హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ యువతకూ గాలం వేసిన నిక్కీ: భర్తకు తెలియకుండానే కార్యకలాపాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సామాజిక మాద్యమాల ద్వారా ఆకర్షించి ఐఎస్‌ఐఎస్‌లో చేరేలా యువతను ప్రోత్సహిస్తున్న మహిళా ఉగ్రవాది ఆఫ్సా జాబిన్ అలియాస్ నిక్కీ జోసెఫ్‌ను ఐబీ, ఎన్‌ఐఏ, నిఘావర్గాలు శనివారం ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టాయి. ఆమె నుంచి రాబట్టిన సమాచారం దిగ్భ్రాంతి కలిగించేలా ఉందని పోలీసు వర్గాలే అంటున్నాయి.

అయితే, వివరాలను ఇప్పట్లో వెల్లడించేది లేదని, త్వరలో చెబుతామంటున్నారు. నిక్కీనుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోర్టు ద్వారా పోలీసు కస్టడీలోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన నిక్కీ జోసెఫ్‌ను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ టోలిచౌకికి చెందిన ఆఫ్సా జాబిన్ కొంతకాలంగా నిక్కీ జోసెఫ్‌గా చలామణీ అవుతోంది. హైదరాబాద్ యువతను ఉగ్రవాద కార్యాకలపాల పట్ల ఆకర్షితులయ్యేలా, ఐఎస్‌ఐఎస్‌లో చేరేలా ప్రోత్సహించే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దుబాయ్‌లో నివాసం ఉంటూ హైదరాబాద్ వచ్చిన నిక్కీని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టుకు హాజరుపర్చారు.

ISIS recuiter Indian woman Afsha Jabeen aka Nicky Joseph sent to judicial custody

కాచిగూడలోని న్యాయమూర్తి నివాసంలో నిక్కీని హాజరుపర్చగా, సెప్టెంబర్ 23 వరకు ఆమెకు రిమాండ్ విధించారు. దీంతో నిక్కీని చర్లపల్లి జైలుకు తరలించారు. నిక్కీ ప్రలోభాలకు లొంగి ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్న హైదరాబాద్ యువకుడిని గతంలోనే శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అతని నుంచి సేకరించిన సమాచారంతోనే పోలీసులు కొంతకాలంగా నిక్కీపై నిఘా ఉంచారు.చాలాకాలంగా కాశ్మీర్, ఢిల్లీకి చెందిన పలువురితో సోషల్ మీడియాలో సంబంధాలు పెట్టుకుని ఉగ్రవాద కార్యకలపాలవైపు నిక్కీ ప్రోత్సహిస్తోందన్న విశ్వసనీయ సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది.

కాగా, దుబాయ్‌లో నిక్కీ భర్త ముస్తఫా అలియాస్ దేవేందర్ బాత్రాకు తెలియకుండానే ఆమె ఉగ్రభావజాల వ్యాప్తికి కృషి చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలినట్లు తెలిసింది. పంజాబీ హిందూ అయిన దేవేందర్ దుబాయ్‌లో స్థిరాస్తి వ్యాపారి వద్ద ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. భార్యా పిల్లల పోషణ కోసం దేవేందర్ అష్టకష్టాలుపడుతున్నాడు. రోజూ దాదాపు 15కిలోమీటర్ల మేర నడిచి వెళతానని పోలీసుల ఎదుట గోడువెళ్లబోసుకున్నట్లు తెలిసింది. దేవేందర్ బయటికి వెళ్లిన సమయంలో జబీన్ ల్యాప్ టాప్ ద్వారా ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తూ యువతను ఆకర్షించేది. కాగా, వివాహసమయంలో దేవేందర్ మతం మార్చుకుని ముస్తఫా అని పేరు పెట్టుకున్నాడు.

English summary
An Indian woman, who was arrested here for her alleged involvement in recruitment for ISIS terror outfit, was today sent to 14-day judicial custody by a court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X