వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సీఎంకు సిసలైన అగ్ని పరీక్ష..! ఆర్టీసి కార్మికులతో కేసీఆర్ కు రణమా..? శరణమా..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అసలు సిసలైన అగ్ని పరీక్ష ఎదురుకాబోతోంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన ఆరున్నరేళ్లకు చంద్రశేఖర్ రావుకు మొదటి ఝలక్ తగిలింది. ఆర్టీసి కార్మికుల సమ్మె రూపంలో చంద్రశేకర్ రావుకు తొలిసారి ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణ ఆర్టీసి కార్మికులు తమ న్యమైన డిమాండ్ల కోసం సమ్మెకు పిలుపు ఇవ్వడం, ప్రభుత్వం ఎంత వారించినా ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు వినకపోవడంతో పరిస్థితి జఠిలంగా మారింది. ప్రస్తుతం ఇదే సమస్య ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మెడకు చుట్టుకునే వరకు పరిణమించింది. ఆర్టీసి సమ్మె సమస్యను చంద్రశేఖర్ రావు ఎలా పరిష్కరిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రెచ్చగొట్టి సమ్మె! కేసీఆర్ ధనదాహంతో ఆర్టీసీకి రూ.1500 కోట్ల నష్టం: లెక్క చెప్పిన రేవంత్రెచ్చగొట్టి సమ్మె! కేసీఆర్ ధనదాహంతో ఆర్టీసీకి రూ.1500 కోట్ల నష్టం: లెక్క చెప్పిన రేవంత్

 కేసీఆర్ చతురత చూపాల్సిన సమయం.. ఆర్టీసి కార్మికులతో వైరమా.. స్నేహమా..

కేసీఆర్ చతురత చూపాల్సిన సమయం.. ఆర్టీసి కార్మికులతో వైరమా.. స్నేహమా..

సకల జనుల సమ్మెలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసి సిబ్బంది, తాజాగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు అగ్ని పరీక్షలా పరిణమించారు. తెలంగాణలో ఇక ధర్మాలు ఉండవని ధర్మా చౌక్ మూసేయించిన చంద్రశేఖర్ రావు అదే ధర్నా చౌక్ సాక్షిగా అనేక మంది ఆర్టీసి కార్మిక నేలను అరెస్టు చేయించారు. అంతే కాకుండా సమ్మెలో పాల్గొన్న సిబ్బంది వెంటనే విధుల్లో చేరిపోకపోతే విధుల నుండి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేయడం కూడా ప్రభుత్వానికి శరాఘాతంలా పరిణమించాయి. ఉద్యమ సమయంలో చంద్రశేఖర్ రావు మాట జవ దాటని కార్మికులు ఇప్పుడు ఆయన మాటను భేఖాతరు చేస్తున్నారు. అయితే కార్మికుల అంశం మరింత చేయి దాటిపోక ముందే నయానో భయానో సమస్యను పరిష్కరించాలని చంద్రశేఖర్ రావు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

 సకల జనుల సమ్మెలో ఆర్టీసి సిబ్బందిది కీలక పాత్ర.. ఇప్పుడు కాదంటే కేసీఆర్ కు ఇబ్బందులే..

సకల జనుల సమ్మెలో ఆర్టీసి సిబ్బందిది కీలక పాత్ర.. ఇప్పుడు కాదంటే కేసీఆర్ కు ఇబ్బందులే..

