హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంధ్య నాకొడుకును పిచ్చోడ్ని చేసింది, చంపండి: కార్తీక్ తల్లి ఆగ్రహం, ఆవేదన

|
Google Oneindia TeluguNews

Recommended Video

నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమికుడు ! మామూలుగా కాదు, ఘోరం !

హైదరాబాద్: కార్తీక్ తాను ప్రేమించిన సంధ్యా రాణిని పెట్రోలు పోసి సజీవ దహనం చేయడంపై అతని తల్లి ఊర్మిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు మూర్ఖంగా వ్యవహరించాడని అన్నారు. తన కొడుకు చేసిన తప్పుకు ఎలాంటి శిక్ష వేసినా సబబే అని అన్నారు.

అయితే, ఈ ఘటనలో సంధ్యా రాణి చేసిన తప్పులు కూడా చూడాలని అన్నారు. గురువారం సాయంత్రం లాలాగూడలో నడుచుకుంటూ వెళుతున్న సంధ్యారాణి(22)పై కార్తీక్ పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. తీవ్రగాయాలపాలైన సంధ్యారాణి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది.

సంధ్య అంటే ఇష్టమే

సంధ్య అంటే ఇష్టమే

కాగా, కార్తీక్ తల్లి ఊర్మిల ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్ల నుంచి సంధ్యారాణి, కార్తీక్ ప్రేమించుకుంటున్నారని తెలిపింది. సంధ్యారాణి తమ ఇంటికి అప్పుడప్పుడు వచ్చేదని చెప్పింది. తమ కూతురుకు కూడా ఆమె స్నేహితురాలేనని చెప్పారు. సంధ్య అంటే తనకు కూడా ఇష్టమేనని చెప్పింది.

నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కార్తీక్: ఆస్పత్రిలో సంధ్యారాణి మృతి, ‘ప్రేమ వేధింపులు' నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కార్తీక్: ఆస్పత్రిలో సంధ్యారాణి మృతి, ‘ప్రేమ వేధింపులు'

కార్తీక్ సంపాదనంతా సంధ్యకే

కార్తీక్ సంపాదనంతా సంధ్యకే

అయితే, కార్తీక్ తన సంపాదన మొత్తం సంధ్యకే ఇచ్చేవాడని ఊర్మిళ తెలిపింది. సెల్ ఫోన్, బట్టలు, ఇతర వస్తువులు కూడా సంధ్యకు కొనిచ్చేవాడని తెలిపింది. ఓసారి రూ.10వేలు కావాలంటే ఇంట్లో నుంచి తీసుకెళ్లి సంధ్యకు ఇచ్చాడని తెలిపింది.

సంధ్యారాణితో ఐదేళ్ల ప్రేమ, పెళ్లికి ఒప్పుకోలేదు, అందుకే..: కార్తీక్, ‘అవారా' అన్న డీసీపీ సంధ్యారాణితో ఐదేళ్ల ప్రేమ, పెళ్లికి ఒప్పుకోలేదు, అందుకే..: కార్తీక్, ‘అవారా' అన్న డీసీపీ

పెళ్లి చేసుకోనంటూ వారం క్రితం

పెళ్లి చేసుకోనంటూ వారం క్రితం

అయితే కొన్నాళ్ల నుంచి తన కొడుకుకు సంధ్య దూరం ఉంటోందని చెప్పింది. వారం క్రితం కూడా తమ ఇంటికి సంధ్య వచ్చిందని తెలిపింది. తన కొడుకును పెళ్లి చేసుకోనని సంధ్య తేల్చి చెప్పిందని ఆమె తెలిపింది. దీంతో తాను తన కొడుకుకు ఫోన్ చేయవద్దని, తమ ఇంటికి రావద్దని సంధ్యకు చెప్పానని ఊర్మిళ తెలిపింది. ఆమె
వెంట పడొద్దని తన కొడుకు కార్తీక్ కు కూడా చెప్పానని తెలిపింది.

