హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబేడ్కర్‌ను అవమానించి: రాహుల్‌పై మురళీధర్, కేజ్రీవాల్ అంతేనని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన పైన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు మంగళవారం నాడు స్పందించారు. దళిత నేత అంబేడ్కర్‌ను వేధించిన కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడడం విడ్డూరమని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ మంగళవారం హైదరాబాద్ వచ్చారు. వర్సిటీలో పర్యటించారు. పరోక్షంగా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు.

It is merely politicising of the issue: Muralidhar Rao

దీనిపై మురళీధర రావు స్పందించారు. రాహుల్ గాంధీ ఇప్పుడు రావడం విడ్డూరమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్‌ను ఆయన జీవించినంత కాలం కాంగ్రెస్ పార్టీ వేధించిందన్నారు. ఇప్పుడు దళితులకు తామే ఛాంపియన్లమని చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఎద్దేవా చేశారు.

రోహీత్ ఆత్మహత్య దళిత కోణంలో జరిగింది కాదన్నారు. దీనిని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు విద్యార్థుల పైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.

హఠాత్తుగా రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటించడం ఏమాత్రం సరికాదన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా మురళీధర రావు మండిపడ్డారు. ఆయన తీరు అలాగే ఉంటుందన్నారు. విద్యార్థి సంఘాలు తీవ్రవాదులకు అనుకూలంగా ఉండటమేమిటన్నారు.

English summary
Muralidhar Rao, in a series of tweets, said, "Suicide of Rohith Vemula has nothing to do with Dalit issues or rights just because he was a Dalit. It is merely politicising of the issue."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X