హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్రీ వై-ఫై: కేటీఆర్‌తో ఒరాకిల్ ప్రతినిధుల భేటీ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉచిత వై-ఫై సేవలను దశలవారీగా ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇందులో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టూ త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ప్రారంభించబోతున్న ఉచిత వై-ఫై సేవలకు సంబంధించి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి క్వాడ్‌జెన్ కంపెనీ ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందించనుంది. హుస్సేన్‌సాగర్ చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను, ప్రాజెక్టు పనిచేసే విధానాన్ని బీఎస్‌ఎన్‌ఎల్, క్వాడ్‌జెన్ కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

ఉచిత వై-ఫై:కేటీఆర్‌తో ఒరాకిల్ ప్రతినిధుల భేటీ

ఉచిత వై-ఫై:కేటీఆర్‌తో ఒరాకిల్ ప్రతినిధుల భేటీ

హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని ట్యాంక్‌బండ్, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్డులో సుమారు 1800 నుంచి 2500 మంది వరకు వై-ఫై సేవల కోసం ఒకేసారి లాగిన్ కావచ్చని తెలిపారు. సరాసరి 2 నుంచి 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో వై-ఫై పనిచేస్తుందని, ఇక్కడ ఉచితంగా 30 నిమిషాలపాటు సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.

 ఉచిత వై-ఫై:కేటీఆర్‌తో ఒరాకిల్ ప్రతినిధుల భేటీ

ఉచిత వై-ఫై:కేటీఆర్‌తో ఒరాకిల్ ప్రతినిధుల భేటీ

ఇప్పటికే భద్రతా పరమైన పరీక్షలను పూర్తిచేసుకొని, కేంద్ర, రాష్ట్ర శాంతిభద్రతల ఏజెన్సీల నుంచి అనుమతులు తీసుకున్నట్లు వారు వివరించారు. కాగా ప్రజలకు నాణ్యమైన సేవలందించేలా ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.

 ఉచిత వై-ఫై:కేటీఆర్‌తో ఒరాకిల్ ప్రతినిధుల భేటీ

ఉచిత వై-ఫై:కేటీఆర్‌తో ఒరాకిల్ ప్రతినిధుల భేటీ

సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్‌లో ఒక జోన్‌లో వై-ఫై సేవలను పూర్తిస్థాయిలో అందిచేందుకు పనులు ప్రారంభించాలని కోరారు. తమకు నగరంలో ఉన్న 4800 కిలోమీటర్ల ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా హైదరాబాద్‌లోని నలుమూలలా వై-ఫై సేవలను అందించేందుకు వీలవుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

 ఉచిత వై-ఫై:కేటీఆర్‌తో ఒరాకిల్ ప్రతినిధుల భేటీ

ఉచిత వై-ఫై:కేటీఆర్‌తో ఒరాకిల్ ప్రతినిధుల భేటీ

ఒరాకిల్ సంస్ధ ప్రతినిధి బృందం గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావును సచివాలయంలో కలిసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న తీరును మంత్రి వివరించారు. తమ కంపెనీ భవిష్యత్ ప్రణాళికలతో త్వరలోనే మరోసారి కలుస్తామని వారు మంత్రికి తెలిపారు.

 ఉచిత వై-ఫై:కేటీఆర్‌తో ఒరాకిల్ ప్రతినిధుల భేటీ

ఉచిత వై-ఫై:కేటీఆర్‌తో ఒరాకిల్ ప్రతినిధుల భేటీ

కేటీఆర్‌ను కలిసినవారిలో ఒరాకిల్ జనరల్ మేనేజర్, సీనియర్ ఉపాధ్యక్షుడు క్రిస్ కెడ్లీ, ఒరాకిల్ ఇండియా ఎండీ శైలేందర్‌కుమార్ యతిన్, కంపెనీ సీనియర్ ప్రతినిధులు ఉన్నారు.

English summary
On Wednesday morning, Kalvakuntla Taraka Rama Rao more aptly known as KTR, the IT and Panchaytraj minister in the state cabinet of Telangana, was called on by the delegates of prestigious Oracle Company, at the state secretariat. It is learnt that discussions regarding the investments in the software filed and facilities for the same was discussed during the said meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X