టీఎస్ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం చంద్రశేఖరరావు చిత్తశుద్దిపై స్పష్టత వచ్చే సందర్బం వచ్చిందనే చర్చ జరుగుతోంది. దాదాపు లక్ష పైచిలుకు కార్మికులతో కొనసాగుతున్న టీఎస్ఆర్టీసీలో కార్మికులు జరప తలపెట్టిన సమ్మెను చంద్రశేఖర్ రావు జీర్ణించుకోలేకపోతున్నారు. సమ్మెకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదని, సమ్మెకు దిగే కార్మికులను ఉద్యోగాల్లో నుంచి తొలగించేస్తామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని కూడా చంద్రశేఖర్ రావు ఘాటైన హెచ్చరికలు జారీ చేసారు. అయితే చంద్రశేఖర్ రావు హెచ్చరికలను ఆర్టీసీ కార్మికులు చాలా తేలికగా తీసుకున్నారు. ఉద్యోగాల్లో నుంచి ఎలా తీస్తారో చూస్తాం? అన్న భావనతో సమ్మె మొదలైన శనివారం ఓ 160 మంది కార్మికులు మినహా లక్షకు పైగా కార్మికులు విధులకు దూరంగానే ఉన్నారు. దీంతో తర్వాత చంద్రశేఖర్ రావు ఏంచేస్తారనే అంశంపైనే ఉత్కంఠ నెలకొంది.

 ఉద్యోగులను తొలగిస్తారా..? కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదంటున్న కార్మికులు..

ఉద్యోగులను తొలగిస్తారా..? కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదంటున్న కార్మికులు..

సమ్మె చేస్తున్నారన్న కారణం చూపి ఏకా ఎకిన యాభైవేల మంది ఆర్టీసీ కార్మికులను తొలగించడం చంద్రశేఖర్ రావుకు సాధ్యం కాని పరిస్థితి. అది కూడా ప్రజా రవాణాలో కీలక భూమిక పోషిస్తున్న ఆర్టీసీ లో మొత్తం కార్మికులను ఒకేసారి తొలగించడం అంటే అంత ఆశామాషీ కాదు. తాను హుకుం జారీ చేసినట్టుగా విధులకు హాజరు కాని ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తే తెలంగానలో మరో ఉద్యమం పురుడుపోసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మేకోపోతు గాంభీర్యంతో హెచ్చరికలు చేస్తే కార్మికులు దారికొస్తారన్న అభిప్రాయం తప్ప, నేరుగా ఉద్యోగాల నుండి తొలంగించే సాహసం సీఎం చేయకపోచ్చనే చర్చ జరుగుతోంది. ఇదే అంశంలో చంద్రశేఖర్ రావు తగ్గకుండా, తన ఇగో దెబ్బతినకుండా కార్మికుల సమస్యను ఎలా పరిష్కరిస్తారనే ఆసక్తి నెలకొంది.

 కార్మికుల రూపంలో కేసీఆర్ కు తొలి దెబ్బ... సమ్మె విరమిస్తారా..? కొనసాగిస్తారా..?

కార్మికుల రూపంలో కేసీఆర్ కు తొలి దెబ్బ... సమ్మె విరమిస్తారా..? కొనసాగిస్తారా..?

ఇదిలా ఉండగా సమ్మెతో ఆర్టీసీ కార్మికులకు పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేవనే చెప్పాలి. మహా అయితే సమ్మె కాలానికి వేతనాలు పోతే పోతాయి గానీ, కార్మికులకు జరిగే నష్టమేమీ ఉండదనే చర్చ జరుగుతోంది. మరి ఈ సమ్మె ఆర్టీసీ కార్మికులకు కాకుండా ఇంకెవరికి ఝలక్ ఇచ్చిందన్న అంశానికి వస్తే మాత్రం అది కచ్చితంగా చంద్రశేఖర్ రావుకే ఈ సమ్మె భారీ ఝలక్ ఇచ్చిందని చెప్పక తప్పదు. సీఎం హోదాలో చంద్రశేఖర్ రావు ఇచ్చిన హెచ్చరికలనే కార్మికులు పట్టించుకోలేదంటే, చంద్రశేఖర్ రావుకు శృంగభగం తప్పదనే చర్చ జరుగుతోంది. దీంతో ఆర్టీసి కార్మికులతో రణం కాన్నా శరణమే మేలన్న ధోరణి లో సీఎం సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

English summary
Telangana CM Chandrasekar Rao's first negative conditions had arisen in the form of RTC Workers ' strike. Telangana RTC workers are calling for a strike for their demands, and the government has become so complicated that the RTC trade unions did not listen to them. Currently, the same problem has evolved until the neck of Chief Minister Chandrashekhar Rao is wrapped up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X