• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

త్వరగా మారండి బాస్: టెక్ మహీంద్రా సీఈవో-కేటీఆర్‌ల మధ్య 'ఇవాంకా' చమత్కారం

|

హైదరాబాద్: టెక్ మహీంద్రాలో గురువారం జరిగిన మిషన్ ఇన్నోవేషన్ 2018లో మంత్రి కేటీఆర్ మాట్లాడిన అనంతరం ఆ సంస్థ సీఈవో సీపీ గుర్నానీ తన ఉద్యోగులకు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఐటీ మంత్రిపై ప్రశంసలు కురిపించారు.

జగన్‌కు ఊహించని షాకిచ్చిన తెలంగాణ మంత్రి కేటీఆర్

టెక్ మహీంద్రాలోని నా సహచరులంతా.. కేటీఆర్ రాక్‌స్టార్ పొలిటీషియన్ అని ప్రకటించారని, చెన్నైలో ఉన్న ఉక్కపోత, బెంగళూరులోని ట్రాఫిక్, ఢిల్లీలో ఉన్న పొగమంచును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామంటూ హైదరాబాద్‌లో అలాంటి ఇబ్బందులు లేవనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

కేటీఆర్ చమత్కారం

దీనిపై మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. మీ ఆఫీసును వెంటనే హైదరాబాద్‌కు మార్చండి అంటూ చమత్కరించారు. 'సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్‌కు మారండి బాస్' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.

 ప్రపంచపటంలో హైదరాబాద్

ప్రపంచపటంలో హైదరాబాద్

అంతకుముందు మిషన్ ఇన్నోవేషన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాదు పేరు ప్రపంచపటంపై నిలవాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని, స్టార్టప్‌లకు అనువైన వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి సారించామని, టీ హబ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పేరుగాంచిందని పేర్కొన్నారు.

 వచ్చే ఏడాది టీ హబ్ ఫేజ్ 2

వచ్చే ఏడాది టీ హబ్ ఫేజ్ 2

వచ్చే ఏడాది టీ హబ్ ఫేజ్ 2ను ప్రారంభించబోతున్నామని, ఇది ప్రపంచంలోనే పెద్ద సంస్థగా ఆవిర్భవించబోతోందని, టెక్ మహీంద్రా ప్రధాన కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయాలని కోరుతున్నానని కేటీఆర్ చెప్పారు.

 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి కానీ

ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి కానీ

హైదరాబాదులో అత్యధిక ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయని, ఇంజనీర్లే ఎవర్లే ఎవరూ లేరని కొందరు వక్తలు పేర్కొన్నారు. ప్రాక్టికల్స్ పరిజ్ఞానం లేక విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారని చెప్పారు. సీఎంకేసీఆర్ ఈ విషయమై ఇతర దేశాల్లో అధ్యయనం చేయాలన్నారు. జర్మనీ, ఆస్ట్రేలియాలో పరిశ్రమలు కళాశాలలు కలిపి పాఠ్యాంశాలను రూపొందిస్తాయని, ఇదే విషయాన్ని ఉన్నత విద్యా మండలి దృష్టికి తీసుకెళ్లామన్నారు.

 ఇవాంకా రావాలని గుర్నానీ, బిర్యానీ కోసమని కేటీఆర్ నవ్వులు

ఇవాంకా రావాలని గుర్నానీ, బిర్యానీ కోసమని కేటీఆర్ నవ్వులు

మిషన్ ఇన్నోవేషన్ 2018లోను టెక్ మహీంద్రా సీఈవో గుర్నానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మంత్రి కేటీఆర్‌ను నవ్వించారు. హైదరాబాదులో రహదారులు మెరుగుపడ్డాయని, ఇవాంకా ట్రంప్ నగరానికి వస్తూనే ఉండాలని నగరవాసులు కోరుకుంటున్నారని గుర్నానీ వ్యాఖ్యానించారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. అవును ఇవాంకాకు ఇక్కడి బిర్యానీ చాలా నచ్చిందని, బిర్యానీ కోసం ఆమె ఇక్కడకు ఎప్పుడైనా రావొచ్చని నవ్వుతూ చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
My associates tech_mahindra have declared you the rockstar politician KTRTRS .. Will indeed consider Chennai ki garmi, Bangalore ki traffic, and Dilli ka smog.. :)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more