• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీ కృష్ణ జన్మాష్టమి: ఊరు.. వాడ ఘనంగా వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఇస్కాన్ దేవాలయాలు

|

జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన అవతారం శ్రీకృష్ణ అవతారం. లోక కల్యాణం కోసం కృష్ణుడిగా జన్మించిన నల్లనయ్య జన్మాష్టమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఇక కృష్ణాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్‌ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్నారు. కృషుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చక్కని అలంకరణలతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకృషుడి వేషధారణలో చిన్నారులు ఆకట్టుకుంటున్నారు. కృష్ణాష్టమి కావడంతో తిరుమల శ్రీవారి ఆలయానికి సైతం భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో సైతం కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లోత్సవం ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.

కృష్ణాష్టమి సందర్భంగా సర్వాంగ సుందరంగా ఇస్కాన్ ఆలయాలు ..

కృష్ణాష్టమి సందర్భంగా సర్వాంగ సుందరంగా ఇస్కాన్ ఆలయాలు ..

ఇక హైదరాబాద్‌లోని ఇస్కాన్ దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తులతో కిటకిటలాడుతుంది. మరోపక్క ఓరుగల్లులోని ఇస్కాన్ దేవాలయంలో శ్రీకృష్ణుడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండే ప్రత్యేక కార్యక్రమాలతో, పూజలతో స్వామీ వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సాయంత్రం వాడవాడలా ఉట్టి కొట్టేందుకు యువత సిద్ధం అవుతున్నారు. మహిళలు చిన్ని కృష్ణుడి పాదాలను ఇళ్ళ ముందు వేసి ఆ క్రిష్ణయ్యను ఇళ్ళలోకి ఆహ్వానిస్తున్నారు. తమ భక్తిని చాటుకుంటున్నారు. చిన్ని క్రిష్ణయ్యల, బుజ్జి గోపికమ్మల సందడి తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది.

 వరంగల్ ఇస్కాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు ...పుష్పాలంకరణలతో ఇస్కాన్ ఆలయం

వరంగల్ ఇస్కాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు ...పుష్పాలంకరణలతో ఇస్కాన్ ఆలయం

వరంగల్ ఇస్కాన్ దేవాలయంలో గత మూడురోజులుగా శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇస్కాన్ దేవాయలంలో కృష్ణాష్టమి సందర్బంగా శ్రీకృష్ణరాధ సమేతులను వివిధ పుష్పాలంకరణతో చాలా అందంగా ముస్తాబు చేశారు. దేవాలయాన్ని రంగులరంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలను తిలకించేందుకు జిల్లా వ్యాప్తంగా వేలాదిగా భక్తులు తరలిరానుండటంతో రాధాసమేత కృష్ణ పరమాత్మను దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. . ఇస్కాన్ దేవాలయంతో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా గోపూజతోపాటు ప్రత్యేక హోమాలు, పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తులకు తీర్ధప్రసాద వితరణ చేస్తున్నారు. శ్రీకృష్షాష్టమి విశిష్టతను భక్తులకు తెలిసేలా కృష్ణుడి లీలా విలాసాలను ప్రదర్శన గావించనున్నారు.

ఉట్టి కొట్టేందుకు సిద్ధం అవుతున్న యువత ...సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ

ఉట్టి కొట్టేందుకు సిద్ధం అవుతున్న యువత ...సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ

ఇక కృషాష్టమి వేడుకల సందర్భంగా కన్నయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన ఉట్టికొట్టే కార్యక్రమంలో పిల్లాపెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొంది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణుడి జీవితానికి సంబంధించిన అంశాలను నాట్యరూపకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ఇక స్కూళ్ళల్లో కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఎక్కడ చూసినా చిన్నారులు గోపికలుగా , మురళీ దారుడిగా కనిపించి కనువిందు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Krishna Janmashtami, the auspicious day that celebrates the birth of Lord Krishna, will be observed on August 24 across the world. In telugu states The devotees of Lord Krishna gather at the beautifully decorated Krishna temples to participate in various special programmes dedicated to life and lessons of Lord Krishna. Bhagavad Gita recitals, bhajan, kirtan and satsang meetings are also held at various temples on Krishna Janmashtami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more