించింది.

English summary
The attack in Paris was big and while it did cause immense amount of damage, it sent across a very dangerous message to the world. The message was the ISIS has gone global and an attack could take place anywhere and at any time. Two days back, five persons from Hyderabad were arrested by the National Investigation for being part of an alleged ISIS module.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X