నా కొడుకు బైక్‌పై.. వద్దని చెప్పినా..

నా కొడుకు బైక్‌పై.. వద్దని చెప్పినా..

కానీ, ఏ అవసరం ఉన్నా సంధ్య తన కొడుక్కే ఫోన్ చేసేదని ఊర్మిల తెలిపింది. తను బైటకు వెళ్లాలకున్నా, షాపుకు వెళ్లాలనుకున్నా తన కొడుక్కి ఫోన్ చేసి అతని బైక్ పై వెళ్లేదని ఊర్మిళ తెలిపింది. మరొకరితో పరిచయం వల్లే తన కొడుకును సంధ్య దూరం పెట్టిందని ఊర్మిళ తెలిపింది. ఆ పరిచయం వదులుకోవాలని తన కొడుకు కోరాడని, అందుకు ఆమె ఒప్పుకోలేదని చెప్పింది. ఓసారి సంధ్య ఫోన్ పాడైపోతే కార్తీక్ బాబు చేయించాడని, ఆ సమయంలో సార్ అంటూ ఓ వ్యక్తితో మేసేజ్‌లు ఉండటాన్ని గమనించి, ఆమెను ప్రశ్నించాడని తెలిపింది. ఇలాంటి వద్దు అని ఆమెకు కార్తీక్ చెప్పాడని, ఆమె వినలేదని చెప్పింది.

కార్తీక్‌ను పిచ్చోడ్ని చేసింది..

కార్తీక్‌ను పిచ్చోడ్ని చేసింది..

అయినా, తన కొడుకును పెళ్లి చేసుకోనంటూనే సంధ్య తన కొడుకుతో తిరగేదని చెప్పింది. పెళ్లి చేసుకోనప్పుడు తన కొడుకుతో సంధ్య ఎందుకు తిరిగిందని ఆమె ప్రశ్నించింది. సంధ్య తన కొడుకును పిచ్చొడ్ని చేసిందని ఊర్మిల ఆవేదన వ్యక్తం చేసింది. కాళ్లు గుంజుతున్నాయంటూ తన కొడుకు బైక్ కోసం ఫోన్ చేసేదని తెలిపింది.

చంపితే చంపండి..

చంపితే చంపండి..

తనకు కొడుకు సంధ్యను చంపడం తప్పే, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటారో చంపుతారో చంపండి అని ఊర్మిల కన్నీళ్లపర్యాంతమైంది. సంధ్య తీరుతోనే తన కొడుకు కార్తీక్ ఇంత మూర్ఖంగా తయారయ్యాడని ఆమె తెలిపింది. తన కొడుకు సంధ్యను మరువలేనంటూ చాలా సార్లు చెప్పాడని చెప్పింది.

ఘోరంలో ఇద్దరీ తప్పే.. నేనే పోలీసులకు అప్పగించా..

ఘోరంలో ఇద్దరీ తప్పే.. నేనే పోలీసులకు అప్పగించా..

గురువారం తన కొడుకు కార్తీక్ ఫోన్ చేసి సంధ్యను కలిసి మాట్లాడానని, మొదట చెప్పాడని.. ఆ తర్వాత పెట్రోలు పోసి నిప్పంటించానని తెలిపాడని చెప్పింది. కార్తీక్ ఇంటికి వచ్చిన తర్వాత తానే పోలీసులకు అప్పగించానని ఊర్మిళ తెలిపింది. ఆ తర్వాతే అమ్మాయి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసేందుకు వచ్చారని తెలిపింది. తన కొడుకు చేసింది తప్పేనని, ఏదైనా సమస్యలుంటే పెద్దలకు మాట్లాడాల్సి ఉండేదని ఊర్మిళ అన్నారు. అయితే, ఈ ఘోరం జరగడానికి తన కొడుకు కార్తీక్‌తోపాటు సంధ్య తప్పు కూడా ఉందని చెప్పారు.

English summary
Karthik Mother Urmila on Friday said that his made fault, by killing his lover Sandhya Rani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X