హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాంకాకు మరింత 'టైట్ సెక్యూరిటీ': రంగంలోకి ఇజ్రాయిల్ వెపన్స్.., ఆ 200మందిపై గట్టి నిఘా!

ఇవాంక భద్రత కోసం ఇజ్రాయిల్ పరికరాలను కూడా తెప్పించారు. విధ్వంసాలను పసిగట్టే, యాంటీ ఎక్స్ ప్లోజివ్ ప్రత్యేక పరికరాలను అటు సదస్సు జరిగే హెచ్ఐసీసీ వద్ద, ఇటు ఫలక్ నుమా, ట్రైడెంట్ హోటల్స్ వద్ద ఉంచారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దాదాపు నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇవాంకా ట్రంప్ గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల్లో ఆటో డ్రైవర్ నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగి వరకు ఆమె రాకపోకల గురించే చర్చించుకుంటున్నారు.

Recommended Video

Ivanka Trump in Hyderabad : Security beefed up in Hyderabad

ప్రపంచ పారిశ్రామిక సదస్సు నేపథ్యంలో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన విపరీతమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే సమయంలో ఆమె భద్రతా ఏర్పాట్లు, విడిది, కాన్వాయ్.. ఇలా ప్రతీది ప్రత్యేతకను సంతరించుకుంటూనే వచ్చింది.

 అందుకే టైట్ సెక్యూరిటీ:

అందుకే టైట్ సెక్యూరిటీ:

చాలామందికి ఈ ఏర్పాట్లన్ని ఆర్భాటం అనిపించవచ్చు గానీ అమెరికా అధ్యక్షుడి కుమార్తెగా, అంతకుమించి వ్యాపారవేత్తగా ఇవాంకా ట్రంప్‌కు అంతర్జాతీయ ఉగ్ర ముప్పు పొంచి ఉండటం వల్లే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇరాక్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో అమెరికా ప్రమేయం నేపథ్యంలో ఆయా దేశాలకు చెందిన ఉగ్రవాదులు, సానుభూతిపరుల నుంచి ముప్పు ఉండవచ్చని ఇవాంక పర్యటన సందర్భంగా కేంద్ర నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేయడం కూడా ఇవాంకా భద్రతకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి మరో కారణం.

ఇవాంకా భద్రతపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఎప్పుడూ డేగ కన్నుతో నిఘా కొనసాగిస్తూనే ఉంటారు. అదీగాక, 'మార్వెల్' అనే వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఎప్పుడూ ఇవాంకా వెన్నంటే ఉంటారు. ఇవాంకా చుట్టుపక్కల కదలికలన్ని వీరు నిశితంగా గమనిస్తారు. ఇందుకోసం అమెరికా ప్రత్యేక శాటిలైట్ ను వీరు ఉపయోగించుకుంటారు.

 ఐసిస్ గురి:

ఐసిస్ గురి:

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పై దాడి చేసేందుకు ఐఎస్ఐఎస్ ప్రణాళికలు వేస్తోందని అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారుల నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ రక్షణ పరికరాలను రంగంలోకి దింపినట్టు సమాచారం. ఐసిస్ భావజాలంతో స్ఫూర్తి పొంది ఇటీవలి కాలంలో యూరోప్, అమెరికా దేశాల్లో ఒంటరిగా వచ్చిన వ్యక్తులే దాడులకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒంటరి దాడుల నేపథ్యంలో ఇవాంకా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఇవాంకా వచ్చెన్..: సగం టైమ్ 'రిజర్వ్' లోనే.. ఆ టైమ్ వరకు హోటల్లోనే.. ఆ తర్వాతే?ఇవాంకా వచ్చెన్..: సగం టైమ్ 'రిజర్వ్' లోనే.. ఆ టైమ్ వరకు హోటల్లోనే.. ఆ తర్వాతే?

 10,400మంది పోలీసులు:

10,400మంది పోలీసులు:

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ (జీఈఎస్) సదస్సు కోసం ఇప్పటికే 10,400 మంది పోలీసులను తెలంగాణ సర్కారు మోహరించగా, 8 మంది యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు అనుక్షణం ఇవాంక చుట్టూ పహారా కాస్తున్నారు. మొత్తం ఐదంచెల భద్రతా ఇవాంకాకు పహారా కాయనుంది.

 200మందిపై గట్టి నిఘా:

200మందిపై గట్టి నిఘా:

ఇవాంకాపై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా తీవ్రవాదులు దాడులకు దిగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో.. నగరంలోని ఐసిస్ సానుభూతి పరులపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక నిఘా పెట్టింది. అనుమానం ఉన్న 200 మంది కదలికలను గమనిస్తోంది.

ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు..ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు..

 ఇజ్రాయిల్ పరికరాలు:

ఇజ్రాయిల్ పరికరాలు:

ఇవాంక భద్రత కోసం ఇజ్రాయిల్ పరికరాలను కూడా తెప్పించారు. విధ్వంసాలను పసిగట్టే, యాంటీ ఎక్స్ ప్లోజివ్ ప్రత్యేక పరికరాలను అటు సదస్సు జరిగే హెచ్ఐసీసీ వద్ద, ఇటు ఫలక్ నుమా, ట్రైడెంట్ హోటల్స్ వద్ద ఉంచారు. క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ పహారా నడుమ బుల్లెట్ ఫ్రూఫ్ కారులో ఇవాంకా రాకపోకలు సాగనున్నప్పటికీ.. ముందస్తు జాగ్రత్తగా మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

స్పెషల్ శాటిలైట్, ఆ 11వెపన్స్.. ఇవాంకా వెంట 'మార్వెల్‌', కనీవిని ఎరుగని సెక్యూరిటీ ఇది..స్పెషల్ శాటిలైట్, ఆ 11వెపన్స్.. ఇవాంకా వెంట 'మార్వెల్‌', కనీవిని ఎరుగని సెక్యూరిటీ ఇది..

English summary
Israel millitary equipment is The most advanced technology in the world. Using these equipment for Ivanka Trump protection in her Hyderabad visit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X